ఏప్రిల్ 15 తర్వాత కూడా ‘లాక్ డౌన్’ పొడిగించాలని తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్నవించారు. ఈ విషయంలో సంకోచించవద్దని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘‘ఆర్థిక సమస్య నుంచి బయటపడొచ్చు. కానీ, ప్రాణాలు పోతే రికవర్ చేయలేం. మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం లాక్ డౌన్. కరోనాను ఎదుర్కోవడానికి మనకు మరో ఆయుధమే లేదు. నా అవగాహన, అనుభవంలో ఇదే తేలింది’’ అని కేసీఆర్ ఉద్ఘాటించారు.
2020-04-06ఆదివారం రాత్రి కొద్దిసేపు దేశమంతటా ఇళ్ళలో విద్యుద్దీపాలు ఆపేసిన ఫలితంగా డిమాండ్ 32,000 మెగావాట్లు తగ్గినట్టు కేంద్ర ఇంథన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ చెప్పారు. విద్యుత్ డిమాండ్ రాత్రి 8:49 గంటల నుంచి 9.09 వరకు..1,17,300 మెగావాట్ల నుంచి 85,300 మెగావాట్లకు తగ్గిపోయిందని ఆయన వెల్లడించారు. అంటే మొత్తం డిమాండులో 27.28 శాతం తగ్గింది. ఆ సమయంలో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.7 నుంచి 50.26 వరకు ఉందని మంత్రి వివరించారు.
2020-04-05తెలంగాణ ప్రభుత్వం అందరి వేతనాల్లో కోత విధించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లింపులను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇంకా ఇలాంటి నియామకాల్లో ఉన్నవారి వేతనాలను 100 శాతం, అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాలను 60 శాతం, నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం, మిగిలిన అందరి ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం చెల్లింపులు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షనర్లకు కూడా ఈ వాయిదా వర్తిస్తుంది. కరోనా’ కట్టడికోసం విధించిన ‘లాక్ డౌన్’ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన
2020-04-01ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ నెలలో మత సమావేశాలకు హాజరైన 800 మంది ఇండోనేషియన్ మత బోధకులను బ్లాక్ లిస్టులో చేర్చాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. తబ్లిఘి జమాత్ సభ్యులైన వీరంతా టూరిస్టు వీసాలపై ఇండియాకు వచ్చి నిబంధనలను ఉల్లంఘించారన్నది అభియోగం. నిజాముద్దీన్ లోని అలామి మర్కజ్ బంగ్లేవాలి మసీదు కేంద్ర బిందువుగా ‘కరోనా’ వైరస్ వ్యాపించింది. అక్కడ జరిగిన మూడు రోజుల మత సమావేశాలకు ఈ ఇండోనేషియన్లు హాజరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 8,000 మంది ఆ మసీదులో ప్రార్ధనా సమావేశాలకు హాజరయ్యారని అంచనా.
2020-03-31గుజరాత్, గోవా రాష్ట్రాలు మాత్రమే కేంద్ర బలగాలను తీసుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో రాజస్థాన్ కు చెందిన కార్మికులు 2 లక్షల మంది ఉన్నారని, వారంతా తిరిగి వెళ్లిపోతామని గొడవ చేయడంవల్ల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను కోరిందని ఆయన చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రమూ కేంద్ర బలగాలను అడగలేదని, అడిగితే ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర బలగాల అవసరం రాకుండా ప్రజలే సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలని కిషన్ రెడ్డి సూచించారు.
2020-03-30‘‘అందరూ కళ్లు మూసుకోండి. మీ పిల్లల కళ్ళు కూడా...’’ ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వలస కార్మికులను ఆదేశించారు ఓ ముగ్గురు వ్యక్తులు. వారు ‘కరోనా’ వైరస్ నుంచి రక్షణ కోసం ఫుల్ బాడీ సూట్లు వేసుకున్నారు. కూలీలు రోడ్డుపై గుంపుగా కూర్చున్నారు. మరు నిమిషంలో వారిపై రసాయనంతో కూడిన నీళ్ళు ధారాపాతంగా పడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో కార్మికులకు జరిగిన సామూహిక సంస్కారం ఇది. దీనిపై విమర్శలకు.. ‘‘అమానవీయంగా ప్రవర్తించడం మా అభిమతం కాదు. పెద్ద మొత్తంలో తిరిగి వస్తున్న ప్రజలను శుద్ధి చేయాల్సి ఉంది. మేము మెరుగైనదిగా భావించిన పని చేశాం’’ అని ఓ అధికారి బదులిచ్చారు.
