పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోపల సైన్యం ఈ రోజు చేసిన దాడుల్లో మూడు శిబిరాలు ధ్వంసమయ్యాయని, 6 నుంచి 10 మంది పాక్ సైనికులు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. కుప్వారా తంగ్ధర్ సెక్టార్ ఎదురుగా ఉన్న నీలం లోయలోని టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ఫిరంగి దాడుల్లో ధ్వంసమయ్యాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపడానికి పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు ఆర్మీ చెబుతోంది.
2019-10-20 Read Moreరష్యా తన అణు త్రయంలోని అన్ని భాగాలనూ తాజాగా పరీక్షించి చూసింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్షిపణులను జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్లు, భూమిపై నుండే లాంచర్ల నుంచి ప్రయోగించింది. ‘గ్రోమ్ 2019’లో భాగంగా ఈ విన్యాసాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వీక్షించారు. భూమిపైన లాంచర్ నుంచి ‘ఇస్కందర్’ వ్యూహాత్మక మిసైల్ వ్యవస్థను, జలాంతర్గామి నుంచి సినేవా దూరశ్రేణి క్షిపణులను, టియు95 దూరశ్రేణి బాంబర్ల నుంచి అణుసామర్ధ్యం ఉన్న క్రూయిజ్ క్షిపణులను ఈ సందర్భంగా రష్యా పరీక్షించింది.
2019-10-18 Read Moreసిరియా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు అమెరికా ప్రకటించిన మూడు రోజుల్లోనే కుర్దులపైన టర్కీ దాడి చేసింది. ఈశాన్య సిరియాలో కుర్దు మిలీషియా అధీనంలో ఉన్న ప్రాంతాలపై బుధవారం టర్కీ జరిపిన తొలి దాడిలో 11 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. దాడులు జరుగుతున్న ప్రాంతాలనుంచి వేలమంది వలస పోతున్న దృశ్యాలు సామాజిక మాథ్యమాల్లో కనిపిస్తున్నాయి. టర్కీ ఆక్రమణపై చర్చించేందుకు భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని యుకె, ఫ్రాన్స్ కోరాయి.
2019-10-10టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈశాన్య సిరియాలో కుర్దుల నేతృత్వంలోని మిలీషియాలకు వ్యతిరేకంగా సైనిక ఆపరేషన్ ప్రారంభించారు. కుర్దిష్ మిలీషియాలను ఉగ్రవాదులుగా చూస్తున్న అంకారా, ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి దాడి అవసరమని వాదిస్తోంది. తాజా దాడికి ‘ఆపరేషన్ పీస్ స్ప్రింగ్’ అని నామకరణం చేసింది. టర్కీలోని కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పికెకె)కి అనుబంధంగా ఉన్నట్టు భావిస్తున్న సిరియా కుర్దు మిలిటెంట్లతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపైనా దాడి చేస్తున్నట్టు ఎర్డొగాన్ ప్రకటించారు.
2019-10-09 Read Moreఇండియా-పాకిస్తాన్ అణు యుద్ధంతో తక్షణమే 12.5 కోట్ల మంది ప్రజలు చనిపోతారని, ప్రపంచవ్యాప్తంగా ‘‘న్యూక్లియర్ వింటర్’’తో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని ఓ అధ్యయనం అంచనా వేసింది. ‘‘ఆ యుద్ధం.. బాంబులు ప్రయోగించిన ప్రదేశాలకే కాదు. మొత్తం ప్రపంచానికే ప్రమాదం’’ అని హెచ్చరించింది ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రిక. 2025లో రెండు దేశాల మధ్య సంభవించే యుద్ధ దృశ్యాన్ని ఊహాజనితంగా ఈ అధ్యయనంలో ఆవిష్కరించారు. అప్పటికి ఇరు దేశాలవద్ద 400 నుంచి 500 అణుబాంబులు ఉంటాయని పేర్కొన్నారు.
