విశాఖపట్నంలో ఈ నెల 18 నుంచి 28 వరకు జరగాల్సిన అంతర్జాతీయ నౌకా విన్యాసాలు (మిలన్ 2020) వాయిదా పడ్డాయి. ‘కరోనా వైరస్’ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత నౌకాదళం మంగళవారం ప్రకటించింది. తర్వాత వీలైన సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపింది. 1995 నుంచి భారత నౌకాదళం ‘మిలన్’ పేరిట బహుళ పక్ష నౌకా విన్యాసాలను నిర్వహిస్తోంది. ఈ ద్వైవార్షిక కార్యక్రమం చివరిగా 2018 మార్చి 6-13 తేదీల్లో పోర్టు బ్లెయిర్ లో జరిగింది. అప్పుడు 16 దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.

2020-03-03 Read More

సిరియా, టర్కీ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఆదివారం సిరియా వైమానికి దళానికి చెందిన రెండు ఎస్.యు-24 బాంబర్లను టర్కీ కూల్చివేసింది. సిరియా భూభాగంలోని ఇడ్లిబ్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. పైలట్లు సురక్షితంగా పారాచ్యూట్ల ద్వారా బయటపడ్డారు. తాను మద్ధతు ఇస్తున్న మిలీషియా కోసం టర్కీ సేనలు సిరియాలోకి ప్రవేశించి ప్రభుత్వ దళాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతిగా కొద్ది రోజుల క్రితం సిరియా సేనలు ఇడ్లిబ్ ప్రావిన్సులో జరిపిన వైమానిక దాడిలో 34 మంది టర్కీ సైనికులు చనిపోయారు.

2020-03-01

ప్రపంచంలో పేరెన్నికగన్న ‘అపాచీ’ వంటి హెలికాప్టర్లకు ధీటుగా 10-12 టన్నుల అటాక్ హెలికాప్టర్లను తయారు చేసేందుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ పూర్తయింది. త్రివిధ దళాలకు అవసరమైన సుమారు రూ. 4 లక్షల కోట్ల విలువైన హెలికాప్టర్ల దిగుమతిని నిరోధించడం ఈ మెగా ప్రాజెక్టు లక్ష్యమని హాల్ ఛైర్మన్ ఆర్. మాధవన్ ఆదివారం ‘పిటిఐ’ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2023 నాటికి మొదటి నమూనాను సిద్ధం చేస్తామని మాధవన్ పేర్కొన్నారు.

2020-03-01 Read More

రేపు (ఫిబ్రవరి 25న) 3 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్ల అమ్మకానికి ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. సోమవారం అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ సభలో ఆయన మాట్లాడారు. అమెరికా చరిత్రలో అత్యంత శక్తివంతమైన, ఆధునిక, భయానక ఆయుధాలను తయారు చేసిందని ట్రంప్ చెప్పారు. అమెరికా, ఇండియా మధ్య సైనిక సంబంధాలు బలపడాలని ట్రంప్ ఆకాంక్షించారు.

2020-02-24

సూర్యలంక, దొనకొండ, విజయవాడ, భోగాపురం లలో వైమానిక దళ శిక్షణా కేంద్రాలకు భూమి కేటాయించాలని సదరన్ ఎయిర్ కమాండ్ అధికారి పతర్గే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీని ఆయన కలిశారు. గతంలోనే ప్రతిపాదనలు సమర్పించామన్న పతర్గే, త్వరగా భూమి కేటాయించాలని విన్నవించారు. వైమానిక శిక్షణా కేంద్రాలకు తగిన భూములను నిర్దేశిత ధరలకు కేటాయించే అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎస్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

2020-02-19

ఇండియన్ ఆర్మీ మేజర్ అనూప్ మిశ్రా ప్రపంచంలోనే తొలి ‘బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్’ను సృష్టించారు. ఎకె47తో 10 మీటర్ల దూరం నుంచి కాల్చిన తూటాలను సైతం ఈ హెల్మెట్ ఆపగలదని అనూప్ చెప్పారు. ‘ప్రాజెక్ట్ అభేద్య’లో భాగంగా అనూప్ ఈ హెల్మెట్ రూపొందించారు. గతంలో స్నైపర్ బుల్లెట్ల నుంచి కాచుకోవడానికి ఓ ఫుల్ బాడీ జాకెట్ ను అనూప్ రూపొందించారు. ‘ఆర్మీ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్’కు చెందిన అనూప్ గతంలో కాలం చెల్లిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తో కాల్పులకు గురయ్యారు.

2020-02-07 Read More

పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఓ మిరాజ్ విమానం శుక్రవారం పంజాబ్ ప్రావిన్స్‌లో కూలిపోయింది. ప్రావిన్స్‌లోని షోర్కోట్ ప్రాంతానికి సమీపంలో శిక్షణా కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన జరిగింది. "పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. భూమిపైన కూడా ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం రిపోర్టు కాలేదు" అని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కారణాలపై విచారణకు ఆదేశించారు. జనవరి 7న ఓ శిక్షణా విమానం కూలి ఇద్దరు పైలట్లు చనిపోయారు.

2020-02-07

2020-21 బడ్జెట్లో కేంద్రం రక్షణ రంగానికి రూ. 4,71,378 కోట్లు కేటాయించింది. మొత్తం వ్యయంలో ఇది 15.49 శాతం. భారీ కేటాయింపులు పొందిన మంత్రిత్వ శాఖల్లో ‘రక్షణ’ నెంబర్ 1. అయితే, పెరుగుదల పెన్షన్లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. రక్షణ శాఖ పెన్షన్లకోసం ఈ ఏడాది రూ. 1,12,080 కోట్లు కేటాయించగా 2020-21కోసం 1,33,825 కోట్లు కేటాయించారు. కేపిటల్ వ్యయం కింద ఈ ఏడాది రూ. 1,03,394 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికోసం రూ. 1,13,734 కోట్లు కేటాయించారు.

2020-02-02

భారత ఆర్మీలో అతి పెద్దదైన దక్షిణాది కమాండ్ బాధ్యతలను లెఫ్టినెంట్ జనరల్ సి.పి. మహంతి గురువారం స్వీకరించారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, గోవా ఈ కమాండ్ పరిధిలో ఉన్నాయి. పూణెలోని కమాండ్ కేంద్ర కార్యాలయంలో గురువారం బాధ్యతల స్వీకారం లాంఛనంగా జరిగింది. ఒడిషాకు చెందిన మహంతికి పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో పని చేసిన అనుభవం ఉంది. ఇప్పటిదాకా దక్షిణాది కమాండ్ బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.కె. సైని భారత ఆర్మీ వైస్ చీఫ్ గా ప్రమోటయ్యారు.

2020-01-30

అమెరికా వైమానిక దళం కమ్యూనికేషన్ విమానం ‘ఇ-11ఎ’ సోమవారం ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఇద్దరు పైలట్లు మరణించారు. ఘజిని ప్రావిన్సులో తాలిబన్ల అధీనంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో విహరిస్తున్న సమయంలో విమానం కూలిపోయింది. కూలిన విమానం చిత్రాలు మీడియాలో రాగానే... తామే కూల్చివేశామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, తమ విమానం కూలినట్లు ఆలస్యంగా అంగీకరించిన అమెరికా.. కారణాలపై విచారణ జరుగుతోందని పేర్కొంది.

2020-01-27
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Last Page