కేంద్ర ప్రభుత్వం తొలిసారి ‘‘సుపరిపాలనా సూచీ (జిజిఐ)’’ని బుధవారం విడుదల చేసింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. తమిళనాడు దాదాపు అన్ని ప్రమాణాల్లోనూ ముందుండి నెంబర్ 1గా నిలిచింది. తర్వాత మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ గఢ్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25ని ‘సుపరిపాలనా దినం’గా నిర్వహిస్తున్నారు.
2019-12-25క్రికెట్ దిగ్గజం, మాజీ ఎంపీ సచిన్ టెండూల్కర్ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ‘X’ కేటగిరి నుంచి తగ్గించింది. ఇప్పటిదాకా ఆ కేటగిరి కింద 24 గంటలూ ఒక కానిస్టేబుల్ కాపలా ఉంటుండగా, ఇకపైన సచిన్ బయటకు వెళ్ళే సమయంలో మాత్రమే భద్రత కల్పిస్తారు. అదే సమయంలో... మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాకరే భద్రతను ‘వై’ కేటగిరి నుంచి ‘జడ్’ కేటగిరికి పెంచారు.
2019-12-25ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో పులివెందుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, పులివెందులలో రూ. 347 కోట్ల అంచనాతో చేపట్టిన మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చిత్రావతి రిజర్వాయర్ నుంచి పులివెందుల, లింగాల, ఎర్రబెల్లి లకు తాగునీరు అందించే పథకానికి కూడా శంకుస్థాపన చేశారు.
2019-12-25తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఉద్యోగ విరమణ వయసు 60గా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసు 58గా ఉండేది. విభజన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ 60 ఏళ్ళ వరకు అవకాశం ఇచ్చాయి. వారితో సమానంగా తమకూ 60 చేయాలని ప్రభుత్వ కార్పొరేషన్లు కోరుతూ వచ్చాయి.
2019-12-25పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనల మధ్య కేంద్ర మంత్రివర్గం జాతీయ జనాభా రిజిస్ట్రీ (ఎన్.పి.ఆర్) సవరణ ప్రక్రియకు ఆమోదం తెలిపింది. మరి ఎన్.పి.ఆర్.లో ఏముంది? పౌరులు ఈసారి కుటుంబ సమాచారంతోపాటు తల్లిదండ్రుల పుట్టుక వివరాలనూ సమర్పించాల్సి ఉంటుంది. తల్లి, తండ్రి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పుట్టారన్న సమాచారం ఇవ్వాలి. 2010లో చేపట్టిన జనాభా రిజిస్ట్రీ ప్రక్రియలో 15 అంశాలపై సమాచారం సేకరించగా ఈసారి 21 అంశాలపై సేకరిస్తారు.
2019-12-24చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు రూపొందించిన ‘‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. తన జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరం వేదికగా ఈ పథకానికి అంకురార్పణ చేసిన సిఎం, 80 వేల చేనేత కుటుంబాల అకౌంట్లకు రూ. 24 వేల చొప్పున లాంఛనంగా జమ చేశారు. మొత్తం రూ. 196 కోట్లు రెండు గంటల్లో అకౌంట్లలో జమ అవుతాయని ప్రకటించారు.
2019-12-21నాగ్ పూర్- ముంబై ‘ఎక్స్ ప్రెస్ వే’కు బాల్ థాకరే పేరు పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రహదారి పూర్తి పేరు ఇలా ఉంటుంది. ‘‘హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’’. నాగ్ పూర్- ముంబై ఎక్స్ ప్రెస్ వే మహారాష్ట్రలో కీలక రహదారి. నాగ్ పూర్ ఆర్.ఎస్.ఎస్. కేంద్రమే కాదు. మహారాష్ట్రకు శీతాకాల రాజధాని. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడ జరుగుతాయి. శివసేన ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక ఈ మార్పు జరగడం గమనార్హం.
2019-12-21రైతుల నుంచి తీసుకున్న భూములన్నీ తిరిగి ఇచ్చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన కొద్ది గంటల్లోనే... అందుకు పూర్తి విరుద్ధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. రైతుల వద్ద తీసుకున్న భూములకు బదులు అభివృద్ధి చేసిన ప్లాట్లే ఇస్తామని, అసైన్ మెంట్ భూములను మాత్రమే అసలు లబ్దిదారులకు తిరిగి ఇస్తామని వివరించారు. పెద్దిరెడ్డి చెప్పింది కూడా కేవలం అసైన్ మెంట్ భూముల వరకేనని బొత్స చెప్పుకొచ్చారు.
2019-12-20ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి (ఇడిబి) మాజీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను నిలిపివేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (సిఎటి) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కృష్ణకిషోర్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ కృష్ణకిషోర్ ‘క్యాట్’ను ఆశ్రయించారు. కేంద్ర సర్వీసులనుంచి వచ్చిన కృష్ణకిషోర్ పై చర్యలు తీసుకోవడం రాష్ట్ర పరిధిలోకి రాదని ఆయన తరపు న్యాయవాదులు ‘క్యాట్’లో వాదించారు. ఈ నెల 24న తదుపరి విచారణ జరగనుంది.
2019-12-16మహిళలపై అత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు పాల్పడినవారికి ఉరిశిక్ష విధించే ప్రొవిజన్లతో కొత్త చట్టం తేవాలన్న ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ‘‘ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2019 (ఏపీ దిశ చట్టం)‘‘కు ఆమోదం తెలిపిన కేబినెట్, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకోసం ‘‘ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగనెస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019’’కు కూడా పచ్చ జెండా ఊపింది. అత్యాచార నేరాల విచారణకు ఇప్పుడున్న 4 నెలల సమయాన్ని ‘‘దిశ చట్టం’’ 21 రోజులకు తగ్గిస్తుంది.
2019-12-11