లడఖ్ లోని డెంచోక్ సెక్టార్లో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడలేదని సైన్యాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. జూలై 6వ తేదీన భారత సరిహద్దులోపల దలైలామా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఆవిలివైపు నుంచి ఓ డజను మంది బ్యానర్లు ప్రదర్శించారని, ‘‘టిబెట్ ను చీల్చే కార్యకలాపాలను నిషేధించండి’’ అని ఆ బ్యానర్లపై రాసి ఉందని రావత్ వివరించారు. సింధు నదికి ఆవల ఇది జరిగిందని రావత్ శనివారం విలేకరులకు చెప్పారు.

2019-07-13 Read More

భారత వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించేందుకు నౌకా దళం కొన్ని యుద్ధ నౌకలను పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాలకు పంపింది. ఈ చర్యకు ‘ఆపరేషన్ సంకల్ప్’ అనే పేరు పెట్టింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో ఇటీవల కొన్ని ఆయిల్ ట్యాంకర్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ‘ఐఎన్ఎస్ చెన్నై’, ‘ఐఎన్ఎస్ సునైన’లను గల్ఫ్ ప్రాంతానికి పంపినట్టు భారత నౌకాదళం అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. భారత నౌకలకు భద్రతకోసం వైమానిక నిఘా కూడా ఉంటుందని తెలిపారు.

2019-06-20 Read More

అమెరికా డ్రోన్ కూల్చివేతపై ఇరాన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇరాన్ అధికారిక ఛానల్ ‘ప్రెస్ టీవీ’ దాన్నిప్రసారం చేసింది. ఇరాన్ దళాలు భూమిపై నుంచి గాల్లోకి ప్రయోగించే (ఎస్ఎఎం) మిసైల్ ను వదలడం, అది అమెరికా నిఘా డ్రోన్ ను పేల్చివేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ వీడియోలో.. 31 సెకన్లపాటు కూల్చివేత ఫుటేజీ, తర్వాత 10 సెకన్లపాటు డ్రోన్ ప్రయాణమార్గాన్ని సూచించే యానిమేషన్ ఉన్నాయి.

2019-06-20

తమ దేశ సరిహద్దుల లోపలికి వస్తే తిరిగి వెళ్లలేరని ఇరాన్ ఆర్మీ అమెరికాకు స్పష్టం చేసింది. అమెరికా నావికా దళానికి చెందిన నిఘా డ్రోన్ కూల్చివేత తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డు కార్ప్స్ కమాండర్ ఇన్ చీఫ్ హొస్సేన్ సలామి మాట్లాడారు. ‘మా సరిహద్దులే మాకు రెడ్ లైన్. ఓ శత్రువు మా సరిహద్దులను అతిక్రమిస్తే తిరిగి వెళ్లలేరు. ధ్వంసం చేస్తాం. మా శత్రువులు భద్రంగా ఉండాలంటే.. మా ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ఒక్కటే దారి. డ్రోన్ కూల్చివేతే అమెరికాకు మేమిచ్చే స్పష్టమైన సందేశం’ అని ఆయన ఉద్ఘాటించారు.

2019-06-20

తమ నిఘా డ్రోన్ ను కూల్చివేయడం ద్వారా ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ గగనతలంలోకి రావడంవల్లనే కూల్చేశామని ఇరాన్ ప్రకటించగా, తమ డ్రోన్ అంతర్జాతీయ గగనతలం పరిధిలోనే ఉందని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. డ్రోన్ కూల్చివేతతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే.. గురువారం డ్రోన్ కూల్చివేతపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

2019-06-20

అమెరికాతో ఉద్రిక్తతల నడుమ ఇరాన్ తొలి దెబ్బ కొట్టింది. కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నిఘా డ్రోన్ ఒకదాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డులు గురువారం కూల్చవేశారు. అమెరికా నౌకాదళానికి చెందిన మానవ రహిత ఆర్.క్యు-4ఎ గ్లోబల్ హాక్ నిఘా వాహనం ఆ దేశపు డ్రోన్ ఆర్మీలో కీలకమైనది. ఈ డ్రోన్ రెక్కల వెడల్పు బోయింగ్ 737 విమానంతో సమానం. ఖరీదు రూ. 700 కోట్లకు పై మాటే..! భూమిపై నుంచి విమానాలపైకి ప్రయోగించే ఓ ఇరాన్ మిసైల్ అమెరికా మానవ రహిత వాహనాన్ని నేలకూల్చింది.

2019-06-20 Read More

యూరప్ దేశాల ఆరో తరం యుద్ధ విమానం (ఎఫ్.సి.ఎ.ఎస్) పూర్తి స్థాయి నమూనా సోమవారంనాడు పారిస్ ఎయిర్ షోలో ఆవిష్కృతమైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ సమక్షంలో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ రక్షణ మంత్రులు ఈ యుద్ధ విమానం అభివృద్ధికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. 2040 నాటికి యూరోపియన్ యూనియన్ ప్రధాన యుద్ధ విమానంగా ఎఫ్.సి.ఎ.ఎస్. ఉంటుందని అంచనా. గతంలో యూరప్ దేశాలు సంయుక్తంగా ‘యూరోఫైటర్ టైఫూన్’, ‘పనావియా టోర్నడో’ జెట్లను రూపొందించాయి.

2019-06-17 Read More

ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య గత ఏడాదికంటే కొంత తగ్గినా ఉన్న ఆయుధాలను అన్ని దేశాలూ ఆధునీకరిస్తున్నట్టు స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధాన సంస్థ (సిప్రి) తెలిపింది. అమెరికా, రష్యా, యుకె, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియాల వద్ద 2019 ప్రారంభంలో 13,865 అణ్వాయుధాలు ఉన్నట్టు సోమవారం వెల్లడైన ‘సిప్రి’ ఇయర్ బుక్ 2019లో పేర్కొన్నారు. ప్రస్తుతం 3,750 అణ్వాయుధాలను మోహరించగా, వాటిలో 2000 ప్రయోగించడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని పేర్కొంది.

2019-06-17 Read More

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రవాణా విమానం ఎఎన్-32 శకలాలను మంగళవారం కనుగొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ‘లిపో’కు 16 కిలోమీటర్లు ఉత్తరాన సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఈ శకలాలు కనిపించాయి. గాలింపులో పాలు పంచుకున్న ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఎంఐ-17 ఈ శకలాలను కనుగొంది. ఈ నెల 3వ తేదీన 13 మందితో అస్సాంనుంచి బయలుదేరిన అరగంటకు విమానం అదృశ్యమైంది. అప్పటినుంచి ఎస్.యు-30 యుద్ధ విమానాలు, ఎంఐ17 హెలికాప్టర్లు, సి130జె రవాణా విమానాలతో గాలించారు.

2019-06-11 Read More

రష్యా ఎస్-400 మిసైళ్లను కొంటానన్నందుకు టర్కీపై మండిపడుతోంది అమెరికా. ఎఫ్-35 యుద్ధ విమానాలను టర్కీకి అమ్మే ప్రతిపాదనను విరమించుకొంది. తాజాగా ఎఫ్-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్లపై శిక్షణ తీసుకుంటున్న టర్కీ పైలట్లను ఉన్నపళంగా నిలిపివేసింది. ఆరిజోనాలో ఉన్న ల్యూక్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలో ఇకపైన టర్కీ పైలట్లకు శిక్షణ ఇవ్వబోవడంలేదని అమెరికా స్పష్టం చేసింది.

2019-06-11 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Last Page