అమెరికాతో ఆయుధాల తగ్గింపు ఒప్పందం (కొత్త START) కోసం తమ అణ్వాయుధాలను స్తంభింపజేయడానికి సిద్ధమని రష్యా ప్రకటించింది. ‘‘కొత్త స్టార్ట్ ఒప్పందాన్ని ఏడాది పాటు పొడిగించడానికి రష్యా ప్రతిపాదిస్తోంది. అమెరికాతో కలసి ఈ కాలానికి రెండు దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలను స్తంభింపజేయడానికి రాజకీయ నిబద్ధతతో ఉంది’’ అని రష్యా విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేయాలని, అణ్వాయుధాలను స్తంభింపజేయడానికి అమెరికా ఇతరత్రా డిమాండ్లు ఏమీ పెట్టకూడదని రష్యా స్పష్టం చేసింది.

2020-10-20

చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి సమస్య కమ్ముకొచ్చింది. పశ్చిమ సరిహద్దులో జమ్మూకాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్టిలరీ గన్స్ ఉపయోగించి కాల్పులు జరుపుతోంది. భారత సైన్యం అందుకు దీటుగా స్పందించింది. ఈ కాల్పులలో ముగ్గురు భారత జవాన్లు మరణించినట్టు గురువారం సైనికాధికారులు తెలిపారు. బుధవారం రాత్రి పాకిస్తాన్ ప్రారంభించిన కాల్పులు కొత్తవేమీ కావు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుండగా గత 8 నెలల్లో పాకిస్తాన్ 3,000 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని సమాచారం. గత 17 సంవత్సరాల్లో ఇదే అత్యధికం.

2020-10-01

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఫ్రాన్స్ నుంచి తొలి ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు ఈ నెల 27న దిగుమతి అవుతున్నాయి. ‘గోల్డెన్ యారోస్’ పేరిట రాఫేల్ యుద్ధ విమానాలతో హర్యానాలోని అంబాలా కేంద్రంగా 17వ స్క్వాడ్రన్ ఏర్పాటు కానుంది. ఫ్రాన్స్ లోని ఇస్ట్రెస్ నుంచి భారత పైలట్లు రాఫేల్ ఫైటర్లను నడపనున్నారు. మధ్యలో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్ గాల్లోనే ఇంధనం నింపుతుంది. ఇండియాకు వచ్చే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్ ధాఫ్రా వైమానిక స్థావరంలో మాత్రం రాఫేల్స్ ఆగనున్నాయి. 36 రాఫేల్ ఫైటర్లకు 7.8 బిలియన్ యూరోలు (ప్రస్తుత మారకం ప్రకారం రూ. 66,745 కోట్లు) చెల్లించేందుకు 2016లో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంద

2020-07-21

భారత ఆర్మీ ‘ఫేస్ బుక్’ సహా 89 మొబైల్ అప్లికేషన్లను నిషేధించింది. ఆయా ‘యాప్’లను స్మార్ట్ ఫోన్లనుంచి తొలగించాలని జవాన్లకు హుకుం జారీ చేసింది. నిషేధిత జాబితాలో సహజంగానే ఎక్కువ భాగం చైనా అప్లికేషన్లు ఉన్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా నిషేధించిన 59 చైనా అప్లికేషన్లకు తోడు ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్, ట్రూ కాలర్, టంబ్లర్, రెడ్డిట్ వంటి వివిధ రకాల అప్లికేషన్లను ఆర్మీ నిషేధించింది. పబ్జి గేమ్ అప్లికేషన్, డైలీ హంట్ న్యూస్ అప్లికేషన్ కూడా ఈ నిషేధిత జాబితాలో ఉండటం గమనార్హం.

2020-07-08

ఉద్రిక్తతలను తగ్గించే చర్యల్లో భాగంగా లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా, ఇండియా సైన్యాలు చెరికొద్ది దూరం వెనుకకు మళ్లినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో బీకర ఘర్షణకు కేంద్ర బిందువైన గాల్వన్ లోయ మలుపు నుంచి చైనా సైన్యం ఓ కిలోమీటర్ వెనుకకు వెళ్ళినట్లు అధికారవర్గాలు పిటిఐకి తెలిపాయి. అయితే, ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా అన్నది వేచి చూడాలని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. జూన్ లోనూ చైనా సైన్యం వెనక్కు వెళ్లినట్లు పలుమార్లు భారత ప్రభుత్వ వర్గాల పేరిట వార్తలు వచ్చాయి. జూన్ 15 ఉదయం ఇలాంటి వార్త రాగా ఆ రాత్రి జరిగిన బీకర ఘర్షణలో 20 మందికి పైగా భారత జవాన్లు మరణించారు.

