అమెరికా నౌకాదళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు అదృశ్యం కావడం చరిత్రలోనే అరుదైన మిస్టరీగా మిగిలిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం 1945 డిసెంబర్ 5న చోటు చేసుకున్న ఈ ఉదంతంతో ‘బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ’ ఓ జానపద గాథగా మారింది. ఫ్లోరిడాలోని అమెరికా నేవీ ఎయిర్ స్టేషన్ నుంచి ఫ్లైట్-19 సహా ఐదు టోర్పెడో బాంబర్లు ఆ రోజు మధ్యాహ్నం 2.10కి బయలుదేరి వెళ్లి తిరిగి రాలేదు. వాటిని వెతకడానికి వెళ్లిన మెరైనర్ విమానమూ అదృశ్యమైంది. ఆరు విమానాలు, 27 మంది సైనికుల జాడ కూడా తెలియలేదు.
2019-12-05 Read Moreసామాజిక మాథ్యమాల్లో ఆధ్యాత్మిక గురువులు, బాబాలుగా దర్శనమిస్తున్నవారికి దూరంగా ఉండాలని భారత ఆర్మీ తన జవాన్లను హెచ్చరించింది. ఆర్మీ గుట్టు తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఏజంట్లు ఆధ్యాత్మిక అవతారం ఎత్తుతున్నారని వచ్చిన సమాచారంతో ఈ హెచ్చరిక చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో సైనిక దళాల కదలికలపై సమాచారం సేకరించేందుకు పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజంట్లు ఆధ్యాత్మిక గురువుల్లా జవాన్లకు వల విసురుతున్నారని ఓ ఆర్మీ అధికారి గురువారం చెప్పారు. 150 ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించారు.
2019-11-07ఎన్.సి.సి. బాలికా కేడెట్లకు పోర్న్ వీడియోలు పంపిన భారత ఆర్మీ మేజర్ జనరల్ ఒకరు ‘కోర్టు మార్షల్’ను ఎదుర్కోబోతున్నారు. దేశ పశ్చిమ భాగంలో పోస్టయిన ఈ అధికారి విధుల్లో ‘నేషనల్ కేడెట్ కార్ప్స్’ బాలికల విభాగం కూడా భాగం. అక్కడి బాలికా కేడెట్లకు ఈ మేజర్ జనరల్ సెక్స్ వీడియోలను షేర్ చేసేవాడు. ఆ బాలికలు సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో మరో మేజర్ జనరల్ ను కోర్టు మార్షల్ చేశారు.
2019-10-31 Read Moreకాశ్మీర్ వివాదంలో ఇండియావైపు నిలిచే దేశాలు తమ క్షిపణులను ఎదుర్కోవలసి ఉంటుందని పాకిస్తాన్ మంత్రి అలి అమీన్ గండాపూర్ హెచ్చరించారు. అలి పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వంలో కాశ్మీర్ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. కాశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు పెరిగితే పాకిస్తాన్ యుద్ధం చేయక తప్పని పరిస్థితి వస్తుందని అలి పేర్కొన్నారు. ‘‘ఒక క్షిపణి ఇండియా పైకి వెళ్తే మరొకటి దానికి మద్ధతు ఇచ్చిన దేశంపైకి వెళ్తుంది’’ అని హెచ్చరించారు.
2019-10-29 Read Moreఇండియా, చైనా సైన్యాల మధ్య సెరిమోనియల్ బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బిపిఎం) శనివారం లడఖ్ తూర్పు ప్రాంతంలో జరిగింది. రేపటి దీపావళి పండుగ నేపథ్యంలో ఈ సమావేశంలో లాంఛనంగా దీపావళి సంబరాలు జరిపారు. ఇండియన్ ఆర్మీ, చైనా పీపుల్స్ లిబరేషన్ అర్మీ అధికారులు స్నేహపూర్వకంగా మతాబులు కాల్చారు. సరిహద్దు సైనిక దళాల మధ్య బిపిఎంలు జరగడం సాధారణమే. కొద్ది రోజుల క్రితం చైనా జాతీయ దినోత్సవం సందర్భంగా నాథులా పాస్ వద్ద ఇరు దేశాల సైనికాధికారులు ఆనందాన్ని పంచుకున్నారు.
