ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) రవాణా విమానం ఎఎన్-32 ఒకటి సోమవారం అరుణాచల్ ప్రదేశ్ గగనతలంపైన గల్లంతయింది. అందులో ఎనిమిదిమంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఐదుగురు ప్రయాణీకుల ఆచూకీ తెలియలేదు. అస్సాంలోని మెచూక నుంచి సోమవారం మధ్యాహ్నం 12.25 గంటలకు గాల్లోకి ఎగిరిన ఈ విమానం సిబ్బంది చివరిగా 1.00 గంటకు గ్రౌండ్ ఎజెన్సీలను సంప్రదించారు. ఆ తర్వాత ఎలాంటి సంకేతాలూ లేవు. ఈ విమానాన్ని వెతకడానికి ఎస్.యు-30 యుద్ధ విమానాలను, సి-130 రవాణా విమానాలను రంగంలోకి దించారు.
2019-06-03చైనాను విభజించే ప్రయత్నాలు ఫలించవని ఆ దేశ రక్షణ మంత్రి వీ ఫెంగె ఉద్ఘాటించారు. అమెరికా గనుక చైనానుంచి తైవాన్ ను విదీయాలని చూస్తే ‘చివరివరకు’ పోరాడతామని హెచ్చరించారు. సింగపూర్ ‘షాంగ్రి లా డైలాగ్’లో మాట్లాడిన మంత్రి..యుద్ధం వస్తే రెండు దేశాల్లో విధ్వసం జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘అమెరికా అవిభాజ్యం. అలాగే చైనా కూడా.. చైనా ఏకంగానే ఉండాలి. ఉంటుంది’’ అని వీ స్పష్టం చేశారు. అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ స్ట్రెయిట్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో చైనా మంత్రి మాట్లాడారు.
2019-06-02 Read More‘‘పర్షియన్ గల్ఫ్ లో పేలే మొదటి బుల్లెట్టే చమురు ధరను $100 పైకి తీసుకెళ్తుంది. అమెరికా, యూరప్ లతోపాటు మిత్రులైన జపాన్, దక్షిణ కొరియాలకు అది భరించలేనిది’’- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సలహాదారు మేజర్ జనరల్ యాహ్యా రహీమ్ సఫావి చేసిన హెచ్చరిక ఇది. ఇరాన్ దేశంతో పూర్తి స్థాయి యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థను ముంచుతుందని ఆయన అంచనా వేశారు. అమెరికా తన ఆర్థిక వ్యవస్థ మంచిని కోరుకుంటే యుద్ధానికి దిగదని పేర్కొన్నారు.
2019-06-02 Read Moreఅమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ విడుదల చేసిన ‘సీక్రెట్ మిసైల్ బంకర్’ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ భూగర్భ కేంద్రంలో పెద్ద సంఖ్యలో ఉంచిన మిసైళ్ళు, ఓ మిసైల్ ప్రయోగం వీడియోలో కనిపిస్తున్నాయి. వాటిని కియామ్-1 బాలిస్టిక్ మిసైళ్ళగా భావిస్తున్నారు. ఈ మిసైల్ రేంజ్ 750 కిలోమీటర్లు. ఫిబ్రవరిలో ఓ ‘అండర్ గ్రౌండ్ సిటీ’లో క్షిపణులు తయారు చేస్తున్న వీడియోను ఇరాన్ విడుదల చేసింది.
2019-06-01అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. యుద్ధం చేయాలనుకుంటే... అధికారికంగా ఇరాన్ చరిత్ర ముగిసిపోతుందని ట్రంప్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికాను మరెప్పుడూ బెదిరించవద్దని హెచ్చరించారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిననాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవలే ఇరాన్ చుట్టుప్రక్కలకు భారీగా యుద్ధ నౌకలను, బాంబర్లను అమెరికా పంపింది. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం తీవ్రమైంది.