2020-07-06

భారత వాయుసేన రష్యా నుంచి 21 మిగ్-29 యుద్ధ విమానాలను, ఆ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తయారు చేసే 12 ఎస్.యు-30 ఎంకెఐ ఫైటర్లను కొనుగోలు చేయనుంది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఇండియా వద్ద ఉన్న 59 మిగ్-29 యుద్ధ విమానాలను ఆధునీకరించనున్నారు. 21 మిగ్-29ల కొనుగోలు, 59 మిగ్-29ల ఆధునీకరణకు కలిపి రూ. 7,418 కోట్లు అవుతాయని అంచనా. 12 ఎస్.యు-30 ఎంకెఐల ఖరీదు రూ. 10,730 కోట్లు.

2020-07-02

ఎస్-400.. అత్యంత శక్తివంతమైన రష్యన్ తయారీ క్షిపణి రక్షణ వ్యవస్థ. అమెరికా ఆంక్షలు విధిస్తానన్నా ఆ దేశాన్ని ఒప్పించి మరీ ఇండియా ఈ వ్యవస్థకోసం రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇంకా ఇండియా చేతికి అందలేదు. కానీ, చైనా ఇప్పటికే ఎస్-400 క్షిపణి వ్యవస్థలను సరిహద్దుల వద్ద మోహరించింది. దానికంటే ముందు రష్యా రూపొందించిన ఎస్-300, చైనా దేశీయంగా రూపొందించిన ఎల్.వై-80 వ్యవస్థలు కూడా రెడీగా ఉన్నట్టు సమాచారం. సరిహద్దులకు దగ్గరగా ఎక్కువ వైమానిక స్థావరాలు ఉండటం ఇండియాకు సానుకూల అంశమైతే.. క్షిపణి రక్షణ వ్యవస్థలు బలంగా ఉండటం చైనా సానుకూలత.

2020-06-30

చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఇజ్రాయిల్ తయారీ స్పైస్-2000 బాంబులు మరిన్ని కొనుగోలు చేయాలని భారత వైమానిక దళం యోచిస్తోంది. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ. 500 కోట్ల లోపు ఉండేలా ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం త్రివిధ దళాధిపతులకు అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అధికారాలతో స్పైస్-2000 బాంబులను పెద్ద మొత్తంలో సమకూర్చుకోవాలని వైమానికదళం భావిస్తోంది. భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే ఈ బాంబులు ఉన్నాయి. గత ఏడాది పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపైన దాడికి ఈ బాంబులను వినియోగించారు.

2020-06-30

‘టిక్ టాక్’, హలో, షేర్ ఇట్, యుసి బ్రౌజర్, క్యామ్ స్కానర్, లైకీ, న్యూస్ డాగ్, వీబో, ఎంఐ కమ్యూనిటీ సహా చైనా కంపెనీలు రూపొందించిన 59 మొబైల్ అప్లికేషన్లను భారత ప్రభుత్వం సోమవారం నిషేధించింది. ఐటి చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ అధికారాన్ని ఉపయోగించింది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ వేదికలపై కొన్ని మొబైల్ అప్లికేషన్లు వినియోగదారుల సమాచారాన్ని దేశం వెలుపలి సర్వర్లకు రహస్యంగా బదలాయిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఐటి శాఖ తెలిపింది. జాతీయ భద్రతకు వ్యతిరేక శక్తులు ఈ డేటాను వినియోగించడం.. ఇండియా సార్వభౌమాధికారం, సమగ్రతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

2020-06-29

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో యుద్ధ సామాగ్రి దిగుమతులకోసం భారత ప్రభుత్వం త్వరపడుతోంది. ఫ్రాన్స్ నుంచి తొలి దశలో 6 రఫేల్ యుద్ధ విమానాలు జూలై 27 నాటికి వస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ రాసింది. ఈ నెల 15న చైనా, ఇండియా సైనికుల ఘర్షణకు ముందే (జూన్ 2న) భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో ఫోన్లో మాట్లాడారు. లడఖ్ లోని గాల్వన్ లోయ, పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో ఇండియా గస్తీ నిర్వహించే ప్రాంతాల్లోకి చైనా సైన్యం మే నెలలోనే చొరబడిన విషయం తెలిసిందే. ‘కరోనా’ కారణంగా రఫేల్ రాకలో జాప్యం జరగకుండా ఇండియా జాగ్రత్తపడింది.

2020-06-29
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Last Page