వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల కేన్సర్లకూ ఫిబ్రవరి 1 నుంచి ఉచిత వైద్యం అందించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇదివరకు కేన్సర్ పేషెంట్లకు ముష్ఠి వేసినట్టు సాయం చేసేవారని, కొన్ని రకాల కేన్సర్లకే ఆరోగ్య శ్రీ వర్తించిందని చెప్పారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్యక్రమ విస్తరణ పైలట్ ప్రాజెక్టును సిఎం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఆ జిల్లాలో శుక్రవారం నుంచి 2059 వ్యాధులకు ఈ పథకం వర్తిస్తుంది.

2020-01-03

పాకిస్తాన్ గగనతలంపై విమానాలు నడిపే పౌర విమానయాన సంస్థలకు,పైలట్లకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాద, తీవ్రవాద చర్యల ప్రమాదం ఉన్నందున అమెరికా ఎయిర్ లైన్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) ఈమేరకు ‘‘నోటీస్ టు ఎయిర్ మెన్ (నోటమ్-NOTAM) జారీ చేసింది. ఈ నోటీసు అమెరికా కేంద్రంగా పని చేసే అన్ని విమాన యాన సంస్థలకు, పైలట్లకు వర్తిస్తుంది.

2020-01-03 Read More

పారదర్శక పాలన అందిస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదికపైనే ప్రకటించారు. అయితే, ఆచరణ అందుకు భిన్నంగా ఉందనడానికి రహస్య జీవోలు ఓ ఉదాహరణ. 2019 సంవత్సరం చివరి రోజైన డిసెంబరు 31వ తేదీనే ఏకంగా 80 రహస్య జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. అందులో సింహభాగం పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించినవే. ఆర్థిక శాఖకు సంబంధించి 2, రెవెన్యూ, మహిళా సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి ఉన్నాయి.

2020-01-01 Read More

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభం వాయిదా పడింది. జనవరి 1నే గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించాలనుకున్నా, అన్ని చోట్లా వసతుల కల్పన పూర్తి కాలేదు. దీంతో, ఈ నెల 26 నాటికి పూర్తి చేసి ఆ రోజే ప్రారంభించాలని సిఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని చోట్లా కంప్యూటర్లతో సహా కనీస సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినా, సుమారు సగం కార్యాలయాల్లో ఇంకా సమకూరలేదని సమచారం.

2020-01-01

ఏపీలో ఆర్టీసీ పేరు మారింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ‘‘ప్రజా రవాణా శాఖ (పి.టి.డి)’’ ఉద్భవించింది. రాష్ట్ర రవాణా శాఖ, రోడ్లు -భవనాల శాఖల పరిపాలనా నియంత్రణలో పి.టి.డి. పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరి 1న ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది.

2019-12-31

2020 చారిత్రాత్మక సంవత్సరం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలతో ‘‘స్పందన’’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ జనవరి 3న, కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ ఫిబ్రవరి 1న చేపట్టనున్నట్టు సిఎం చెప్పారు.

2019-12-31

ఢిల్లీ ప్రగతి మైదాన్ మెట్రో స్టేషన్ పేరును మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపైన దాన్ని ‘‘సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్’’గా వ్యవహరించనున్నారు. పేర్లపై ఏర్పాటైన కమిటీ మంగళవారం తీసుకున్న నిర్ణయాలను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. ‘‘ముకర్బా చౌక్’’కు, అక్కడి ఫ్లై ఓవర్ కు కార్గిల్ యుద్ధ అమర వీరుడు ‘‘కెప్టెన్ విక్రమ్ బాత్రా’’ పేరు పెట్టగా, ఎంబి రోడ్ పేరును ‘‘ఆచార్య శ్రీ మహాప్రగ్య మార్గ్’’గా మార్చినట్టు చెప్పారు.

2019-12-31 Read More

కొత్త సంవత్సరం ఆరంభానికి కొద్ది గంటల ముందు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్.పి.ఎఫ్) పేరు మారింది. ఇకపైన రైల్వే పోలీసు విభాగాన్ని ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసు (ఐ.ఆర్.పి.ఎస్)గా వ్యవహరించనున్నారు. ఆర్పీఎఫ్‌కు వ్యవస్థీకృత గ్రూప్ ఎ హోదా (OGAS) ఇచ్చిన తర్వాత పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

2019-12-31 Read More

ఇటీవలి వరకు తీవ్రంగా కొరతను ఎదుర్కొన్న సరుకు ఇసుక. ఇకపైన ఇసుకను ఇంటివద్దకే డెలివరీ ఇస్తామంటోంది ప్రభుత్వం. తొలుత జనవరి 2న కృష్ణా జిల్లాలో ప్రారంభించి, 7న ఉభయ గోదావరి, కడప జిల్లాల్లోనూ డోర్ డెలివరీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 20 నాటికి రాష్ట్రమంతటా ఇసుకను ఇంటివద్దకే పంపే ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

2019-12-30

రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి. ఆయన కార్యాలయం రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుంది. సిఎంఒలో పని చేసే కార్యదర్శులు ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించి సిఎంకు అవసరమైన మేరకు వివరించి సంతకాలు తీసుకుంటారు. ఇప్పుడలాంటి కీలక వ్యవస్థలో ఫైళ్ళు కుప్పలు తెప్పలుగా పేరుకున్నట్టు సమాచారం. ఫైళ్ళు సిఎం వద్దకు వెళ్ళడమే తప్ప తిరిగి రావడంలేదని వివిధ శాఖల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

2019-12-26 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page