వార్షిక సూర్య‘గ్రహణం’ గురువారం సంభవించనుంది. ఈ అంతరిక్ష విన్యాసాన్ని కేరళ, కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వీక్షించే అవకాశం ఉంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చే ఈ సన్నివేశం డిసెంబర్ 26 ఉదయం 8.04 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయానికి సూర్యుడి అంచును తాకే చంద్రుడు... 9.24 సమయానికి మధ్య భాగానికి వస్తాడు. 9.26కి సూర్యుడిని దాదాపు పూర్తిగా కప్పేస్తాడు. ఆ సమయంలో ఉంగరం ఆకారం కనిపిస్తుంది.
2019-12-25కోర్టులు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ‘కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- ఎ.ఐ)’ను ఉపయోగించే ప్రణాళికేదీ లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బాబ్డే స్పష్టం చేశారు. ఎ.ఐ. వినియోగంపై మాజీ సీజేఐ ఆర్.ఎం. లోథా ఆందోళన వ్యక్తం చేయడంతో... జస్టిస్ బాబ్డే స్పందించారు. ‘‘మేము చూస్తున్న వ్యవస్థ... సెకనుకు పది లక్షల పదాలను చదివేంత వేగవంతమైనది. అయోధ్య కేసులో వేలాది పత్రాలున్నాయి. కృత్రిమ మేధస్సును ఉపయోగించినప్పుడు అవి చదవడం సులభం అవుతుంది’’ అని జస్టిస్ బాబ్డే చెప్పారు.
2019-12-14మూడు నెలల క్రితం చంద్రుడిపై కూలిన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గుర్తించింది. విక్రమ్ కూలిన ప్రదేశాన్ని, చెల్లాచెదరుగా పడిన శిథిలాలను గుర్తిస్తూ ఒక ఫొటోను విడుదల చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సెప్టెంబరులో ప్రయోగించిన చంద్రయాన్2లో భాగంగా ‘విక్రమ్’ చంద్రుడిపై దిగవలసి ఉండగా, చివరి నిమిషాల్లో కూలిపోయింది. నాసా సెప్టెంబరు మాసంలో విడుదల చేసిన చిత్రాన్ని పరీక్షించి భారత కంప్యూటర్ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ ఒక శిథిలాన్ని గుర్తించారు. అదే ఇప్పుడు కీలకమైంది.
2019-12-03దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 1548 కోట్లతో చేపట్టిన కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ (కె.ఎఫ్.ఒ.ఎన్)కు ప్రాజెక్టుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఇంటర్నెట్ సౌకర్యాన్ని పౌరుల ప్రాథమిక హక్కుగా భావిస్తున్న కేరళ ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందులో భాగంగానే 20 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనుంది.
2019-11-07సమాచార దోపిడీ, దుర్వినియోగం ప్రాతిపదికనే బడా టెక్నాలజీ కంపెనీల వ్యాపార నమూనా రూపొందిందని ప్రపంచ ప్రఖ్యాత విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పారు. సోమవారం పోర్చుగల్ లోని లిస్బన్ నగరంలో ప్రారంభమైన ‘వెబ్ సమ్మిట్’లో రష్యానుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్నోడెన్ మాట్లాడారు. డేటా ప్రమాదరహితం కాదని, అది ప్రజల గురించి అయినప్పుడు డేటా కేవలం ఒక సంగ్రహం కాదని పేర్కొన్నారు. అసలు సమస్య సమాచార భద్రత కాదని, సమాచార సేకరణేనని తేల్చి చెప్పారు.
