అంగారక గ్రహంపైన ఎగరగలమా? సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రశ్నకు సమాధానమే ‘నాసా మార్స్ హెలికాప్టర్’. వచ్చే వేసవిలో అరుణ గ్రహంపైకి ‘మార్స్ 2020 రోవర్’తోపాటే ఒక మినీహెలికాప్టర్ ను పంపడానికి ‘నాసా’ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఒక శూన్యగదిలో మార్స్ వాతావరణాన్ని సృష్టించారు. భూ వాతావరణ సాంద్రతలో కేవలం 1 శాతం, భూమి గురుత్వాకర్షణ శక్తిలో 40 శాతం ఉండేలా చూసి హెలికాప్టర్ ప్రయోగం చేపట్టారు. 2021 ఫిబ్రవరిలో అంగారక గ్రహంపైన అడుగు పెట్టాక ఈ హెలికాప్టర్ రోవర్ నుంచి విడిపోతుంది.
2019-06-07అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో 5జి రేడియో తరంగాల ఖరీదు 30-40 శాతం ఎక్కువని సెల్యులర్ ఆపరేటర్ల సంఘం (సిఒఎఐ) పేర్కొంది. ఈ ఏడాది 5జి తరంగాల వేలం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. బేస్ ధరపై సిఒఎఐ స్పందించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన 5జి స్ప్రెక్ట్రమ్ పాలసీ వర్క్ షాపు సందర్భంగా సిఒఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ విలేకరులతో మాట్లాడారు. ధరలో రాయితీ ఇవ్వాలని ఆయన సూచించారు.
2019-06-04 Read Moreఅంగారక గ్రహంపైన బంకమన్ను ఉండే ప్రాంతంలో అన్వేషణ జరుపుతున్న ‘క్యూరియాసిటీ’ రోవర్ తాజాగా ఆ గ్రహంపైన మేఘాల కదలికలను తన కెమేరాలలో బంధించింది. ఈ రోవర్ తన బ్లాక్ అండ్ వైట్ నేవిగేషన్ కెమేరాలను ఉపయోగించి మే 7, 12 తేదీల్లో తీసిన చిత్రాల్లో మేఘాలు కనిపించాయి. అరుణ గ్రహ ఉపరితలంనుంచి 31 కిలోమీటర్ల ఎత్తున ఈ మేఘాలు ఉన్నట్టు ‘నాసా’ గుర్తించింది. ఈ రోవర్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ఇన్ సైట్’ ల్యాండర్ గతంలో తీసిన చిత్రాలను వీటితో పోల్చి చూస్తున్నారు.
2019-05-30 Read More‘ఇస్రో’ సరికొత్త మైక్రోవేవ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం బుధవారం వేకువజామున శ్రీహరికోటలో జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 5.30 గంటలకు పి.ఎస్.ఎల్.వి - సి46 రాకెట్ నింగికి ఎగిరింది. పావు గంట తర్వాత ఆర్ఐ శాట్-2బి ఉపగ్రహాన్ని భూమికి 557 ఎత్తున నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాత్రి, పగలు సమాచారాన్ని పంపే ఈ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు సాయం వంటి రంగాలకు తోడు భద్రతా దళాలకు బాగా ఉపయోగపడనుంది.
2019-05-22 Read Moreచైనా టెక్నాలజీ దిగ్గజం ‘హువావే’కు చిప్ ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు అమెరికా కార్పొరేషన్లు ఇంటెల్, క్వాల్ కామ్, గ్జిలింక్స్, బ్రాడ్ కామ్ తమ తమ ఉద్యోగులకు స్పష్టం చేశాయి. చైనా కంపెనీని బ్లాక్ లిస్టులో చేరుస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇప్పటికే గూగుల్ హార్డువేర్, సాఫ్టువేర్ ఉత్పత్తులను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా చిప్ తయారీదారులూ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్పందించడంతో ‘హువావే’ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
2019-05-20 Read Moreచైనా టెలికం దిగ్గజం ‘హువావీ’తో వ్యాపారాన్ని పరిమితం చేసుకుంది ఇంటర్నెట్ సంస్థ ‘గూగుల్’. ఓపెన్ సోర్సు లైసెన్సులో ఉన్నవి మినహా మిగిలిన హార్డువేర్, సాఫ్టువేర్ సేవలను ఆదివారం నిలిపివేసింది. చైనా కంపెనీపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ‘గూగుల్’ స్పందించింది. దీంతో.. ప్రస్తుతం హవావీ ఫోన్లు వాడుతున్నవారికి భవిష్యత్తు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ అందవు. కొత్త హువావీ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్, జి మెయిల్ వంటి పాపులర్ యాప్స్ అందుబాటులో ఉండవు. ఇది చైనాకు వెలుపల ‘హువావీ’కి నష్టం చేసే పరిణామం.
