ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పి.ఎ.సి.ఎస్.ల)కు 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పి.ఎ.సి.ఎస్.లకు నియమించిన పర్సన్ ఇన్ఛార్జిల పదవీ కాలం ముగుస్తున్నందున నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇంతవరకు పి.ఎ.సి.ఎస్.లకు ఎన్నికలు జరగలేదు. 2013లో ఏర్పాటైన పాలక మండళ్ళ పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసింది.

2020-01-29

మోడీ ప్రభుత్వం ‘పిఎం కిసాన్’ పథకంలో భాగంగా 14.5 కోట్ల రైతులకు ఏటా మూడు కిస్తీలుగా రూ. 6,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. కానీ, తొలి ఏడాది (01-12-2018 నుంచి 30-11-2019 వరకు) కేవలం 26.6 శాతం మందికే రూ. 6,000 అందినట్టు ‘ద వైర్’ పేర్కొంది. 44 శాతం మందికి రెండు కిస్తీలు (రూ. 4000) అందాయి. మొత్తంగా 52 శాతం మందికి కేవలం ఒకే కిస్తీ (రూ. 2000 మాత్రమే) అందితే.. 48 శాతానికి అది కూడా రాలేదు. అంటే.. 6.8 కోట్ల రైతు కుటుంబాలకు ఒక్క రూపాయీ అందలేదు.

2020-01-28

ఏపీ శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని నిన్న రాత్రే శాసనసభ ఆమోదించింది. ఆ తీర్మాన ప్రతితో పాటు ఓటింగ్ వివరాలను శాసనసభ సచివాలయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. కొద్ది గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాపీలను కేంద్ర హోం శాఖకు, ఎన్నికల సంఘానికి పంపినట్లు అధికార వర్గాల సమాచారం. రాజధాని మార్పునకు ఉద్ధేశించిన బిల్లులకు మండలి బ్రేకులు వేయడంపై మండిపడ్డ సిఎం జగన్, రద్దు ప్రక్రియను శరవేగంగా నడిపిస్తున్నారు.

2020-01-28

భీమా కొరెగావ్ కేసును ఎన్.ఐ.ఎ.కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వ్యాఖ్యానించారు. ఎన్.ఐ.ఎ. చట్టం ప్రకారం తన జాబితాలోని నేరాలకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు అయినా చేపట్టవచ్చు. అందులో రాష్ట్రాలకు పరిమితమైన పాత్ర ఉంటుంది. ఈ కేసులో ‘సిట్’ వేయాలా వద్దా? అన్న అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే క్రమంలో కేంద్ర హోంశాఖ ఎన్.ఐ.ఎ.కు అప్పగించింది.

2020-01-25

రైతులకు వ్యతిరేకంగా భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగంలోకి దింపడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగానే రోహత్గీ భారత 14వ అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు. 2014 జూన్ 19న బాధ్యతలు స్వీకరించారు. మోడీ ఆయనను ఎందుకు ఎంచుకున్నారంటే.. ఫ్లాష్ బ్యాక్ లోకి పోవాలి. 2002 గుజరాత్ అల్లర్లు, ఫేక్ ఎన్కౌంటర్ల కేసుల్లో మోడీ ప్రభుత్వం తరపున రోహత్గీ సుప్రీంకోర్టులో వాదించారు మరి!

2020-01-22

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో రైతులు దాఖలు చేసిన పిటిషన్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రంగంలోకి దిగారు. ఆయనకు ఫీజు చెల్లించేందుకు వీలుగా రూ. 5 కోట్లను ప్లానింగ్ శాఖ కార్యదర్శికి విడుదల చేయాలని, అందులో కోటి రూపాయలను అడ్వాన్సుగా రోహత్గీకి చెల్లించాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబర్ 1) ఇచ్చింది.

2020-01-22

ముంబై-అహ్మదాబాద్ సెమీ హై స్పీడ్ ‘తేజస్’ రైలు శుక్రవారం ప్రారంభమైంది. భారతీయ రైల్వేల సబ్సిడరీ ఐ.ఆర్.సి.టి.సి. ప్రారంభించిన రెండో రైలు ఇది. మొదటి తేజస్ రైలు లక్నో, ఢిల్లీ మధ్య గత ఏడాది ప్రారంభమైంది. ముంబై-అహ్మదాబాద్ రైలును శుక్రవారం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రారంభించారు. ఈ రైలును 19వ తేదీ నుంచి వాణిజ్యపరంగా నడిపించనున్నారు. వారానికి ఆరు రోజులపాటు ఉదయం 6:40 గంటలకు అహ్మదాబాద్ లో బయలుదేరి 13:10కి ముంబై చేరుకుంటుంది.

2020-01-17 Read More

అమరావతి ఉద్యమంలో పాల్గొన్నవారి పాస్ పోర్టులు రద్దవుతాయనే బెదిరింపులు సామాజిక మాథ్యమాల్లోనూ, వార్తలు మీడియాలోనూ దర్శనమిచ్చాయి. ఈ ప్రచారం విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం వరకు చేరడంతో స్పష్టమైన ప్రకటన వెలువడింది. ఆందోళనకారుల పాస్ పోర్టులు రద్దు చేసే చర్య ఏదీ తీసుకోలేదని ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి డి.ఎస్.ఎస్. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పాస్ పోర్టుల చట్టం, నిబంధనల ప్రకారమే రద్దు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.

2020-01-14

‘రాజధాని తరలింపు’ దుమారం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీలో బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి. నడ్డాను కలిశారు. మొన్న పార్టీ సమావేశం జరుగుతుండగా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని పవన్ హుటాహుటిన వెళ్ళారు. అయితే, నిన్నటిదాకా సమావేశం జరగలేదు. రాజధాని వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పవన్ సోమవారం నాటి భేటీలో కోరినట్టు సమాచారం. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా నడ్డాను కలిశారు.

2020-01-13

ఒమన్ దేశపు పాలకుడు సుల్తాన్ కబూస్ బిన్ సెయిద్ అల్ సెయిద్ మృతి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంతాప దినాన్ని ప్రకటించింది. సుల్తాన్ ‘‘గౌరవ చిహ్నం’’గా సోమవారం దేశవ్యాప్తంగా సంతాప దినాన్ని పాటించనున్నట్టు తెలిపింది. అందులో భాగంగా జాతీయ పతకాలను సగం వరకే ఎగురవేస్తారు. సుల్తాన్ ఇండియాతో మంచి సంబంధాలను నిర్మించారని, ప్రవాసులకు సాయం చేశారని కేంద్రం పేర్కొంది. సుల్తాన్ ప్రాథమిక దశలో ఇండియాలో చదవారు.

2020-01-13
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page