‘‘మున్సిపాలిటీ అంటేనే మురికికి పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా... ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి. అది మీ చేతుల్లో ఉంది’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లకు హితబోధ చేశారు. తెలంగాణ పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని మంగళవారం ప్రగతిభవనంలో జరిగిన సమ్మేళనంలో పిలుపునిచ్చారు.
2020-02-18అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎపిపి) పోస్టులకు 49 మందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మంగళవారం వెల్లడించారు. 50 పోస్టులను నోటిఫై చేస్తే 2,488 మంది దరఖాస్తు చేశారని, వారిలో 1,981 మంది రాత పరీక్ష రాయగా 496 మంది ఉత్తీర్ణులయ్యారని, మౌఖిక పరీక్షకు 97 మందిని ఆహ్వానించి 49 మందిని ఎంపిక చేశఆమని ఆమె వివరించారు. కాగా, ఎంపికైన 49 మందిలో 27 మంది మహిళలే ఉండటం విశేషం. ప్రథమ స్థానంలో నిలిచింది కూడా ఒక మహిళే (ఎం. లావణ్య 281.50 మార్కులు). www.slprb.ap.gov.in లో వివరాలు చూడవచ్చు.
2020-02-18గ్రామీణ వైద్యశాలల నుంచి బోధనాసుపత్రుల వరకు.. అన్నింటి రూపు రేఖలు మారుస్తామని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమం కోసం రూ. 15,337 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. మంగళవారం కర్నూలులో ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’ మూడో దశను సిఎం ప్రారంభించారు. స్వాతంత్రానంతరం ఇప్పటిదాకా కేవలం 11 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయని, ఇకపైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
2020-02-18తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో జరుగుతుంది. కొత్త రెవెన్యూ చట్టం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టడం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ఈ దిశగా కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాలని సిఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు.
2020-02-15వస్తున్నది అమెరికా అధ్యక్షుడు.. సందర్శిస్తున్నది మన ప్రధాని మోడీ సొంత రాష్ట్రాన్ని.. మరి అంతా సుందర నందనవనంగా కన్పించొద్దూ..! అందుకే.. ట్రంప్, మోడీ 24న చేపట్టే ‘రోడ్ షో’ మార్గంలో మురికివాడలు కనిపించకుండా పెద్ద గోడను నిర్మిస్తోంది అహ్మదాబాద్ కార్పొరేషన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు.. మూడు కిలోమీటర్ల మార్గంలో ఏకంగా 600 మీటర్ల పొడవున, 6 నుంచి 7 అడుగుల ఎత్తున గోడ కడుతున్నారు. మురికివాడకు ముసుగేసే ఈ కార్యక్రమం పేరు ‘సుందరీకరణ’.
2020-02-13 Read Moreవారానికి ఐదు పని దినాల విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో రెండు రోజుల సెలవు విధానాన్ని అమలు చేస్తుండగా, 7 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాట పట్టాయి. మహారాష్ట్రలో ఈ నెల 29 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పని రోజుల్లో 45 నిమిషాల చొప్పున అదనపు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ నిబంధనలు, పారిశ్రామిక వివాదాల చట్టం వర్తించే ప్రభుత్వ సంస్థల్లో ఈ విధానం ఉండదు.
2020-02-12మార్చి 15 లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేవారు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తామని, గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష పడేలా చర్యలు ఉంటాయని మంత్రి చెప్పారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి 8న ప్రారంభించి మార్చి 3లోగా ముగిస్తామని ప్రభుత్వం గత నెలలో హైకోర్టుకు నివేదించింది.
2020-02-12ప్రధానమంత్రి ఆవాస యోజన (పిఎంఎవై)-గ్రామీణ పథకం కింద 2019-20లో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. ఆ మాటకొస్తే మంజూరు కూడా చేయలేదు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మంగళవారం లోక్ సభకు ఈ సమాచారం ఇచ్చింది. పిఎంఎవై-జి రెండో దశ కింద ఈ ఏడాది దేశవ్యాప్తంగా 59.90 లక్షల ఇళ్ళు నిర్మించాలన్నది లక్ష్యం కాగా 41.13 లక్షల ఇళ్ళను మంజూరు చేశారు. అందులో 7,18,213 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. ఏపీ, తెలంగాణలలో సున్నా.
2020-02-12కావేరీ డెల్టాను ‘రక్షిత వ్యవసాయ జోన్’గా ప్రకటించామని, ఆ ప్రాంతంలో చమురు- సహజ వాయువు అన్వేషణ ప్రాజెక్టులను అనుమతించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తేవడానికి న్యాయ నిపుణులతో చర్చిస్తామని సిఎం చెప్పారు. కావేరీ బేసిన్లో చమురు, సహజ వాయువు అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులను ఇచ్చింది. అసలే సాగునీటి సంక్షోభం ఎదుర్కొంటున్న తమిళనాట ఈ కాంట్రాక్టులపై నిరసన వ్యక్తమైంది.
2020-02-09తెలంగాణలో ఇక జాయింట్ కలెక్టర్లు ఉండరు. వారి హోదాను ‘అదనపు కలెక్టర్’గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 49 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం జారీ చేసిన జీవోలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ మార్పును పేర్కొంది. కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థలకోసం ప్రత్యేకంగా అదనపు కలెక్టర్లను నియమించారు.
2020-02-10