ఏపీ ప్రభుత్వ పెట్రోలియం పన్నుల విధానం నెలలో రెండోసారి మారింది. లీటరు పెట్రోలుపై ‘31%+రూ.2’, డీజిల్ పైన ‘22.25%+రూ.2’గా ఉన్న పన్నులను.. ‘35.20%’, ‘27%’గా మారుస్తూ జనవరి 29న జీవో ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాత విధానానికి మళ్ళి.. పన్నులను పెంచింది. పెట్రోలుపై ‘31%+రూ 2.76’, డీజిల్ పైన ‘22.25%+రూ. 3.07’ పన్ను విధిస్తూ శనివారం (ఫిబ్రవరి 29న) జీవో ఎంఎస్ నెం. 68ని జారీ చేసింది. దీంతో ముడిచమురు ధరలతో నిమిత్తం లేకుండా పెట్రోలుపై లీటరుకు 76 పైసలు, డీజిల్ పై రూ. 1.07 చొప్పున ప్రభుత్వానికి అదనపు ఆదాయం రానుంది.

2020-02-29

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు గడచిన 10 నెలల కాలంలో రెవెన్యూ లోటు రూ. 7,50,475 కోట్లుగా తేలింది. ద్రవ్య లోటు రూ. 9,85,472 కోట్లకు చేరింది. కేంద్రం నిర్దేశించుకున్న పరిమితులు దాటి 10 నెలల్లోనే ద్రవ్య లోటు 128.5 శాతంగా, రెవెన్యూ లోటు ఏకంగా 150 శాతంగా నమోదయ్యాయి. 2019-20లో రెవెన్యూ రశీదులు రూ. 18,50,101 కోట్లుగా సవరించిన అంచనాల్లో చూపించిన కేంద్రం, జనవరి వరకు రూ. 12,50,120 కోట్లు (67.6 శాతం) రాబట్టుకోగలిగింది.

2020-02-28 Read More

రాయలసీమ కరువు నివారణకు చేపట్టిన ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై సిఎం సమీక్ష నిర్వహించారు. రాయలసీమ కరువు నివారణకు చేపట్టిన ప్రాజెక్టుల్లో దేనికి ఎంత ఖర్చవుతుందో.. సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి – కృష్ణా – బనకచర్ల అనుసంధాన ప్రణాళిక, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పురోగతిపైనా సిఎం ఆరా తీశారు.

2020-02-27

చంద్రబాబు విశాఖలో చేపట్టిన ‘ప్రజాచైతన్య యాత్ర’ పట్ల పోలీసుల వైఖరి వివాదాస్పదమైంది. గురువారం ఉదయం విశాఖపట్నం ఎయిర్ పోర్టునుంచి రాంపురం గ్రామం వరకు వెళ్ళడానికి చంద్రబాబు వాహన శ్రేణికి పోలీసులు 8 కండిషన్లతో అనుమతి ఇచ్చారు. అయితే, చంద్రబాబు విశాఖలో దిగాక నగరంలోకి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఆ పేరిట పోలీసులు కూడా తమ అనుమతిని తామే ఉల్లంఘించి ఎయిర్ పోర్టునుంచే వెనక్కు పంపేందుకు ప్రయత్నించారు.

2020-02-27

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఇ.డి.బి) మాజీ సీఈవో జె. కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) రద్దు చేసింది. ఐఆర్ఎస్ అధికారి అయిన కృష్ణకిషోర్ తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతిస్తూ... ఆయనకు నిలిపివేసిన జీతభత్యాలను చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చంద్రబాబు హయాంలో కీలక పాత్ర పోషించిన కృష్ణకిషోర్ పైన కొత్త ప్రభుత్వం అవినీతి ఆరోపణలు మోపి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ‘క్యాట్’ను ఆశ్రయించారు.

