ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ‘డాగ్ ఫైట్’లో పాకిస్తాన్ ఎఫ్16 యుద్ధ విమానాన్ని కోల్పోలేదని అమెరికా పరిశీలనలో తేలింది. ఒక ఎఫ్16 విమానాన్ని తాము కూల్చివేశామని భారత ప్రభుత్వం ఇప్పటివరకు చేస్తున్న వాదనకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. అమెరికా సరఫరా చేసిన ఎఫ్16లను ఇటీవల ఆ దేశ నిపుణులు లెక్కించారని, అవన్నీ లెక్క తేలాయని ఫారెన్ పాలసీ మ్యాగజైన్ రాసింది. మిగ్ 21 పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ ఎఫ్16పై క్షిపణిని ప్రయోగించి.. అది లక్ష్యాన్ని తాకిందని నమ్మి ఉండొచ్చని తన కథనంలో పేర్కొంది.
2019-04-05 Read More