2019-11-05 Read Moreభూమి గుండ్రంగా ఉందా... బల్లపరుపుగానా? ఈ ప్రశ్నకు ఇప్పుడు అందరూ చెప్పే సమాధానం ఒక్కటే. మరి విశ్వం ఎలా ఉంటుంది? ప్లాంక్ స్పేస్ అబ్జర్వేటరీ కొలతలు విశ్వం ఒక ఫ్లాట్ షీట్ లాగా కాక గోళం ఆకారంలో ఉండవచ్చని సూచిస్తున్నాయి. దీంతో.. విశ్వంపై ఇంతకు ముందున్న అవగాహనను మార్చుకోవాలా? అన్న ప్రశ్న ఉదయించింది. బిగ్ బ్యాంగ్ మిగిల్చిన కాంతి సముద్రం వంటి కాస్మిక్ మైక్రోవేవ్ నేపథ్యాన్ని... ప్లాంక్ అబ్జర్వేటరీ 2009 నుంచి 2013 వరకు మ్యాప్ చేసింది.
2019-11-05 Read Moreసౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాల సమాచార సేకరణకోసం 1977లో ‘‘నాసా’’ ప్రయోగించిన ‘‘వోయేజర్ 2’’ ఇప్పుడు అక్కడినుంచి తొలి సమాచారాన్ని పంపింది. 1989లో నెఫ్ట్యూన్ గ్రహాన్ని దాటిన ఈ అంతరిక్ష నౌక ఆ తర్వాత మరో 29 సంవత్సరాలకు (2018లో) సౌర కుటుంబం అంచులను దాటింది. సౌర కుటుంబం అధికారిక సరిహద్దును ‘హెలియోపాస్’గా వ్యవహరిస్తారు. ఈ సరిహద్దు దాటిన రెండో నౌక ‘‘వోయేజర్2’’. 2012లో ‘‘వోయేజర్1’’ సౌర కుటుంబాన్ని దాటి విశ్వాంతరాళాల్లోకి పయనించింది.
2019-11-05 Read More2019లో ప్రపంచ ఐటీ వ్యయంలో పెరుగుదల కేవలం 0.4 శాతమేనని గార్టనర్ సంస్థ అంచనా వేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ప్రపంచ వ్యాప్తంగా చేసే వ్యయం ఈ ఏడాది 3.7 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2018తో పోలిస్తే పెరిగింది కేవలం 0.4%. ఇప్పటి వరకు ఇదే అతి తక్కువ వృద్ధి రేటు. అయితే, 2019 మందగమనం తర్వాత 2020లో వ్యయం 3.7% పెరుగుతుందని గార్టనర్ అంచనా వేసింది.
2019-10-31టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) దేశవ్యాప్తంగా ‘టాప్ టాలెంట్’ను ఆకర్షించడానికి ‘హాట్ ఆఫర్’ ఇస్తోంది. ఈ ఐటి దిగ్గజం గత ఏడాది నేషనల్ క్వాలిఫయర్ పరీక్షను ప్రారంభించింది. ఇప్పుడు ఆ క్వాలిఫయర్ పరీక్షకు హాజరైన టాపర్లకు మరో పరీక్ష పెట్టనుంది. ఆ టెస్టులోనూ నెగ్గితే వారిని ‘‘హాట్ టాలెంట్’’గా పరిగణించి రెట్టింపు శాలరీని ఇవ్వనున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్.ఆర్. గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కడ్ చెప్పారు. ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగులకు కూడా అదే ‘ఆఫర్’ను వర్తింపజేయనున్నట్టు తెలిపారు.
2019-10-22 Read Moreమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 2018-19 సంవత్సరానికి 4.29 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305.5 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ మంచి ఫలితాలను నమోదు చేయడంతో సీఈవో వార్షికాదాయం గత ఏడాది ఏకంగా 66 శాతం పెరిగింది. 52 సంవత్సరాల సత్య వేతనం రూ. 16.37 కోట్లు (2.3 మిలియన్ డాలర్లు) కాగా, మిగిలిన మొత్తం స్టాక్స్ ద్వారా వచ్చినట్టు ‘సిఎన్ఎన్ బిజినెస్’ తెలిపింది. సత్య నాదెళ్ళ స్టాక్ అవార్డు ద్వారా 2.96 కోట్ల డాలర్లు, ఈక్విటీయేతర ప్రోత్సాహకాల కింద 1.07 కోట్ల డాలర్లు సంపాదించారు.
2019-10-17 Read More