ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చింది. శుక్రవారం వేకువజామున ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సులేమానీ దిగిన వెంటనే అమెరికా డ్రోన్ రాకెట్లు దాడి చేశాయి. ట్రంప్ ఆదేశంతోనే ఈ హత్య జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఇరాక్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ పెరిగింది. గత వారం జరిగిన అమెరికా వైమానిక దాడులకు ప్రతిగా కొందరు మంగళవారం ఆ దేశ ఎంబసీపై దాడి చేశారు.

2020-01-03 Read More

అణు, క్షిపణి పరీక్షలపై మారటోరియం ముగిసినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటనపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. అణు, క్షిపణి పరీక్షలను పునరుద్ధరించవద్దని ఆయన ఉత్తర కొరియాకు విన్నవించారు. అణ్వాయుధాలు, దూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంపై తాము స్వయంగా విధించుకున్న మారటోరియాన్ని ముగిస్తూ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర్వుపై సంతకం చేసినట్టు ఉత్తర కొరియా బుధవారం ప్రకటించింది.

2020-01-02 Read More

తైవాన్ మిలిటరీ హెలికాప్టర్ ఒకటి గురువారం ఉదయం 9 గంటల సమయంలో అత్యవసరంగా నేలకు దిగింది. అందులో ప్రయాణిస్తున్న ఉన్నతాధికారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఉత్తర తైవాన్ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితుల్లో నేలకు దిగిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లో 13 మంది ఉండగా 11 మంది బయటపడ్డారు. ఇద్దరి ఆచూకీ తెలియలేదు.

2020-01-02 Read More

ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని అమెరికా ఎంబసీ సిబ్బందికి సాయంగా అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది. ఎంబసీపై ఇరాకీలు దాడి చేసిన విషయం తెలియగానే రెండు రెండు ఎహెచ్-64 అపాచీ హెలికాప్టర్లను ఎంబసీపై గస్తీకోసం పంపింది. తర్వాత ప్రత్యేక మెరైన్ దళాలనూ తరలించింది. ఎంబసీకి సెక్యూరిటీ, అమెరికన్ల భద్రతకు పూచీ ఇవ్వడానికి సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది.

2019-12-31

ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని అమెరికా ఎంబసీపై ఆ దేశ పౌరులు మంగళవారం దాడి చేశారు. ‘‘ఇరాన్ మద్ధతు ఉన్న మిలీషియా’’పై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది మరణించారు. దీంతో ఆగ్రహించిన ఇరాకీలు మంగళవారం వందల సంఖ్యలో అమెరికా ఎంబసీపై దండెత్తారు. ఎంబసీ వెలుపలి భాగంలో ఉన్న వాహనాలను ధ్వసం చేసి ఓ గది అద్దాలను పగులగొట్టి నిప్పంటించారు.

2019-12-31 Read More

పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే నూతన సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణె పాకిస్థాన్‌కు తీవ్రమైన హెచ్చరిక చేశారు. పొరుగు దేశం ‘ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని’ ఆపకపోతే, ఉగ్రవాద మూలాలపై ముందస్తు దాడి చేసే హక్కు ఇండియాకు ఉందని ముకుంద్ వ్యాఖ్యానించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని శిక్షించడానికి... ధృఢమైన కఠువైన స్పందన ఉంటుందని పి.టి.ఐ. వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

2020-01-01 Read More

భారత సైనిక దళానికి కొత్త అధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యాల్లో ఒకటైన 13 లక్షల భారత ఆర్మీకి ఆయన సారథ్యం వహించనున్నారు. ఇప్పటిదాకా సైన్యాధిపతిగా పని చేసిన బిపిన్ రావత్ ప్రమోషన్ పొంది త్రివిధ దళాలకు తొలి అధిపతిగా నియమితులైన విషయం తెలసిందే. రావత్ అధిపతిగా ఉన్నప్పుడు నరవాణె వైస్ చీఫ్ గా బాధ్యత నిర్వర్తించారు.

2019-12-31

భారత సైన్యం, నావికా, వైమానిక దళాలకు ఉమ్మడి అధిపతిగా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. కొత్తగా సృష్టించిన త్రివిధ దళాల అధిపతి (సిడిఎస్) పోస్టులో నియమితుడైన తొలి వ్యక్తి బిపిన్ రావత్. ఇప్పటిదాకా ఆయన సైన్యానికి అధిపతిగా పని చేశారు. త్రివిధ దళాలకు విడివిడిగా అధిపతులు ఉంటారు. సి.డి.ఎస్. మూడు విభాగాల మధ్య సమన్వయం చేస్తారు. రక్షణ శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన మిలిటరీ వ్యవహారాల శాఖకు కూడా బిపిన్ రావత్ నేతృత్వం వహిస్తారు.

2019-12-30

సైనిక, నౌకా, వైమానిక దళాల మధ్య సమన్వయం కోసం నియమించనున్న త్రివిధ దళాల అధిపతి (సిడిఎస్) పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించనున్నారు. త్రివిధ దళాల అధిపతులకు ఇంతవరకు ఉన్న గరిష్ఠ వయోపరిమితి 62 సంవత్సరాలు. కాగా... సి.డి.ఎస్.ను నియమించడానికి వీలుగా త్రివిధ దళాల సర్వీసు నిబంధనలను మారుస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అందులో గరిష్ఠ వయోపరిమితిని 65గా పేర్కొన్నారు.

2019-12-30

18 సంప్రదాయ జలాంతర్గాములు, మరో 6 అణు జలాంతర్గాముల నిర్మాణానికి భారత నౌకాదళం ప్రణాళికను రచించింది. ప్రస్తుతం నౌకాదళంలో కేవలం 15 సంప్రదాయ జలాంతర్గాములు, ఒక అణు విద్యుత్ జలాంతర్గామి (ఎస్ఎస్ఎన్) ఉన్నాయి. రక్షణ రంగంపైన ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం శీతాకాల సమావేశాల్లో సమర్పించిన నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు. అరిహంత్ తరహా అణు విద్యుత్ జలాంతర్గాముల్లో అణుక్షిపణులు ఉంటాయి.

2019-12-29
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Last Page