2020-03-3021 రోజుల దిగ్బంధాన్ని పొడిగించే ఆలోచన ‘ప్రస్తుతానికి’ లేదని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14 వరకు ప్రకటించిన ‘లాక్ డౌన్’ను పొడిగించే అవకాశం ఉందన్న వార్తలపై స్పందిస్తూ ‘‘ఈ వార్తలు చూసి ఆశ్చర్యపోయా. లాక్ డౌన్ పొడిగించే ప్రణాళికేం లేదు’’ అని రాజీవ్ గౌబా చెప్పారు. లక్షల మంది వలస కార్మికులు రాష్ట్రాల సరిహద్దులు దాటి సొంత ప్రాంతాలకు తరలుతుండటమే ‘లాక్ డౌన్’ పొడిగింపు ఆలోచనకు కారణమని ఓ అధికారి చెప్పినట్టు ‘ద ప్రింట్’ పేర్కొంది. ‘లాక్ డౌన్’ 2 నెలలు ఉండాలని ‘కోవిడ్ 19’ టాస్క్ ఫోర్స్ లోని మరో అధికారి అభిప్రాయపడినట్టు కూడా ఆ వార్తా సంస్థ రాసింది.
2020-03-30‘కరోనా’ కట్టడికి తీసుకున్న చర్యలను ఏపీ ప్రభుత్వం క్రమంగా కఠినతరం చేస్తోంది. నిత్యావసరాల దుకాణాలు, రైతు బజార్లలో సరుకులు తీసుకునే సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో కుదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఆదేశించారు. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయా దుకాణాలకు, వాటికి వెళ్లే ప్రజలకు అనుమతి ఇస్తుండగా.. ఇకపైన పట్టణ ప్రాంతాల్లో 11 గంటల వరకే అనుమతి ఇవ్వనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా ఒంటి గంట వరకు వెళ్లవచ్చు. అధిక ధరలకు సరుకులు అమ్మితే జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి మరోసారి హెచ్చరించారు.
2020-03-29ఇండియాలో ప్రముఖులు ‘కరోనా’ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారు. చాలాచోట్ల చర్యలేమీ తీసుకోవడంలేదు. కానీ కేరళలో అలా కాదు. ‘హోం క్వారంటైన్’లో ఉండనందుకు ఐఎఎస్ అధికారి అనుపమ్ మిశ్రాను సస్పెండ్ చేశారు కేరళ సిఎం పినరయి విజయన్. అతనిపై కేసు కూడా నమోదైంది. కొల్లాం సబ్ కలెక్టరుగా పని చేస్తున్న మిశ్రా భార్యతో సహా ఇటీవల సింగపూర్, మలేషియా సందర్శించి వచ్చారు. మార్చి 19న తిరిగి విధులకు రిపోర్టు చేశారు. అయితే, ఆ జంటను ‘హోంక్వారంటైన్’లో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గన్ మ్యాన్, వ్యక్తిగత సహాయకులపై కూడా ఆరోగ్య నిఘా పెట్టారు. అయితే, అదే రోజు మిశ్రా తన సొంత రాష్ట్రం యుపికి వెళ్లిపోయారు.
2020-03-27పట్టణాల్లోని వ్యవసాయ మార్కెట్లను మూసివేశామని, రైతులు ఎవరూ రావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పారు. ఏప్రిల్ నెలలో ధాన్యం ప్రతి గింజనూ గ్రామాల్లోనే కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు ప్రభుత్వానికి లేదా వ్యాపారులకు అమ్ముకోవచ్చని, మద్ధతు ధర కచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు జరిగిన వెంటనే అధికారులు చెక్కులు ఇస్తారని చెప్పారు. ఈ విషయమై ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ- మార్కెటింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.
2020-03-27