2020-02-25

గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకోసం ఏర్పాటు చేసిన ‘సిట్’కు విస్తృత అధికారాలు కల్పించింది జగన్ ప్రభుత్వం. దర్యాప్తులో భాగంగా సీఆర్పీసీ ప్రొవిజన్ల కింద ఏ వ్యక్తినైనా లేక అధికారినైనా పిలిచి విచారించడానికి, వారి స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి ‘సిట్’కు అధికారం ఉంటుంది. విచారణాంశాలు లేదా భూ లావాదేవీలపై ఎలాంటి రికార్డులనైనా తెప్పించుకొని తనిఖీ చేయవచ్చు. ‘సిట్’ విధుల్లో... విచారణ, కేసులు నమోదు, దర్యాప్తు భాగం. కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, సమన్వయం సహా అనేక అంశాలపై ఈ ‘సిట్’ ఓ నోడల్ ఏజన్సీలా పని చేస్తుంది.

2020-02-21

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకోసం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’లో సభ్యులు వీరే...1. కొల్లి రఘురాంరెడ్డి, ఇంటెలిజెన్స్ డిఐజి, 2. అట్టాడ బాబూజీ, విశాఖ ఎస్పీ, 3. వెంకట అప్పలనాయుడు, ఇంటెలిజెన్స్ ఎస్పీ, 4. శ్రీనివాసరెడ్డి, కడప అదనపు ఎస్పీ, 5. జయరామరాజు, ఇంటెలిజెన్స్ డి.ఎస్.పి, 6. విజయభాస్కర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెట్ డి.ఎస్.పి, 7. ఎం. గిరిధర్, ఇంటెలిజెన్స్ డి.ఎస్.పి, 8. కెన్నెడీ, ఇన్స్పెక్టర్, ఏలూరు రేంజ్, 9. ఐ. శ్రీనివాసన్, ఇన్స్పెక్టర్, నెల్లూరు జిల్లా, 10. ఎస్వీ రాజశేఖరరెడ్డి, ఇన్స్పెక్టర్, గుంటూరు జిల్లా.

2020-02-21

గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు, స్థాపించిన సంస్థల్లో అక్రమాలపై విచారణకోసం జగన్ ప్రభుత్వం 10 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్ డీఐజీ డాక్టర్ కొల్లి రఘురాంరెడ్డి ఈ ‘సిట్’కు నేతృత్వం వహించనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన తొలి నివేదిక ఆధారంగా ‘సిట్’ దర్యాప్తు జరుపుతుంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ బుగ్గన కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.

2020-02-21

స్వచ్ఛభారత్ (గ్రామీణ్) రెండో దశకు కేంద్ర మంత్రివర్గం బుధవారం పచ్చ జెండా ఊపింది. 2020-21 నుంచి 2024-25 వరకు అమలయ్యే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,40,881 కోట్లు. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైంది. దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన పూర్తిగా నిలిచిపోయినట్టు చెబుతున్న ప్రభుత్వం రెండో దశలో ‘ఒడిఎఫ్ ప్లస్’పై కేంద్రీకరిస్తామని ప్రకటించింది. ‘ఒడిఎఫ్’ను సుస్థిరం చేయడం, చెత్త-మురికినీటి శుద్ధి ఈ రెండో దశలో ఉంటాయని కేంద్రం పేర్కొంది.

2020-02-19 Read More

ఏపీలో 8 మంది ఐపిఎస్ అధికారులకు స్థానచలనమైంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం. కిషోర్ కుమార్ ను ఎపి రోడ్డు భద్రతా సంస్థ ఛైర్మన్ పోస్టులో నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నవారిలో... అదనపు డీజీపీ కుమార్ విశ్వజిత్ హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా, ఎన్. బాలసుబ్రహ్మణ్యం రైల్వే అదనపు డీజీపీగా, సునీల్ కుమార్ నాయక్ సీఐడీ డీఐజీగా, అభిషేక్ మహంతి గ్రేహౌండ్స్ కమాండరుగా నియమితులయ్యారు. క్రిపానంద్ త్రిపాఠి (డీజీ, డ్రగ్ కంట్రోల్)ని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

2020-02-18
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page