ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ హైదరాబాద్‌ విభాగం జేడీగా నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు అమిత్ షా బదులిచ్చారు. లేఖను పరిశీలనకోసం సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపినట్టు అందులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుత జేడీ కూడా తెలుగువాడేనని పేర్కొంటూ గత నెల 30న విజయసాయి రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. లేఖ ప్రతులను కేంద్ర మంత్రులు అమిత్ షా, రవిశంకర్‌ ప్రసాద్‌ లతో పాటు సీబీఐ డైరెక్టర్‌కు కూడా పంపారు.

2020-01-11

కేరళలోని పాఠశాలలు, కళాశాలల ఉదయపు అసెంబ్లీలలో రాజ్యాంగ ప్రవేశికను పఠించేలా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం చెప్పారు. విద్యా బోధనలో రాజ్యాంగ అధ్యయనం తప్పనిసరి చేయాలన్న కళాశాల యూనియన్లు విన్నవించిన నేపథ్యంలో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం, దాని విలువలు దాడికి గురవుతున్న దశలో, సామాజిక చైతన్యాన్ని పెంచవలసిన అవసరం ఉందని విజయన్ అభిప్రాయపడ్డారు.

2020-01-07 Read More

వరంగల్, కరీంనగర్ మాత్రమే కాకుండా అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐ.టి. పరిశ్రమను విస్తరిస్తామని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు చెప్పారు. మంగళవారం ఆయన వరంగల్ నగరంలో టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీల కొత్త బ్రాంచిలను ప్రారంభించారు. సైయంట్ కంపెనీలో 600 టెక్ ఉద్యోగాలు ఉన్నట్టు కంపెనీ అధినేత బివిఆర్ మోహన్ రెడ్డి తెలిపారు.

2020-01-07

అమృత్ సర్ రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో పునర్నిర్మితం కానుంది. అందుకు సంబంధించిన ఊహాచిత్రమే పై ఫొటో. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐ.ఆర్.ఎస్.డి.సి) ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనుంది. ఎయిర్ పోర్టు తరహా లక్షణాలతో రైల్వే ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం.

2020-01-07

మంగంగపే బరైటిస్ ఘనుల్లో ఫుల్లెరీన్ ఖనిజాన్ని వెలికి తీసేందుకు ప్రయోగాత్మకంగా ఓ ప్లాంటును మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామని ‘లైనెక్స్ బయోసైన్స్’ అనే కంపెనీ వెల్లడించింది. సోమవారం రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అంశంపై నిర్వహించిన సమావేశంలో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. బరైటిస్ కోసం వెలికి తీసే బ్లాక్ షెల్ నుంచి ఫుల్లెరీన్ ఖనిజాన్ని వేరు చేయడానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అవసరమని కంపెనీ చెబుతోంది.

2020-01-06

ముఖ్యమంత్రి నివాసం ఉన్న తాడేపల్లి, సమీపంలోని మంగళగిరి, తన సొంత నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ఈసారి ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు. కచ్చితంగా ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు.

2020-01-06

రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలలో 19,769 కిలోమీటర్ల పొడవున భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి రూ. 23,037 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదించారు. సోమవారం పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సిఎం సమీక్ష నిర్వహించారు. లక్షకు పైగా జనాభా ఉన్న 34 మున్సిపాలిటీల వరకు తీసుకుంటే... భూగర్భ డ్రైనేజీకి రూ. 11,181 కోట్లు అవసరమని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు.

2020-01-06

టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన పాలకమండలి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం గతంలోలా రెండు రోజులే అమలు చేయాలని నిర్ణయించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. ధనుర్మాస కైంకర్యాలు పూర్తయిన తర్వాత ఈ తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. వీవీఐపీల మహా లఘుదర్శనం పూర్తయిన తర్వాత సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.

2020-01-05

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా... ఉపసంహరణకు కేంద్రం ససేమిరా అంటోంది. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సిఎఎను ఉపసంహరించదు’’ అని బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఉద్ఘాటించారు. సిఎఎపై అవగాహన కల్పించడానికంటూ బిజెపి జోద్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో షా మాట్లాడారు. ప్రతిపక్షాలన్నీ కలసినా కూడా బిజెపి తన నిర్ణయాన్ని రివర్స్ చేయబోదని షా స్పష్టం చేశారు.

2020-01-04 Read More

తెలంగాణ వ్యాప్తంగా అన్ని వాగులపైనా అవసరమైనన్ని చెక్ డ్యాములు నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరం సగం ప్రాంతాల్లో నిర్మించి, వచ్చే ఏడాదికి మొత్తం పూర్తి చేయాలని సూచించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించిన చెరువులు పాడవకుండా చూడాలని చెప్పారు. కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు.

2020-01-03
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page