2019-10-03 Read Moreయునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు మోహరించిన క్షిపణి నిరోధక కవచాలన్నింటినీ ఛేదించగల కొత్త హైపర్సోనిక్ బాలిస్టిక్ అణు క్షిపణి (డిఎఫ్ -17)ని చైనా మంగళవారం ప్రదర్శించింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేతృత్వంలో జరిగిన పెద్ద సైనిక కవాతులో అధునాతన ఆయుధాలను చైనా ప్రదర్శించింది. డిఎఫ్-17 వేగం.. ప్రతిస్పందనగా అణ్వాయుధాలను ప్రయోగించాలా లేదా అని ప్రత్యర్ధులు నిర్ణయించుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వదు.
2019-10-01 Read Moreభారత వైమానిక దళం వెస్ట్రన్ ఫ్రంట్ పరిణామాలను పర్యవేక్షిస్తోందని, ప్రభుత్వం నిర్దేశిస్తే బాలకోట్ తరహా దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని ఎయిర్ ఫోర్స్ కొత్త అధిపతి ఆర్.కె.ఎస్ భదౌరియా చెప్పారు. సోమవారం ఐఎఎఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ విషయం మాట్లాడారు. 26 రకాల విమానాలలో సుమారు 4,250 గంటల ఎగిరిన అనుభవం ఉన్న భదౌరియా, 36 రాఫెల్ జెట్ల సేకరణ కోసం జరిగిన వాణిజ్య చర్చలకు నాయకత్వం వహించారు. ఈ ఫ్రెంచ్ యుద్ధ విమానాలతో ఎయిర్ ఫోర్స్ సామర్ధ్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
2019-09-30 Read Moreత్రివిధ దళాలకు ఒకే అధిపతిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్)ని నియమించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమన్వయం సాధించి, మెరుగైన నాయకత్వాన్ని సి.డి.ఎస్. అందిస్తారని ప్రధాని చెప్పారు. 73వ స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మోదీ ప్రసంగించారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో తలెత్తిన సమన్వయ లోపాలను అధ్యయనం చేసిన ఉన్నత స్థాయి కమిటీ సి.డి.ఎస్. నియామకానికి సిఫారసు చేసింది.
2019-08-15 Read Moreబాలాకోట్ దాడుల తర్వాత రోజు (ఫిబ్రవరి 27) గగనతల ఘర్షణలో పాల్గొని పాకిస్తాన్ సైన్యానికి బంధీగా చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ‘వీర్ చక్ర’ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. భారత స్వాతంత్ర దిన వార్షికోత్సవం సందర్భంగా రేపు వర్తమాన్ ఈ పురస్కారాన్ని అందుకుంటారని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. యుద్ధ పురస్కారాల్లో ప్రాధాన్యతా క్రమంలో మూడవది ‘వీర్ చక్ర’. పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర అత్యంత ప్రాధాన్యత గల పురస్కారాలు.
2019-08-14 Read Moreస్పానిష్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-18 యుద్ధ విమానాన్ని తమ ఫైటర్ జెట్ ఎస్.యు-27 దూరంగా తరమిన వీడియోను రష్యా మిలిటరీ మంగళవారం విడుదల చేసింది. రష్యా రక్షణ మంత్రి, అధికారులు ప్రయాణిస్తున్న పాసెంజర్ విమానం బాల్టిక్ సముద్రంపై నుంచి వెళ్తున్నప్పుడు స్పానిష్ యుద్ధ విమానం చాలా దగ్గరగా వచ్చింది. దీంతో..మంత్రి విమానానికి రక్షణగా వచ్చిన రష్యా ఫైటర్ జెట్ స్పానిష్ యుద్ధ విమానం దిశగా వెళ్లింది. అది చూసి ఎఫ్-18 దూరంగా జరిగి ఆ తర్వాత వేగంగా ఎత్తుకు ఎగిరిపోయింది.
2019-08-13