‘‘మీ గురించి మీ భార్య కంటే గూగుల్ సెర్చ్ ఇంజనుకు ఎక్కువ తెలుసు’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. శనివారం జస్టిస్ కృష్ణయ్యర్ స్మారకోపన్యాసంలో ఆయన ప్రైవసీపై మాట్లాడుతూ... తాను విశాఖ నక్షత్రంలో వృచ్చిక రాశిలో పుట్టానని గూగుల్ కు తెలుసని పేర్కొన్నారు. మనం ఇంటర్నెట్ వాడే విధానం వల్ల 1. ప్రభుత్వాలు 2. సర్వీసు ప్రొవైడర్లు 3. సమాచారం ఇచ్చేవారు 4. హ్యాకర్లు మొత్తం తెలుసుకుంటున్నారని చెప్పారు.
2020-01-04 Read More2020లో పది కాదు.. ఇరవై కాదు.. 50 అంతరిక్ష ప్రయోగాలకు చైనా సిద్ధమవుతోంది. చైనా అంతరిక్ష పరిశ్రమకు ఇది సూపర్ బిజీ సంవత్సరం. 40కి పైగా లాంచ్ మిషన్లను చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టు చైనాలో అతి పెద్ద స్పేస్ కాంట్రాక్టు సంస్థ ‘చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్ప్’ గురువారం వెల్లడించింది. ‘బీడో’ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను పూర్తి చేయడంతోపాటు వాణిజ్య ఉపగ్రహాలు కూడా ఈ లక్ష్యంలో ఉన్నాయి.
2020-01-02కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడే సమయంలోనూ ఫోన్ చెక్ చేసుకోకుండా 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారట! ‘‘వివో-సిఎంఆర్’’ అధ్యయనంలో అభిప్రాయాలు చెప్పిన ప్రతి ముగ్గురిలో ఒకరి పరిస్థితి ఇదే. స్మార్ట్ ఫోన్ వినియోగం ఇదే స్థాయిలో ఉంటే... మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఈ సర్వేలో 73 శాతం అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ లోనూ, ముఖాముఖీ 2000 మంది సేకరించి గురువారం ఈ అధ్యయన నివేదికను వెల్లడించారు.
2020-01-02చంద్రుడిపై ఓ వాహనాన్ని సాఫీగా దించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ ప్రయోగం వచ్చే ఏడాది (2021)కి వాయిదా పడవచ్చు. 2020లో ప్రయోగం ఉంటుందని నిన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పగా, వచ్చే ఏడాదికి మారవచ్చని బుధవారం ‘ఇస్రో‘ ఛైర్మన్ శివన్ చెప్పారు. చంద్రయాన్-2 ప్రయోగంలో రోవర్ చంద్రునిపై దిగడంలో విఫలమైన నేపథ్యంలో ‘ఇస్రో’ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
2020-01-01‘‘గగన్ యాన్’’ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ శివన్ వెల్లడించారు. వారికి శిక్షణ జనవరి మూడో వారంలో రష్యాలో ప్రారంభమవుతుందని తెలిపారు. 2019లో ఇస్రో ప్రగతిని వివరించేందుకు శివన్ బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇండియా తొలిసారి 2022లో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడుతోంది. కనీసం ఏడు రోజుల పాటు భారత వ్యోమగాములు అంతరిక్షంలో గడపాలన్నది ప్రణాళిక.
2020-01-01గుంపులో ముఖాలను గుర్తించే నిఘా పద్ధతిని ఢిల్లీ పోలీసులు ఈ నెల 22న ప్రధాని మోడీ ర్యాలీలో ఉపయోగించడం కలకలం రేపింది. ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎ.ఎఫ్.ఆర్.ఎస్) సాఫ్ట్ వేర్ ఇప్పటిదాకా పోలీసులు తప్పిపోయిన పిల్లలను కనిపెట్టడానికి వాడేవారు. ఎయిర్ పోర్టులు, కార్యాలయాల్లో వాడటమూ పెరుగుతోంది. ఓ రాజకీయ ర్యాలీలో ఉపయోగించడం మాత్రం తొలిసారి. సిఎఎ వ్యతిరేక ర్యాలీలు దేశమంతా జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల చర్య ఆందోళన కలిగిస్తోంది.
2019-12-31 Read Moreచట్ట విరుద్ధంగా జన్యు సవరణకు పాల్పడిన చైనా పరిశోధకుడు ఒకరికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. హి జియాన్‌కుయి అనే పరిశోధకుడు మానవ పిండాల జన్యు సవరణ ద్వారా పునరుత్పత్తి ప్రక్రియను చేపట్టారు. ఆ ప్రక్రియ ద్వారా ముగ్గురు పిల్లలు ‘జన్యు సవరణ’లతో జన్మించారు. అయితే, ఇదంతా చట్ట విరుద్ధంగా జరిగిందని ఆరోపణలున్నాయి. దీంతో ‘హి’కి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 3 మిలియన్ యువాన్ల (రూ. 3 కోట్ల) జరిమానా విధించారు.
2019-12-30సూర్యగ్రహణం చుట్టూ అల్లుకున్న నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేకం. అందులో ఒకటి గ్రహణం సమయంలో రోకలి నిలబడటం. ఈ మూఢ విశ్వాసాన్ని పటాపంచలు చేయడానికి గ్రహణం రోజునే ఎంచుకున్నారు ప్రజా సైన్స్ కార్యకర్త రమేష్. గురువారం సూర్యగ్రహణం వీడిన తర్వాత ఓ గృహిణి రోకలిని నిలబెట్టిన దృశ్యాన్ని రమేష్ సామాజిక మాథ్యమాల్లో షేర్ చేశారు. ఏ రోజైనా, ఎక్కడైనా గురుత్వాకర్షణ ఆధారంగానే రోకలైనా మరొకటైనా నిలబడుతుందని రమేష్ స్పష్టం చేశారు.
2019-12-26గురువారం సూర్యగ్రహణాన్ని ప్రపంచలోని అనేక ప్రాంతాలనుంచి పెద్ద మొత్తంలో ప్రజలు వీక్షించారు. అదే సమయంలో అంతరిక్షం నుంచి అతి కొద్ది మంది భూమిపై పడిన చంద్రుని ఛాయను వీక్షించారు. గురువారం భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఆ నీడ నీలిగ్రహం అడుగు భాగాన పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్)లో ఉన్న వ్యోమగాములు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు.
2019-12-26దక్షిణ భారత దేశంలో.. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సూర్యగ్రహణాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. చంద్రుడు పూర్తి స్థాయిలో సూర్యుడికి అడ్డు వచ్చిన సన్నివేశం ఈ రాష్ట్రాల్లో ప్రజలకు కనువిందు చేసింది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్ధులు ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించారు. జన విజ్ఞాన వేదిక వంటి ప్రజా సైన్స్ వేదికలు సామూహిక సూర్యదర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి.
2019-12-26