2019-05-20 Read Moreఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను రష్యానుంచి కొనుగోలు చేయడం ఖాయమని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ శనివారం స్పష్టం చేశారు. దాంతోపాటు ఎస్-500 రక్షణ వ్యవస్థలను మాస్కోతో కలసి సంయుక్తంగా తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. అమెరికా మిసైళ్ళకు బదులు రష్యా ఎస్-400 కొనుగోలు చేయాలన్న టర్కీ నిర్ణయంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. అలా అయితే తమ ఎఫ్-35 భాగస్వామ్యం చెడుతుందని హెచ్చరిస్తోంది. కాగా, అమెరికా ఎఫ్-35 విమానాలను సరఫరా చేసి తీరుతుందని టర్కీ అధ్యక్షుడు చెబుతున్నారు.
2019-05-19 Read More‘‘మా చేతుల్లో ఆయుధాలతో అమెరికా రాకకోసం వేచి చూస్తున్నాం’’- వెనెజులా లోని అరగువా రాష్ట్రంలో సైనికులు వినిపించిన సమరనాదం ఇది. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు విధేయత చూపుతూ శుక్రవారం సైన్యం ఓ ర్యాలీని నిర్వహించింది. సైనికులు, మిలిటరీ వాహనాలు వెంటరాగా అధ్యక్షుడు మదురో స్వయంగా కొంతదూరం నడిచారు. అమెరికా మద్ధతుతో ప్రతిపక్ష నేత జువాన్ గాయిడో తనను తాను ‘‘మధ్యంతర అధ్యక్షుడు’’గా ప్రకటించుకున్న తర్వాత వెనెజులా ఉద్రిక్తంగా మారింది.
2019-05-18 Read More1970లలో పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ దీవుల్లో పెద్ద ఎత్తున అణుపరీక్షలు నిర్వహించిన అమెరికా ఆ వ్యర్ధాలను ఓ భారీ కాంక్రీటు కట్టడంతో కప్పిపెట్టింది. ఆ కాంక్రీటు డోమ్ నుంచి రేడియోథార్మిక పదార్ధం పసిఫిక్ మహాసముద్రంలోకి లీకవుతోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఫిజీలో విద్యార్ధులతో మాట్లాడిన గుటెర్రెస్, దశాబ్దాలనాటి అణు పరీక్షలు ఇప్పటికీ పసిఫిక్ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో నీరు విషతుల్యమైందని చెప్పారు.
2019-05-16 Read Moreహిమాలయ దేశాల జానపదాల్లో వినిపించే ‘యెతి’ అడుగు జాడలను తొలిసారిగా తమ పర్వతారోహకుల బృందం కనిపెట్టినట్టు భారత ఆర్మీ ప్రకటించింది. హిమాలయాల్లోని మకాలు బేస్ క్యాంపునకు దగ్గరలో ఈ నెల 9వ తేదీన కనిపించిన ఈ అడుగుల కొలత 32x15 అంగుళాలు ఉన్నట్టు సోమవారం రాత్రి ట్విట్టర్లో వెల్లడించింది. నేపాలీ జానపదాల ప్రకారం ‘యెతి’ ఒక ఏప్ తరహా జీవి. ‘మంచు మనిషి’గా వ్యవహరిస్తుంటారు. అదే ప్రాంతంలో ‘యెతి’ని చూసినట్టు గతంలోనూ కొందరు చెప్పిన నేపథ్యంలో ఫొటోలు, వీడియో ఆధారాలు కూడా ఉన్నట్టు ఆర్మీ చెబుతోంది.
2019-04-29 Read Moreతమ భూభాగంపై మరోసారి దాడి చేయడానికి ఇండియా సిద్ధమైనట్టు తమకు ‘‘విశ్వసనీయమైన సమాచారం’’ ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి ఆదివారం చెప్పారు. ఏప్రిల్ 16, 20 తేదీల మధ్య దాడి జరగవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన నేపథ్యంలో.. 26వ తేదీన పాకిస్తాన్ లోని బాలాకోట్ జెఇఎం స్థావరంపై భారత వైమానిక దళం దాడి చేసింది. మరో దాడికి సంబంధించి తమ ఆందోళనను ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యులైన ఐదు దేశాలతో పంచుకున్నట్టు పాకిస్తాన్ తెలిపింది.
2019-04-07 Read More