‘నీతి ఆయోగ్ ఇన్నొవేషన్ ఇండెక్స్’లో కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ తరహాలో తొలిసారిగా రూపొందించిన ఇండియా ఇండెక్స్ నివేదికను ‘నీతి ఆయోగ్’ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ గురువారం విడుదల చేశారు. చత్తీస్ గఢ్, బీహార్, జార్ఖండ్ ఆవిష్కరణల్లో చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్... కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, చండీగడ్, గోవా టాప్ 3లో ఉన్నాయి.

2019-10-17 Read More

ప్రపంచవ్యాప్తంగా 5జి నెట్వర్క్ అభివృద్ధికోసం 60 కాంట్రాక్టులను కుదుర్చుకున్నట్టు చైనా టెలికం దిగ్గజం ‘హువావే టెక్నాలజీస్’ మంగళవారం వెల్లడించింది. అమెరికా నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ గ్లోబల్ టెలికాం క్యారియర్స్ చైనా కంపెనీపై చూపుతున్న విశ్వాసానికి ఈ కాంట్రాక్టులే నిదర్శనమని కంపెనీ 5జి ఉత్పత్తుల అధ్యక్షుడు యాంగ్ చావోబిన్ అభిప్రాయపడ్డారు. మొత్తం ఒప్పందాలలో 32 యూరప్ నుండి, 11 మధ్యప్రాచ్యం నుండి, 10 ఆసియా-పసిఫిక్ నుండి, 7 అమెరికా నుండి, 1 ఆఫ్రికా నుండి ఉన్నట్టు చెప్పారు.

2019-10-15 Read More

మొబైల్ ఇంటర్నెట్ డౌన్ లోడ్ వేగం విషయంలో ఇండియా అధ్వాన స్థాయిలో ఉంది. ‘స్పీడ్ టెస్ట్.నెట్’ 145 దేశాల్లో ఇంటర్నెట్ వేగాన్ని పరిశీలిస్తే అందులో ఇండియాది 131వ స్థానం. శ్రీలంక 83వ స్థానంలో ఉండగా మన దాయాది పాకిస్తాన్ 118 స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ మొబైల్ ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడు 13.08 ఎంబిబిఎస్ ఉంటే ఇండియాలో 10.65 ఎంబిబిఎస్ మాత్రమే ఉంది. చివరికి నేపాల్ కూడా 10.78 ఎంబిపిఎస్ స్పీడుతో ఇండియా కంటే ముందుంది. పొరుగు దేశాల్లో ఒక్క బంగ్లాదేశ్ (135) మాత్రమే ఇండియా కంటే వెనుక ఉంది.

2019-10-11 Read More

ప్రపంచంలోని అతిపెద్ద డబుల్ డెక్ సస్పెన్షన్ వంతెన అక్టోబర్ 8న సెంట్రల్ చైనా హుబీ ప్రావిన్స్ వుహాన్‌లో అధికారికంగా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. యాంగ్జీ నదికి అడ్డంగా 4.13 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెనలో 12 లేన్ల రహదారుల రెండు డెక్స్ ఉన్నాయి, ఇది ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.

2019-10-07

‘ఆక్సిజన్ లభ్యతను కణాలు ఎలా గుర్తిస్తాయి... ఎలా గ్రహిస్తాయి?’ అనే అంశంపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2019 నోబెల్ మెడిసిన్ బహుమతి దక్కింది. అమెరికాకు చెందిన విలియం జి. కైలిన్ జూనియర్, గ్రెగ్ ఎల్. సెమెన్జా, బ్రిటన్ శాస్త్రవేత్త పీటర్ జె. రాట్క్లిఫ్ లకు సోమవారం ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు నగదు 9.13 లక్షల డాలర్లను ముగ్గురికీ సమంగా పంచుతారు. కణాల మెటాబాలిజంను ఆక్సిజన్ లభ్యత ఎలా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవడానికి వీరి పరిశోధన దోహదపడుతుంది.

2019-10-07 Read More

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నివసించినా భారత అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ఐఐటి-మద్రాసు గ్రాడ్యుయేషన్ విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. వారి పని, ఆవిష్కరణ, పరిశోధన ఇతర భారతీయులకు ఎలా సహాయపడతాయో ఆలోచించాలని సూచించారు. సోమవారం ఐఐటి-మద్రాస్ క్యాంపస్‌లో జరిగిన 56 వ కాన్వొకేషన్ వేడుకలో మాట్లాడిన ప్రధాని "ఇది మీ సామాజిక బాధ్యత మాత్రమే కాదు, ఇది అపారమైన వ్యాపార భావాన్ని కూడా కలిగిస్తుంది" అని చెప్పారు.

2019-09-30 Read More

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగం సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు విజయవంతంగా పూర్తయింది. భారత జియోసింక్రనస్ శాటెలైట్ లాంచ్ వెహికిల్ (జి.ఎస్.ఎల్.వి) మార్క్ 3-ఎం1 రాకెట్ 3840 కేజీల బరువున్న చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్టును భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ అంతరిక్ష వాహనం ప్రస్తుతం భూమికి ఓవైపు 169.7 కిలోమీటర్ల నుంచి మరోవైపు 45,475 కిలోమీటర్ల వరకు పరిభ్రమిస్తోంది. 48వ రోజున విక్రమ్ ల్యాండర్ చందమామపై అడుగు పెడుతుంది.

2019-07-22 Read More

ప్రయోగానికి 56 నిమిషాల 24 సెకన్ల ముందు చంద్రయాన్-2 కౌంట్ డౌన్ నిలిచిపోయింది. ‘చంద్రయాన్-2’ను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి సోమవారం వేకువజామున 2.51 గంటలకు జి.ఎస్.ఎల్.వి. ఎం.కె.3-ఎం1ను ప్రయోగించాల్సి ఉంది. అయితే, ప్రయోగవాహనంలో సాంకేతిక లోపం కారణంగా ‘చంద్రయాన్-2’ వాయిదా వేస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చివరి గంటలో ప్రకటించింది. తిరిగి ఎప్పుడు ప్రయోగించేదీ తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.

2019-07-15 Read More

ఇండియాకు ప్రత్యేక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే ప్రణాళిక ఉన్నట్టు ‘ఇస్రో’ ఛైర్మన్ శివన్ శుక్రవారం వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు... 2022 ఆగస్టులో చేపట్టున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘‘గగన్ యాన్’’ తర్వాత ఖరారవుతాయని ఆయన చెప్పారు. 20 టన్నుల బరువుతో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్ష కేంద్ర నిర్మాణం ‘‘గగన్ యాన్’’ మిషన్ తర్వాత 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుందని, అక్కడ వ్యోమగాములు 15 నుంచి 20 రోజులు గడపవచ్చని శివన్ వివరించారు.

2019-06-13 Read More

అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ (@SrBachchan) సోమవారం రాత్రి హ్యాకింగ్ కు గురైంది. ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటో మారిపోయి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటో ప్రత్యక్షమైంది. ‘అయ్యిల్దిజ్ టిమ్ టర్కిష్ సైబర్ ఆర్మీ’ పేరిట హ్యాకర్లు ఓ పోస్టు పెట్టారు. టర్కిష్ ఫుట్ బాల్ ఆటగాళ్ల పట్ల ఐస్ ల్యాండ్ రిపబ్లిక్ ప్రవర్తనను వారు ఖండించారు. ముంబై పోలీసులు ఈ హ్యాకింగ్ విషయమై దర్యాప్తు చేపట్టారు.

2019-06-11 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 Last Page