ఇరాక్ లోని 2 అమెరికా సైనిక స్థావరాలపై తాము జరిపిన క్షిపణి దాడిలో 80 మంది మరణించినట్టు ఇరాన్ ప్రకటించింది. పశ్చిమ ఇరాక్ లోని అసద్ ఎయిర్ బేస్ అమెరికా డ్రోన్ ఆర్మీకి కేంద్ర బిందువుగా ఉంది. ఇరాన్ ఖుర్ద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సులేమానీని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హతమార్చింది డ్రోన్ క్షిపణులతోనే. ఇర్బిల్ సైనిక స్థావరంపైనా ఇరాన్ దాడి చేసింది. ఈ దాడి ‘అమెరికాకు చెంపదెబ్బ’ వంటిదని ఇరాన్ సుప్రీం నేత వ్యాఖ్యానించారు.

2020-01-08

అమెరికా సైనిక దళాలున్న రెండు ఇరాకీ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీని హతమార్చినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. 12కు పైగా క్షిపణులను ఇరాన్ ప్రయోగించినట్టు తెలిపింది. అమెరికా సైనికులు మరణించినట్టుగా ఇంతవరకు సమాచారం రాలేదని, నష్టం అంచనా జరుగుతున్నట్టు ఓ అమెరికన్ అధికారి చెప్పారు. అల్ అసద్ స్థావరంలో ఇరాకీలు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం.

2020-01-08

అమెరికా సేనల బహిష్కరణకోసం ఇరాక్ పార్లమెంటు తీర్మానం చేయడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘‘వాళ్ళు మమ్మల్ని వెళ్లిపొమ్మంటే, అది స్నేహపూర్వకంగా జరగకపోతే, వాళ్ళపై మునుపెన్నడూ చూడని ఆంక్షలు విధిస్తాం. వాటి ముందు ఇరాన్ పై విధించిన ఆంక్షలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి’’ అని ట్రంప్ హెచ్చరించారు. తాము ఇరాక్ దేశంలో చాలా డబ్బు వెచ్చించామని, వాళ్లు ఆ మొత్తం తిరిగి చెల్లించకుండా వెళ్లిపోయేది లేదని స్పష్టం చేశారు.

2020-01-06

అమెరికా (విదేశీ) దళాలను బహిష్కరించడానికి అనుకూలంగా ఇరాక్ పార్లమెంటు ఓటు వేసింది. ఆమేరకు తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. అమెరికా సేనలకు గతంలో తమ ప్రభుత్వమే పంపిన ఆహ్వానాన్ని ఉపసంహరించాలని పార్లమెంటు సిఫారసు చేసింది. ఇరాన్ మిలిటరీ జనరల్‌ను తమ గడ్డపై హతమార్చడంతో ఇరాక్ నేతలు కూడా మండిపడుతున్నారు. అమెరికా దళాల బహిష్కరణకు ఇరాన్ అనుకూల పార్టీలు పట్టుబట్టాయి.

2020-01-06 Read More

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఆదివారం రాత్రి భారీ పేలుళ్ళు జరిగాయి. అమెరికన్ ఎంబసీ సహా పలు దేశాల దౌత్య కార్యాలయాలు కొలువై ఉన్న ‘గ్రీన్ జోన్’పైకి రాకెట్లు దూసుకొచ్చాయి. వెనువెంటనే పెద్దగా సైరన్ మోతలు నగరమంతా వినిపించాయి. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ సులేమానీని అమెరికా హతమార్చిన తర్వాత ‘గ్రీన్ జోన్’పైకి రాకెట్లు పడటం ఇది రెండోసారి. శనివారం ఉత్తర బాగ్దాద్ లోని అమెరికా మిలిటరీ స్థావరంపై కూడా దాడి జరిగింది.

2020-01-06 Read More

కెన్యాలోని అమెరికా సైనిక స్థావరంపై ఆదివారం ‘అల్ షబాబ్’ తీవ్రవాద సంస్థ దాడి చేసింది. అల్ ఖాయిదాకు అనుబంధంగా చెబుతున్న ఈ సంస్థ కెన్యాలోని మండా బే ఏరియాలో ‘కెన్యా డిఫెన్స్ ఫోర్స్ మిలిటరీ బేస్’ను లక్ష్యంగా చేసుకుంది. కెన్యా తీరంలో ఉన్న ఈ నావికాదళ కేంద్రాన్ని ‘క్యాంప్ సింబా’గా వ్యవహరిస్తుంటారు. ఈ దాడిలో ఒక అమెరికా సైనికుడు, ఇద్దరు కాంట్రాక్టర్లు మరణించారు. మరో ఇద్దరు అమెరికన్ సైనికులు గాయపడ్డారు.

2020-01-06

దేశీయంగా రూపొందిన తేలికపాటి యుద్ధ విమానం ‘‘తేజస్’’ భవిష్యత్ రూపం వెల్లడైంది. రెండు ఇంజన్లతో కూడిన ఈ మోడల్ ఇప్పటినుంచి 12 సంవత్సరాల్లో మిగ్-29 జెట్ల స్థానాన్ని భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందుతోంది. నౌకాదళంలో విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి ‘డబుల్ ఇంజన్ తేజస్’ ఫైటర్లు పని చేస్తాయి. తేజస్ ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టి.ఇ.డి.బి.ఎఫ్), ఓమ్ని రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఒ.ఆర్.సి.ఎ) డిజైన్లను అధ్యయనం చేస్తున్నారు.

2020-01-05 Read More

2016లో డీమోనెటైజేషన్ తరువాత 625 టన్నుల కొత్త కరెన్సీ నోట్లను భారత వైమానిక దళం రవాణా చేసిందని మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా తాజాగా వెల్లడించారు. 2016 నవంబర్ 8 రాత్రి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించాక కొత్త కరెన్సీని యుద్ధ ప్రాతిపదికన తరలించారు. "కోటి రూపాయలు ఒక 20 కిలోల సంచిలో వస్తే, మేము ఎన్ని కోట్లు తరలించామో నాకు తెలియదు." అని ముంబైలో ఓ కార్యక్రమంలో ధనోవా పేర్కొన్నారు.

2020-01-05 Read More

టాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ మరణానికి కారకులపై ‘తీవ్ర ప్రతీకారం’ తప్పదని ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా ఖమేనీ ప్రతినబూనారు. శుక్రవారం సులేమానీపై ఇరాక్ లోని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా క్షిపణి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సులేమానీని దేశంలో రెండో శక్తిమంతుడైన నేతగా చూస్తారు. రివల్యూషనరీ గార్డ్స్ లో అగ్రశ్రేణి విభాగం ‘‘ఖుద్స్ ఫోర్స్’కు ఆయన నాయకుడు.

2020-01-04 Read More

తమ దేశ సైన్యంలో టాప్ జనరల్ అయిన ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పౌరులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి అమెరికాకు నిరసన తెలిపారు. శుక్రవారం ప్రార్ధనల తర్వాత దేశ రాజధాని టెహ్రాన్, చారిత్రక కెర్మన్ సహా పలు నగరాల్లో భారీగా ప్రజలు రోడ్లపై ర్యాలీ అయ్యారు. సులేమానీని జాతీయ హీరోగా స్మరిస్తూ అమెరికా వ్యతిరేక నినాదాలను హోరెత్తించారు. కొంతమంది ప్లకార్డులపై ‘‘తీవ్ర ప్రతీకారం’’ అని రాసి ప్రదర్శించారు.

2020-01-04
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Last Page