2019-05-19 Read Moreశరవేగంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), క్లౌడ్, డేటా ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ రంగాల్లో నైపుణ్య కొరతను తీర్చడానికి ‘మైక్రోసాఫ్ట్’, జనరల్ అసెంబ్లీ (జిఎ) అనే విద్యా సంస్థ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాయి. 2022 నాటికి 15,000 మందికి నైపుణ్యం పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలి సంవత్సరం 2000 మందికి, తర్వాత మూడేళ్లలో 13,000 మందికి శిక్షణ ఇస్తారు. భవిష్యత్తులో మనుషులు, మెషీన్లు, అల్గారిథమ్స్ మధ్య పని విభజన కారణంగా 13 కోట్ల కొత్త రోల్స్ వస్తాయని అంచనా.
2019-05-21 Read Moreచందమామ (అంతర్భాగం) రానురాను చల్లబడుతోంది. దాంతో కుంచించుకుపోతోంది. ఈ కారణంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. వాటిలో కొన్ని ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5 వరకు నమోదయ్యాయి. అంటే భూమిపై సంభవించిన భారీ భూకంపాల కంటే తక్కువ స్థాయివనే చెప్పవచ్చు. అపోలో వ్యోమగాములు గతంలో చంద్రునిపై వదిలి వచ్చిన సీస్మో మీటర్ల సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. గత కొన్ని కోట్ల సంవత్సరాల్లో చందమామ 150 అడుగుల మేరకు సన్నబడిందట. దాని ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు వచ్చాయి.
2019-05-14 Read Moreఒడిషాపై తుపాను ‘‘ఫని’’ ఏమేరకు ప్రభావం చూపించిందో ఈ ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఫని’ ఈ నెల 3వ తేదీన ఒడిషాలోని పూరి పట్టణం వద్ద తీరం దాటింది. అంతకు ముందు (ఏప్రిల్ 30న), ఆ తర్వాత (మే 4,5 తేదీల్లో) రాత్రి సమయంలో ఉపగ్రహాలు తీసిన చిత్రాలను ‘నాసా’ ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసింది. భువనేశ్వర్, కటక్ నగరాలు తుపానుకు ముందు రాత్రి వెలుగుల్లో కాంతిమంతంగా కనిపిస్తుంటే... తుపాను తీరం దాటాక చాలాచోట్ల చీకట్లు ఆవహించాయి. విద్యుత్ పంపిణీ దెబ్బ తినడం దీనికి ప్రధాన కారణం.
2019-05-09 Read Moreభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది 5 మిలిటరీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. భద్రతా బలగాల నిఘా సామర్ధ్యాన్ని పెంచడానికి ఈ ఉపగ్రహాలు దోహదపడతాయి. ‘ఆర్ఐ శాట్’ కొత్త సిరీస్ లో నాలుగు ఉపగ్రహాలతోపాటు అధునాతన కార్టోశాట్ 3 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించడానికి ‘ఇస్రో’ షెడ్యూలు సిద్ధం చేసుకుంది. మే నెలలో ‘ఆర్ఐ శాట్ 2బి’ని పి.ఎస్.ఎల్.వి-సి46 రాకెట్ ద్వారా, జూన్ మూడో వారంలో కార్టోశాట్ 3ని పి.ఎస్.ఎల్.వి-సి47 రాకెట్ ద్వారా పంపనున్నారు. కార్టోశాట్ 3 ఉపగ్రహానికి భూమిపైన 20 సెంటీమీటర్ల రిజొల్యూషన్ తో ఫొటోలు తీసే సామర్ధ్యం ఉంటుంది.
2019-04-04 Read More