ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఆదివారం రాత్రి రాకెట్ దాడి జరిగింది. తొలుత ఐదు రాకెట్లు ఎంబసీకి సమీపంలో పడ్డాయని, కొద్దిసేపటికే మరో మూడు క్షిపణులు ’గ్రీన్ జోన్’పైకి వచ్చాయని భద్రతా దళాలు తెలిపాయి. విదేశీ రాయబార కార్యాలయాలు కొలువై ఉన్న ‘గ్రీన్ జోన్’పై ఈ మధ్య రాకెట్ దాడులు జరిగాయి. తమ దేశం నుంచి అమెరికా దళాలు వెళ్ళిపోవాలనే డిమాండుతో ఇరాకీలు శనివారమే బాగ్దాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
2020-01-26రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 70 సంవత్సరాలైంది. 71వ గణతంత్ర దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. యుద్ధ సామర్ధ్యాన్ని ప్రదర్శించింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఏడాది ఉత్సవాల్లో... ఉపగ్రహాలను కూల్చివేయగల (ASAT) ‘మిషన్ శక్తి’ క్షిపణులను ఇండియా ప్రదర్శించింది. కొత్తగా కొనుగోలు చేసిన చినూక్, అపాచీ అటాక్ హెలికాప్టర్లు వాయుసేన విన్యాసాల్లో భాగం పంచుకున్నాయి.
2020-01-26ఇండియాకు పంపవలసిన ఎస్-400 క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబుష్కిన్ శుక్రవారం తెలిపారు. ఇండియా కోరినన్ని క్షిపణులను 2025 లోగా పంపుతామని ఆయన చెప్పారు. గగనతల రక్షణ వ్యవస్థలలో అత్యంత సమర్ధవంతమైనదిగా ఎస్-400కు పేరుంది. రష్యా నుంచి ఎస్-400 కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించినా టర్కీ వెనుకకు తగ్గలేదు. అమెరికాను ‘ఒప్పించి’ మరీ ఇండియా వీటిని కొనుగోలు చేస్తోంది.
2020-01-17రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై మిత్ర దేశాలు కురిపించిన బాంబులు ఇంకా జర్మన్లను భయపెడుతున్నాయి. 75 ఏళ్ల క్రితం పేలని రెండు బాంబులను ఆదివారం తవ్వి తీశారు. పశ్చిమ జర్మనీలోని డోర్ట్ మండ్ నగరంలో 14,000 మంది ప్రజలను తరలించి ఈ పని చేపట్టారు. ఒక్కో బాంబు 250 కేజీల బరువుంది. వాటిలో ఒకటి బ్రిటిష్ బాంబు, రెండోది అమెరికన్ బాంబు. రెండూ పేలకుండా జాగ్రత్త చేశారు. నిర్మాణ పని చేస్తున్న కార్మికులు ఇచ్చిన క్లూతో బాంబులు కనుగొన్నారు.
2020-01-13370 ఆర్టికల్ రద్దును సమర్ధిస్తే సురక్షితంగా దేశంలోకి అనుమతిస్తామని మోడీ ప్రభుత్వం తనకు ‘ఆఫర్’ ఇచ్చినట్లు ఇస్లామిక్ మత బోధకుడు జాకీర్ నాయక్ చెప్పారు. మోడీ, అమిత్ షా సూచనలమేరకు గత సెప్టెంబరులో ఒక రాయబారి తనను సంప్రదించారని నాయక్ ఓ వీడియోలో చెప్పారు. నాయక్ 2016 నుంచి మలేషియాలో ప్రసాసంలో ఉన్నారు. 370పై ప్రభుత్వానికి మద్ధతిస్తే కేసులు మాఫీ చేసి, ఆస్తులు విడిపిస్తామన్నారని నాయక్ వీడియోను షేర్ చేసిన ఇస్లామిక్ స్కాలర్ యాసిర్ ఖాది రాశారు.
2020-01-11 Read Moreఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న వైఖరికి రాష్ట్ర బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మెజారిటీ నేతలు మద్ధతు తెలిపినట్టు సమాచారం. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ‘అమరావతి’కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మద్ధతు ఇచ్చామని, మంత్రివర్గ నిర్ణయాల్లోనూ భాగమయ్యామని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు వైఖరి మార్చుకోవడం సమంజసం కాదన్నది వారి అభిప్రాయంగా ఉంది.
2020-01-11ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ పౌర విమానాన్ని పొరపాటున తమ దళాలు కూల్చేశాయని ఇరాన్ ప్రకటించింది. తమ సైనిక కమాండర్ సులేమానీని అమెరికా హతమార్చిన తర్వాత తలెత్తిన పరిణామాల్లో ‘మానవ తప్పిదం’ జరిగిందని పేర్కొంది. ఈ నెల 8న ఉక్రెయిన్ బోయింగ్ 737 టెహ్రాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మరణించిన 176 మందిలో ఎక్కువమంది ఇరానియన్లు, కెనడియన్లు. సాంకేతిక లోపంతో విమానం కూలిందని గత మూడు రోజులుగా ఇరాన్ చెప్పింది.
2020-01-11‘‘క్షిపణి దాడి లక్ష్యం అమెరికన్లను చంపడం కాదు. మా సామర్ధ్యాన్ని ట్రంప్ కు చాటడమే’’ అని ఇరాన్ చెబుతోంది. ఉపగ్రహ చిత్రాలు దాన్ని రుజువు చేస్తున్నాయి. బుధవారం ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలను ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసింది. అల్ అసద్ వైమానిక స్థావరంలోని పలు నిర్మాణాలను ఇరాన్ క్షిపణులు కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్టు ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
2020-01-09 Read Moreఅమెరికా, ఇరాన్ మధ్య మాటల మంటలు బుధవారం రాత్రి సమయానికి తగ్గాయి. తమ మిలిటరీ కమాండర్ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ వేకువజామున ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై దాడి చేసింది. అందులో 80 మంది మరణించారని ఇరాన్ ప్రకటిస్తే... తమ సైనికులు చనిపోలేదని ట్రంప్ చెప్పారు. ఇరాన్ వెనుకంజ వేసిందనీ వ్యాఖ్యానించారు. తమ స్థావరాలను టచ్ చేస్తే ఇరాన్ పై భీకర దాడి ఉంటుందని నిన్న మాట్లాడిన ట్రంప్, బుధవారం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.
2020-01-08అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ పెరగడంతో... వాణిజ్య మార్గాలకు భద్రతకోసం ఇండియా బుధవారం గల్ఫ్ ప్రాంతానికి యుద్ధ నౌకలను పంపింది. ఇండియా భాగస్వామిగా ఉన్న ‘చాబహర్’ పోర్టు అభివృద్ధిపై ఈ ఘర్షణ ప్రభావం పడబోదని ఇరాన్ రాయబారి అలి చెగేని హామీ ఇచ్చారు. అమెరికాతో తమకున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇండియా తీసుకునే ఏ శాంతి చర్యలనైనా స్వాగతిస్తామని ఆయన చెప్పారు. కాగా ఉదయం... ఇరాక్ లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇండియా అలర్ట్ జారీ చేసింది.
2020-01-08 Read More