గగనతల రక్షణ వ్యవస్థల్లో అగ్ర స్థానం రష్యాది. ఎస్-300.. తర్వాత ఎస్-400 రష్యా అమ్ముల పొదిలో చేరాయి. 400 కిలోమీటర్ల దూరం, 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను తుత్తునియలు చేసే సామర్ధ్యం ఎస్-400 సొంతం. దీనికోసం టర్కీ ఏకంగా అమెరికాను ధిక్కరించి 5వ తరం (ఎఫ్-35) యుద్ధ విమానాలను కూడా వదులుకుంది. ఇదీ ఎస్-400 క్రేజు. 2020లో రష్యా ఎస్-500ను పరీక్షించబోతోంది. ఈ కొత్త ఆయుధం దీర్ఘశ్రేణి క్షిపణులను సైతం ధ్వంసం చేయగలదని అంచనా.
2019-12-28‘‘మీరు ఆర్మీకి నాయకత్వం వహిస్తున్నారు. మీ పని మీరు చూసుకోండి. రాజకీయ నాయకులు చేసే పని వాళ్ళు చేస్తారు. మేం ఏం చేయాలో చెప్పడం ఆర్మీ పని కాదు. అలాగే యుద్ధం ఎలా చేయాలో చెప్పడం మా పని కాదు’’...రక్షణ శాఖ మాజీ మంత్రి చిదంబరం భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు చేసిన హితబోధ ఇది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేపట్టిన ఆందోళనపై ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు చిదంబరం ఈ విధంగా స్పందించారు.
2019-12-28సూపర్ సోనిక్ క్షిపణులను సైన్యానికి అందించిన తొలి దేశంగా రష్యా ఈ ఏడాది రికార్డు సాధించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించిన రష్యా, 2019లో ఆయుధాలు, రక్షణ కార్యకలాపాలపై లక్షా 74 వేల కోట్ల రూపాయలు (24.2 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. అత్యాధునిక ఆయుధాలు, పరికరాలు సమకూర్చుకోవడంలో రష్యాకు 2019 ప్రత్యేక సంవత్సరంగా చెప్పుకోవాలి. కాగా, రష్యా మొత్తం రక్షణ వ్యయం 63 బిలియన్ డాలర్లు.
2019-12-28రష్యా హైపర్ సోనిక్ మిసైల్ ‘‘అవన్ గార్డ్’’ సైనిక వినియోగంకోసం అందుబాటులోకి వచ్చింది. అణ్వాయుధ సహిత అవన్ గార్డ్ క్షిపణికి.. ధ్వని కంటే 27 రెట్లు వేగంగా ప్రయాణించే సామర్ధ్యం ఉందని రష్యా ప్రకటించింది. అంత వేగంలోనూ చురుగ్గా దిశను మార్చుకోగల నైపుణ్యం ఈ క్షిపణి సొంతం. దీన్ని అడ్డుకోవడం ప్రపంచంలోని ఏ ‘క్షిపణి రక్షణ వ్యవస్థ’కూ సాధ్యం కాదని చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గత ఏడాదే దీన్ని జాతికి అంకితం చేయగా, శుక్రవారం సైన్యం వినియోగానికి సిద్ధం చేశారు.
2019-12-28మిగ్ 27. 1985లో భారత వాయుసేన లోకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానం అన్ని వైమానిక ఆపరేషన్లలోనూ కీలక పాత్ర పోషించింది. గగన తలం నుంచి భూమిపైన లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రధానంగా ఈ విమానాలను వాయుసేన వినియోగించింది. 1999 కార్గిల్ యుద్ధంలోనూ ఈ విమానానిది కీలక పాత్ర. మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ఈ శక్తివంతమైన విమానానికి శుక్రవారం (డిసెంబర్ 27) వాయుసేన వీడ్కోలు పలుకుతోంది.
2019-12-27ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పి.ఒ.కె)లో ఏదో ఒక చర్యకు దిగుతారని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతేహం వ్యక్తం చేశారు. ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నుంచి ద్రుష్టి మళ్ళించేందుకు మోడీ ఈ చర్యకు దిగుతారని ఇమ్రాన్ పేర్కొన్నారు. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో తమ జవాన్లు ఇద్దరు మరణించారని పాక్ సైన్యం ప్రకటించిన తర్వాత ఇమ్రాన్ మాట్లాడారు.
2019-12-26సైన్యంలోని త్రివిధ దళాలకు కలిపి ఒక అధిపతిని నియమించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య మెరుగైన సమన్వయం కోసం ముగ్గురు అధిపతులకు పైన ‘‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్)’’ ఉంటారు. ‘‘ఫోర్ స్టార్ జనరల్’’ ర్యాంకుతో సరికొత్త పోస్టుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ చీఫ్... కొత్తగా ఏర్పాటు చేయబోయే మిలిటరీ వ్యవహారాల శాఖ (డిఎంఎ)కు కూడా అధిపతిగా వ్యవహరిస్తారు. డి.ఎం.ఎ. రక్షణ శాఖలో అంతర్భాగం.
2019-12-24చిలీ దేశపు మిలిటరీ విమానం సి-130 హెర్క్యులస్ ఒకటి అదృశ్యమైంది. అందులో 17 మంది సిబ్బంది, 21 మంది ప్రయాణీకులు ఉన్నట్టు చిలీ ఎయిర్ ఫోర్స్ మంగళవారం వెల్లడించింది. ప్రయాణీకులలో ముగ్గురు సాధారణ పౌరులు. దేశ దక్షిణ భాగంలోని పుంటా అరేనాస్ నగరం నుంచి అంటార్కిటికాలోని స్థావరానికి వెళ్లడానికి సోమవారం సాయంత్రం విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రేడియో సంకేతాలు తెగిపోయాయి.
2019-12-10 Read Moreఅది 1941 డిసెంబర్ 7 ఉదయం 7.55 (హవాయి కాలమానం). సూర్యోదయాన్ని ప్రతిబింబించే జపాన్ పతాక చిత్రంతో 360 జపాన్ యుద్ధ విమానాలు ‘‘పెరల్ హార్బర్’’పై దాడి చేశాయి. హవాయి దీవుల్లోని ఆ అమెరికా సైనిక స్థావరం కకావికలమైంది. అమెరికా పసిఫిక్ ఫ్లీట్ కు భారీగా నష్టం వాటిల్లింది. అక్కడ ఉన్న 8 యుద్ధ నౌకల్లో 5, మూడు డెస్ట్రాయర్లు, మరో 7 ఇతర నౌకలు, 200 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. 2,400 మంది అమెరికన్లు మరణించారు. మరో 1200 మంది గాయపడ్డారు. ఈ దాడితోనే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టింది.
2019-12-07 Read Moreపెరల్ హార్బర్ లోని అమెరికా సైనిక కేంద్రంలో ఒక నావికుడు రక్షణ శాఖ సివిల్ ఉద్యోగులపై కాల్పులు జరిపి తానూ కాల్చుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో కాల్పులు జరిపిన సైనికుడితోపాటు ముగ్గురు చనిపోయారు. మరొక బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల తర్వాత హార్బర్ నౌకా కేంద్రాన్ని మూసివేశారు. పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేసి ఈ నెల 7వ తేదీకి 78 సంవత్సరాలు అవుతోంది. సరిగ్గా మూడు రోజుల ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది.
2019-12-05