గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐఎఎస్ అధికారి సతీష్ చంద్రకు, సిఎం జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత పాత సిఎంఒ అధికారులను తప్పించిన సిఎం జగన్, తర్వాత వారిలో ఒక్కరికే పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన ముగ్గురిలో సతీష్ చంద్రను ఇంత కాలానికి ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ముఖ్య కార్యదర్శిగా పని చేసిన జి. సాయిప్రసాద్, కార్యదర్శిగా పని చేసిన ఎ. రాజమౌళి లకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు.
2019-11-02ప్రధానమంత్రి ఆవాస యోజన (పట్టణ) పథకం కింద దేశవ్యాప్తంగా 2,31,532 ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో ఆంధ్రప్రదశ్ రాష్ట్రానికే 1,24,624 ఇళ్ళు మంజూరయ్యాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 52,446 ఇళ్లు మంజూరయ్యాయి. తాజా మంజూరుతో.. ఈ రెండు రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత గృహ అవసరాలు 100 శాతం తీరతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీలో 13.78 లక్షల ఇళ్లు, యూపీలో 15 లక్షల ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో అవసరం కాగా అనేక విడతలుగా ఆ మొత్తాన్ని మంజూరు చేశారు.
2019-11-02‘‘భవన నిర్మాణ కార్మికులు ఎవరు ఆత్మహత్య చేసుకుంటున్నారు? వాళ్ళకు తెలియదా.. ఇది అన్ సీజన్ అని? ఈ అన్ సీజన్లో ఎవరైనా చేసుకుంటారా (ఆత్మహత్య)?’’ అని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మరో మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏదో ఒక కారణంతో ఆత్మహత్య చేసుకున్నవారిని ఇసుక కొరతతో ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
2019-10-30భారతీయ రిజర్వు బ్యాంకుకు రఘురామ్ రాజన్ నాయకత్వం వహించిన కాలమే అత్యంత చెత్త దశ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు గురువారం ధీటైన స్పందన వచ్చింది. తాను రిజర్వు బ్యాంకు గవర్నరుగా పని చేసిన కాలంలో మూడింట రెండొంతులు బీజేపీయే అధికారంలో ఉందని రఘురామ్ రాజన్ గుర్తు చేశారు. రాజన్ 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు రిజర్వు బ్యాంకు గవర్నరుగా పని చేశారు. తాను ఉన్నప్పుడు పారు బకాయిలను తగ్గించే ప్రయత్నం చేశానని, అది ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.
2019-10-31రాజధానిని, హైకోర్టును ఇప్పుడు వేరొక చోటకు తరలించడం సాధ్యం కాదని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాధ్రీశ్వరరావు చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు లను ప్రస్తుతం ఉన్నచోటనే కొనసాగించి.. శాఖాధిపతుల కార్యాలయాలను జిల్లాల్లో ఏర్పాటు చేయడం ద్వారా వికేంద్రీకరణ చేపట్టాలని ఆయన సూచించారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి శోభనాద్రీశ్వరరావు తన అభిప్రాయాలను తెలిపారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
2019-10-31ఐదేళ్ళపాటు ఆహార దీక్ష చేసిన లోకేష్, నిన్న ఐదు గంటలు నిరాహార దీక్ష చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇసుక సంక్షోభంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిన్న గుంటూరులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన దీక్షపై విజయసాయి మాట్లాడారు. లోకేష్ దీక్ష వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తమ సమస్యలు తీర్చగలడని ప్రజలు నమ్మితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయేవారని విజయసాయి ప్రశ్నించారు.
2019-10-31గోదావరి – కృష్ణా అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. పోలవరం కుడి కాలువ సామర్ధ్యాన్ని పెంచి కృష్ణా నదికి... అక్కడినుంచి సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి, వెలిగొండ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు నీటిని తరలించాలన్నది ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు రూ. 60 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో ఈ అంశంపై చర్చించారు.
2019-10-29ప్రభుత్వంలో విలీనం అనే అంశం మినహా మిగిలిన అంశాలపై చర్చిద్దామని తాము ఆర్టీసీ యూనియన్ల నేతలతో చెప్పినా వారు వినలేదని, తమవాళ్లతో మాట్లాడి వస్తామని వెళ్ళి తిరిగి రాలేదని అధికారులు ఆరోపించారు. కోర్టు చెప్పిన అంశాలపైనే తాము చర్చలకు సిద్ధమయ్యామని, కానీ యూనియన్ల నేతలు అన్ని డిమాండ్లపైనా చర్చించాలని పట్టుపట్టారని అధికారులు చెప్పారు. గంటన్నర పాటు చర్చలు జరిగాయని వారు చెప్పారు.
2019-10-26జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత తొలి లెఫ్టినెంట్ గవర్నరుగా ఐఎఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్మును కేంద్రం నియమించింది. ఆయనతోపాటు మరో ఐఎఎస్ ఆర్.కె. మాథుర్‌ను లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమించింది. స్వయంప్రతిపత్తిగల ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి గవర్నరుగా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ తాజాగా గోవాకు బదిలీ అయ్యారు. 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్ అధికారి అయిన ముర్ము కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (వ్యయ విభాగం) కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
2019-10-25ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనపైన ఏపీలో ఓ ప్రయోగం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. "ఏపీలో ఏ మన్నూ జరగలేదు. ఏం చేశారు? కమిటీ వేశారు. ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి" అని గురువారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అనేది భూగోళం ఉన్నంత వరకు జరగదని ఉద్ఘాటించారు. ఏపీలో ఏం జరుగుతుందో మూడు నెలలకో.. ఆరు నెలలకో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
2019-10-24