డీజీపీ స్థాయి అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్.. ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాల చిట్టాను ప్రభుత్వం అనధికారికంగా లీక్ చేసింది. నిఘా పరికరాల కాంట్రాక్టు తన కుమారుడు చేతన్ సాయి క్రిష్ణకు దక్కేలా విదేశీ (ఇజ్రాయెలీ) రక్షణ సంస్థతో ఏబీ కుమ్మక్కయ్యారన్నది మొదటి అభియోగం. ఉద్ధేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్, పోలీసు ప్రొసీజర్లను విదేశీ సంస్థకు వెల్లడించారని, ఇది దేశభద్రతకే ముప్పు అని రెండో అభియోగం మోపారు.

2020-02-09

కాశ్మీర్లో 2జి మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్షకు గురైన మహ్మద్ అఫ్జల్ గురు 7వ వర్ధంతి (ఫిబ్రవరి 9) సందర్భంగా ఈ చర్య తీసుకున్నారు. గత ఆగస్టు 5న ఇంటర్నెట్ నిషేధం విధించిన ప్రభుత్వం, జనవరి 25న 2జి సేవలను పునరుద్ధరించింది. అయితే, ఫిబ్రవరి 9న గురు వర్ధంతి, 11న నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు మక్బూల్ భట్ వర్ధంతి సందర్భంగా ‘కాశ్మీర్ బంద్’కు జెకెఎల్ఎఫ్ పిలుపునివ్వడంతో 2జి సేవల్ని కూడా నిలిపివేశారు.

2020-02-09

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిఘా పరికరాల కొనుగోలుకోసం ఇజ్రాయిల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని 3(1) ప్రకారం సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం రాత్రి జారీ చేసిన జీవో ఎంఎస్ 18లో పేర్కొన్నారు.

2020-02-08

విశాఖపట్నం మెట్రో కింద గతంలో ప్రతిపాదించిన 42.55 కి.మీ.కు మరో 37.36 కి.మీ జోడించి లైట్ మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 79.9 కి.మీ. పొడవున ‘లైట్ మెట్రో’కోసం సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం అధికారులను ఆదేశించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి 60.20 కి.మీ. పొడవున ట్రామ్ వ్యవస్థను నడపాలని నిర్ణయించారు.

2020-02-07

ఈ నెల 13వ తేదీన నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజు ముందుకు మార్చింది. 12వ తేదీ (బుధవారం)నే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు అన్ని శాఖలకు శుక్రవారం సవరించిన నోటీసును పంపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రివర్గం సమావేశం కాబోతోంది.

2020-02-07

మాజీ సిఎం చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు, ఆయన సమీప బంధువుల ఇళ్ళలో గురువారం ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులను సైతం లోపలికి అనుమతించలేదని సమాచారం. శ్రీనివాస్ సుమారు రెండున్నర దశాబ్దాలు చంద్రబాబు వద్ద పని చేశారు. తొలుత పి.ఎ.గా, తర్వాత పి.ఎస్.గా పని చేసి 2019 ఎన్నికల తర్వాత ప్లానింగ్ శాఖకు వెళ్లిపోయారు.

2020-02-06

2020-21 సంవత్సరంలో ఏపీలో రూ. 1,34,402 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను ఇవ్వనున్నట్లు ‘నాబార్డు ఫోకస్ పేపర్’ తెలిపింది. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర రుణ సదస్సులో ఈ ఫోకస్ పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ. 2,11,865 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ఫోకస్ పత్రంలో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రాష్ట్రంలో 62 శాతానికి ఉపాధి కల్పిస్తున్న ప్రాథమిక రంగంపైనే దృష్టిపెట్టాలని సిఎం జగన్ బ్యాంకర్లకు సూచించారు.

2020-02-06

‘కియా’ రూ. 7000 కోట్ల పెట్టుబడితో 2017లో ప్లాంటు నిర్మాణం ప్రారంభించి రెండేళ్ళలో పూర్తి చేసింది. తొలి కారు కొద్ది నెలల క్రితమే విడుదలైంది. ఇంతలోనే తరలింపు వార్తలు రావడం ఒక అసాధారణ పరిణామమే! ఏపీలో కొత్త ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలపై జగన్ ప్రభుత్వం సమీక్ష చేపట్టింది. ముఖ్యంగా భూమి విలువ చెల్లింపు వాయిదాలు, విద్యుత్ రాయితీల వంటివి. వీటినే ప్రధాన కారణాలుగా ‘రాయిటర్స్’ పేర్కొంది.

2020-02-06

అయోధ్యలోని ‘బాబ్రీ మసీదు-రామజన్మభూమి’ స్థలం మొత్తాన్ని (67.703 ఎకరాలు) కొత్తగా ఏర్పాటు చేయనున్న ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. వివాదాస్పద స్థలంలో రామజన్మభూమి నిర్మించాలని, మసీదుకోసం అయోధ్యలోనే వేరొక చోట 5 ఎకరాలు కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ ఈ అంశంపై నిర్ణయాలు తీసుకుంది.

2020-02-05

2020-21 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రశీదుల రూపంలో రూ. 20,20,926 కోట్లు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందులో పన్నుల ఆదాయం రూ. 16,35,909 కోట్లు. 2019-20 బడ్జెట్ సమయంలో ఇంతకంటే ఎక్కువగా (రూ. 16,95,582 కోట్లు) అంచనా వేసి.. సవరించిన అంచనాల్లో రూ. 15,04,587 కోట్లకు తగ్గించారు. పన్నేతర ఆదాయాన్ని మాత్రం మరింత పెంచి (రూ. 3,45,514 కోట్లు) చూపించారు. వచ్చే ఏడాది పన్నేతర ఆదాయం మరింత పెరుగుతుందని (రూ. 3,85,017 కోట్లు) అంచనా.

2020-02-01
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page