జమ్మూ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లు, సాయుధ బలగాలకు అధునాతన సామాగ్రి అందించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు వార్తా సంస్థలు తెలిపాయి. రేపు మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించనున్నారు.
2021-06-29అణ్వాయుధ సామర్థ్యంతో డి.ఆర్.డి.ఒ. రూపొందించిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని పి’ పరీక్ష విజయవంతమైంది. ఒడిషా తీరానికి దగ్గరగా ఉన్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం దీవి నుంచి సోమవారం ఉదయం 10.55 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించారు. తూర్పు తీరం పొడవునా ఉన్న టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు ఈ క్షిపణి గమనాన్ని పరిశీలించాయి. నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుందని అధికారులు తెలిపారు. అగ్ని తరగతి క్షిపణుల్లో ఆధునికమైన ‘అగ్ని పి’ 1000- 2000 కి.మీ. మధ్య లక్ష్యాలను ఛేదించగలదు.
2021-06-28 Read More‘చాద్’ అధ్యక్షుడు ఇద్రిస్ డెబి రెబల్స్ తో పోరాటంలో మరణించినట్టు ఆ దేశపు మిలిటరీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రంట్ లైన్ లోని సైనికులను కలుసుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్టు పేర్కొంది. అంతకు మించి వివరాలను వెల్లడించలేదు. డెబి మరణవార్తతో పాటే ఆయన కుమారుడిని దేశానికి తాత్కాలిక నాయకునిగా నియమిస్తూ ప్రకటన వెలువడింది. ప్రభుత్వం, పార్లమెంటు రద్దయ్యాయి. మరణించిన డెబి (68) పశ్చిమ దేశాల మద్ధతుతో దేశాన్ని 30 సంవత్సరాల పాటు ఉక్కుపాదంతో పాలించారు.
2021-04-20రక్షణ రంగంలో రష్యా సహకారంతో దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్.సి.ఎ) ‘తేజస్’కు మెరుగైన రూపం ఎల్.సి.ఎ. ఎంకె-1ఎ. ఇప్పుడీ రకానికి చెందిన 83 విమానాలను రూ. 48,000 కోట్లతో కొనుగోలు చేయడానికి భారత వైమానిక దళానికి కేంద్రం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఈ భారీ రక్షణ కొనుగోళ్ళకు ఆమోదం తెలిపింది. ‘తేజస్’లో స్వదేశీ సరుకు 50 శాతం ఉండగా, ‘ఎంకె-1ఎ’లో అది 60 శాతానికి పెరిగింది. ఎంకె-1కు 40 అంశాల్లో మెరుగులు దిద్దారు.
2021-01-13 Read Moreపాత, కొత్త ఆయుధాలను వరుసగా పరీక్షించి చూస్తున్న భారత సైన్యం.. ఈ వరుసలో తాజాగా గగనతల రక్షణ క్షిపణులను పరీక్షించింది. దేశీయంగా రూపొందించిన ఆకాశ్ గగన తల రక్షణ వ్యవస్థను, రష్యా నుంచి కొనుగోలు చేసిన హ్యాండ్ లాంచర్ మిసైల్ ‘ఇగ్లా’లను పరీక్షించేందుకు పెద్ద ఎత్తున విన్యాసాలను చేపట్టింది. గుంటూరు జిల్లా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద మంగళవారం నిర్వహించిన ఈ పరీక్షలను ఐఎఎఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరా వీక్షించారు.
2020-12-02బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాల పరంపరను ఇండియా మంగళవారం ప్రారంభించింది. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్. శబ్ద వేగానికి 2.8 రెట్లు వేగంగా ప్రయాణించగలదు. 290 కిలోమీటర్ల పరిధితో రూపొందిన క్షిపణిని ప్రస్తుతం ఇండియా పరీక్షించింది. సమీప భవిష్యత్తులో 400 కి.మీ. పరిధికి విస్తరించే ప్రయత్నంలో ఉంది. తర్వాత 1,500 కి.మీ. పరిధితో భూమి, నీరు, ఆకాశం నుంచి ప్రయోగించేలా ఈ క్షిపణి సామర్ధ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2020-11-24భూమిపై నుంచి ఆకాశంలో స్వల్ప దూర (30 కిలోమీటర్ల పరిధి) లక్ష్యాలను ధ్వంసం చేసే అధునాతన క్షిపణిని ఇండియా శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో డి.ఆర్.డి.ఒ. ఈ పరీక్షను నిర్వహించింది. రెండు వాహనాలతో కూడిన రక్షణ వ్యవస్థ నుంచి ప్రయోగించే ఈ క్షిపణి 15 కిలోమీటర్ల ఎత్తులో విహరించే విమానాలను కూల్చగలదు. ఒక వాహనంపైన ఉండే రాడార్ 100 లక్ష్యాలను గుర్తించగలదు. వాటిలో ఆరు లక్ష్యాలను రెండో వాహనంపైనున్న క్షిపణులు కూల్చగలవు.
2020-11-13పాకిస్తాన్ దాడికి భారత ఆర్మీ దీటుగా స్పందించింది. ఆ దేశ ఆర్మీ పోస్టులు, బంకర్లపై గైడెడ్ మిసైళ్లతో దాడి చేసింది. అందులో కొన్ని ఆయుధాలు, ఇంధనం దాచిన, ఉగ్రవాదులను ఉంచిన ప్రదేశాలని భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేశ్ కాలియా తెలిపారు. ఈ ప్రతిదాడిలో 8 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా అనధికారిక కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్ దాడిలో భారత జవాన్లు నలుగురు, పౌరులు నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఉద్ధేశపూర్వకంగానే పౌర ఆవాసాలపై దాడికి దిగిందని కాలియా విమర్శించారు.
2020-11-13కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పులలో ముగ్గురు భారత ఆర్మీ జవాన్లు, ఒక సరిహద్దు భద్రతా దళం జవాను, నలుగురు భారత పౌరులు మరణించారు. కాశ్మీర్ లోని యూరి, నౌగామ్, కేరన్, గురెజ్ సెక్టార్లలో నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. పౌరుల మరణాలన్నీ యూరి సెక్టార్ లోనే సంభవించాయి. కమాల్ కోట్ గ్రామంలో ఇద్దరు, బాల్ కోట్, గోఖన్ గ్రామాల్లో ఒకరు చొప్పున మరణించారు. చనిపోయిన పౌరుల్లో ఒక మహిళ, ఏడేళ్ల బాలుడు ఉన్నారు.
2020-11-13అమెరికాతో సైనిక-అంతరిక్ష సహకారానికి ఉద్ధేశించిన ద్వైపాక్షిక ఒప్పందంపై భారత ప్రభుత్వం రేపు (మంగళవారం) సంతకాలు చేయనుంది. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల (2+2) సమావేశం సందర్భంగా ప్రాథమిక పరస్పర మార్పిడి, సహకార ఒప్పందం (BECA) కుదుర్చుకోనుంది. సున్నితమైన సైనిక సమాచార మార్పిడికి, ఆధునిక ఆయుధాల కొనుగోలుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని చెబుతున్నారు. అమెరికా అందించే ఉపగ్రహ సమాచారంతో ఇండియా క్షిపణులు, డ్రోన్లు కచ్చితంగా లక్ష్యాలను ఛేదించగలవని భావిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యల నేపథ్యంలో అమెరికాతో భారత ప్రభుత్వం వరుస ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
2020-10-26