2019-10-26అమెరికా ‘‘స్పేస్ ఫోర్స్’’ త్వరలో వాస్తవరూపం దాల్చబోతోందని ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. సోమవారం వాషింగ్టన్ లో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ (ఐఎసి) 2019’లో మైక్ పెన్స్ మాట్లాడారు. అంతకు ముందు ఆయన అంతరిక్ష పరిశోధనపై మాట్లాడారు. ఒక తరానికి పైగా మానవ అంతరిక్ష పరిశోధన అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కుంటుపడిందని పెన్స్ వ్యాఖ్యానించారు. ట్రంప్ నాయకత్వంలో దార్శనికతతో మానవాళిని విస్తారమైన అంతరిక్షంలోకి నడిపిస్తామని చెప్పుకొచ్చారు.
2019-10-22అవసరమైతే టర్కీపై మిలిటరీ చర్య తీసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘పూర్తి సన్నద్ధత’’తో ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. సోమవారం ఆయన సి.ఎన్.బి.సి.తో మాట్లాడుతూ ఆయన ఈ సంచలనం రేపారు. ‘‘యుద్ధం కంటే శాంతికి మేము ప్రాధాన్యత ఇస్తాం. అయితే, మిలిటరీ చర్యే అవసరమైన పరిస్థితి వస్తే అధ్యక్షుడు ట్రంప్ ఆ చర్యకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని మీరు తెలుసుకోవాలి’’ అని పాంపియో చెప్పారు.
2019-10-22సిరియాను వదిలి వెళ్లిపోతూ అమెరికా దళాలు తమ సొంత వైమానిక స్థావరంపైనే బాంబులు వేశాయి. ఉత్తర సిరియాలో టెల్ టామెర్ పట్టణానికి సమీపంలోని వైమానిక స్థావరం, ల్యాండింగ్ స్ట్రిప్ లను... మరో స్థావరంలోని పరికరాలను అమెరికా సైనికులు ధ్వంసం చేశారు. టర్కీ సరిహద్దులో హసాకా ప్రావిన్స్ లో ఉన్న ఈ ఎయిర్ స్ట్రిప్... పెద్ద మిలిటరీ రవాణా విమానాలు దిగడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇంతకు ముందు హడావిడిగా వదిలి వెళ్లిన స్థావరాలు ప్రత్యర్ధులకు ఉపయోగపడటం అమెరికాకు తలనొప్పిగా మారింది.
2019-10-21 Read Moreసిరియానుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించిన నేపథ్యంలో ఆ దేశంలోని స్థావరాలనుంచి వెళ్లిపోతున్న సైన్యాన్ని కుర్దులు అసహ్యించుకుంటున్నారు. సిరియా సరిహద్దు పట్టణమైన ఖామిష్లిలో అమెరికా సైనికుల వాహనంపై కొందరు రాళ్లు, కుళ్లిపోయిన పండ్లు విసురుతున్న వీడియో ఒకటి కుర్దుల ఆగ్రహానికి అద్దం పట్టింది. కొంతమంది ప్రజలు వాహనానికి అడ్డుగా వచ్చి ‘నో నో’ అనడం, వాహనం ముందుకు కదలగానే రాళ్లు విసరడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కుర్దిష్ ఏజెన్సీ ‘హవర్ న్యూస్’ ఈ వీడియోను పోస్టు చేసింది.
2019-10-21భారత ఆర్మీ నిష్కారణంగా తమ జురా, షాకోట్, నౌషేరి సెక్టార్లలోని పౌర ప్రాంతాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. తాము సమర్ధవంతంగా ప్రతిస్పందించామని, దీంతో 9 మంది భారత జవాన్లు మరణించారని, అనేక మంది గాయపడ్డారని, రెండు బంకర్లు ధ్వంసమయ్యాయని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత ఆర్మీ దాడిలో తమ సైనికుడు ఒకరు, ఐదుగురు పౌరులు మరణించినట్టు తెలిపారు.
2019-10-20