జనాభాలో తొలి స్థానంలో ఉన్న చైనా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయంలోనూ మిగిలిన పెద్ద దేశాలకంటే చాలా ముందుంది. దేశంలోని 127.4 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయినట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. అంటే, 85.64 శాతం జనాభాకు వ్యాక్సిన్ కోర్సు పూర్తయింది. అదే సమయంలో ఇండియాలో 58.59 కోట్ల మందికి (42.5% జనాభాకు) రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు 60.9 శాతం.

2021-12-29

నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలలో తెలంగాణ పురోగమనంతో 4వ ర్యాంకు నుంచి 3కు ఎగబాకింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగింది. "హెల్తీ స్టేట్స్- ప్రోగ్రెసివ్ ఇండియా" పేరిట రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య సూచీల నివేదిక(2019-20)ని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ స్కోరు (69.95)ను తెలంగాణ (69.96) అతి స్వల్ప తేడాతో అధిగమించింది. 3, 4 రౌండ్ల మధ్య తెలంగాణ స్కోరు 4.22 పాయింట్లు పెరగడమే ఇందుకు కారణం.

2021-12-27

నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలలో కేరళ మరోసారి ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. డబుల్ ఇంజిన్ అభివృద్ధికి చిరునామాగా ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న ఉత్తరప్రదేశ్ ఆఖరి స్థానంలో కొనసాగింది. పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ చివరి మూడు స్థానాల్లో సెటిలయ్యాయి. కేరళ స్కోరు 82.20 కాగా యూపీ స్కోరు 30.57 మాత్రమే! అయితే పెరుగుదల రేటులో యూపీ మొదటి స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.

2021-12-27

యూపీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారుతో తొక్కించిన రైతుల కుటుంబాలకు చత్తీస్ గఢ్, పంజాబ్ రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ. 50 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించాయి. లఖీంపూర్ ఖేరి వద్ద సామూహిక హత్యకు గురైన నలుగురు రైతులకు, ఓ జర్నలిస్టుకు ఈ సాయం అందనుంది. పార్టీ నేత రాహుల్ గాంధీతో కలసి బుధవారం బాధిత కుటుంబాల పరామర్శకు వచ్చిన ఆ రాష్ట్రాల సిఎంలు భూపేష్ బఘేల్, చరణ్ జిత్ చన్ని సాయంపై ప్రకటనలు చేశారు.

2021-10-06

డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) బిల్లు 2021 సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏదైనా బ్యాంకు విఫలమైతే డిపాజిటర్లకు 90 రోజులలోగా ఐదు లక్షల వరకు చెల్లించేందుకు ఈ సవరణ వీలు కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బుధవారం కేబినెట్ సమావేశం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. విదేశీ బ్యాంకుల ఇండియన్ బ్రాంచిలు సహా వాణిజ్య బ్యాంకులన్నిటిలోని డిపాజిట్లకు డిఐసిజిసి బిల్లు బీమా కల్పిస్తుందని ఆమె చెప్పారు.

2021-07-28

ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నిటినీ 2023-24 నాటికి రైలు, విమాన మార్గాలతో అనుసంధానిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. శనివారం ఆయన మణిపూర్ రాజధాని షిల్లాంగ్ శివార్లలో అంతర్రాష్ట్ర బస్ టెర్మినస్ (ఐ.ఎస్.బి.టి)ని షా ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతీయ మండలి (ఎన్.ఇ.సి), రాష్ట్ర ప్రభుత్వం 90:10 నిష్ఫత్తిలో రూ. 48 ఖర్చుతో ఈ టెర్మినస్ ను నిర్మించాయి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2021-07-24

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) బడ్జెట్ 2016-17లో ఉన్న రూ. 33.17 కోట్ల నుంచి 2017-18లో అమాంతం రూ. 333.58 కోట్లకు పెరిగిందని, పెగాసస్ స్పైవేర్ కోసం ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఒకు వందల కోట్లు చెల్లించింది అదే సంవత్సరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు 2018-19లో మండలి ఏకంగా రూ. 812 కోట్లు ఖర్చు చేసింది. జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, జడ్జిలు, ఎన్నికల అధికారుల ఫోన్లను హ్యాక్ చేయడానికి స్పైవేర్ ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఎ బడ్జెట్ జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (ఎన్.ఎస్.సి.ఎస్) పరిధిలోకి వస్తుంది.

2021-07-23

‘‘ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణలను సోమవారం ఎత్తివేస్తున్న నేపథ్యంలో.. ఐసోలేషన్ నుంచే ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మంత్రివర్గ సహచరుడు సాజిద్ జావిద్ కు కరోనా సోకడంతో ప్రధాని బోరిస్, ఆర్థిక మంత్రి రిషి సునక్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. జాగ్రత్తలు పాటించాలని, అవసరమైనప్పడు ఐసోలేషన్ లోకి వెళ్లాలని, చెప్పినప్పుడు టీకా వేయించుకోవాలని ప్రధాని ప్రజలకు విన్నవించారు.

2021-07-18

హర్యానాలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం 100 మంది రైతులపై ‘దేశద్రోహం’ కేసు నమోదు చేసింది. బిజెపి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా కారుపై ఈ నెల11న దాడి చేశారన్నది రైతులపై ఉన్న అభియోగం. ‘దేశద్రోహ’ చట్టాన్ని వలస పాలన వారసత్వంగా సుప్రీంకోర్టు ఈసడించిన రోజునే హర్యానా పోలీసులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం గమనార్హం. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, హర్యానాలో బిజెపి- జననాయక్ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వ నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేపట్టారు.

2021-07-15

రద్దయిన సెక్షన్ కింద ఆరేళ్లుగా కేసులు నమోదు చేయడమేంటని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఐటి చట్టం-2000లోని సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులను సత్వరమే ఉపసంహరించుకోవాలని, ఇక ముందు నమోదు చేయవద్దని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ సెక్షన్ ను 2015 మార్చిలో సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, పోలీసులకు అవగాహన కల్పించాలంటూ 2019 జనవరి 14న కేంద్ర ఐటి శాఖ రాష్ట్రాలను ఆదేశించిందని కూడా హోంశాఖ తన లేఖలో పేర్కొంది.

2021-07-14
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page