అంతర్జాతీయ మేధో సంపత్తి (ఐపి) ఇండెక్స్ ర్యాంకుల్లో ఇండియా 40వ స్థానానికి దిగజారింది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని గ్లోబల్ ఇన్నొవేషన్ పాలసీ సెంటర్ (జిఐపిసి) 2020 నివేదిక తాజాగా వెల్లడైంది. 53 ఆర్థిక వ్యవస్థలను విశ్లేషించగా ఇండియా 38.46 స్కోరుతో 40వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 50 దేశాలను విశ్లేషించగా ఇండియా 36వ స్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా అమెరికా, యుకె, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. చైనా 50.96 స్కోరుతో 28వ స్థానంలో నిలిచింది.

2020-02-05

ఇండియాలో 5జి ఫోన్ ఈ ఫిబ్రవరిలోనే మార్కెట్ లోకి రానుంది. అయితే, అది చైనా కంపెనీ ‘ఐకూ’ ద్వారా కావడం విశేషం. 2020లో 10 లక్షల 5జి స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విక్రయించాలన్న లక్ష్యాన్ని ‘ఐకూ’ నిర్దేశించుకుంది. ఆన్ లైన్లో విక్రయించే ఈ 5జి ఫోన్ ధర ఎంతో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అత్యాధునిక ఫీచర్లతో 5జి, 4జి రకాలను ‘ఐకూ’ విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత ప్రభుత్వం ఏప్రిల్-జూన్ కాలంలో 5జి స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించనుంది.

2020-01-24

సమాచార మార్పిడిలో గోప్యతను పెంచడానికి భారత ప్రభుత్వం సెల్ ఫోన్ల కోసం సొంత మెసేజింగ్ వ్యవస్థను తయారు చేస్తోంది. గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ (జి.ఐ.ఎం.ఎస్- జిమ్స్) పేరిట రూపొందుతున్న వ్యవస్థపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలకు తోడు కోరుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ‘జిమ్స్’ను ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.

2020-01-24

సమాచార గోప్యతను మానవ హక్కుగా పరిగణించాలని, దాన్ని పరిరక్షించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2020 వార్షిక సమావేశంలో గురువారం సత్య మాట్లాడారు. సమ్మతితో వినియోగిస్తున్న భారీ సమాచారం సమాజహితానికే దోహదపడాలని ఆయన సూచించారు. సీఈవోల వేతనాలు, ఇతరుల వేతనాల మధ్య అంతరాలు.. పెట్టుబడిపై రాబడి వంటి ఇతర అంశాలపై చర్చను నాదెళ్ళ స్వాగతించారు.

2020-01-23

ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ‘500 కోట్ల క్లబ్’లో చేరింది. గూగుల్ ‘ప్లే స్టోర్’ నుంచి మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ను డౌన్ లోడ్ చేసుకున్న ఫోన్ల సంఖ్య 500 కోట్లకు చేరింది. ఇదివరకే కొన్ని గూగుల్ అప్లికేషన్లతో పాటు ‘ఫేస్ బుక్’, ‘యూ ట్యూబ్’ వంటి అప్లికేషన్లు 500 కోట్ల వినియోగదారులను సాధించాయి. ప్రస్తుత ప్రపంచ జనాభా 750 కోట్లు. కొంతమంది రెండు లేదా మూడు ఫోన్లను వాడతారు. అలా చూసినా సుమారు సగం జనాభా ఈ ‘యాప్’లను వినియోగిస్తుండవచ్చు.

2020-01-19

భారతీయ టెలికమ్యూనికేషన్స్ ఉపగ్రహం జిశాట్-30 విజయవంతంగా నింగికి ఎగసింది. ఫ్రెంచ్ గుయానాలో లోని కౌరు ప్రయోగ వేదిక నుంచి ఏరియానె-5 రాకెట్ శుక్రవారం ఉదయం జిశాట్-30ని మోసుకెళ్లింది. 38 నిమిషాల తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 3,357 కేజీల జిశాట్-30 ఉపగ్రహం కాలం తీరిన ఇన్సాట్-4ఎకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. కు-బ్యాండ్‌లో భారతీయ భూభాగాలను, సి-బ్యాండ్‌లో గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, ఇతర ఆసియా దేశాలను ఈ ఉపగ్రహం కవర్ చేస్తుంది.

2020-01-17 Read More

ఆలోచనా స్వేచ్ఛ ఉన్నప్పుడే సైన్స్ వర్ధిల్లుతుందని నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం నుంచి అతి తక్కువ జోక్యం ఉన్నప్పుడే అది సంపద్వంతమవుతుంది’ అని ఉద్ఘాటించారు. బెంగళూరులో బుధవారం ‘‘సైన్స్-సమాజం’’ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ఆలోచన, అభిప్రాయాల వ్యక్తీకరణకు నిజమైన స్వేచ్ఛ, అతి తక్కువ సైద్ధాంతిక జోక్యం ఉన్నచోటనే సైన్స్ వర్ధిల్లుతుందన్నది నా నమ్మకం’’ అని వెంకట్రామన్ చెప్పారు.

2020-01-16

మైక్రోసాఫ్ట్ విండోస్-7 ఆపరేటింగ్ వ్యవస్థ జీవిత కాలం ఈ రోజుతో ముగిసింది. ‘జనవరి 14 తర్వాత విండోస్-7కు సంబంధించిన సమస్యలు, సాఫ్ట్ వేర్ నవీకరణ, సెక్యూరిటీ అప్ డేట్స్ వంటి ఏ విషయంలోనూ సాంకేతిక మద్ధతును మైక్రోసాఫ్ట్ ఇవ్వబోదు’’ అని కంపెనీ ప్రకటించింది. విండోస్-7లో కొత్త ఫీచర్లను జోడించడం 2015లోనే ఆపేశారు. విండోస్-10 వ్యవస్థను 100 కోట్ల కంప్యూటర్లలో చూడాలన్న లక్ష్యానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.

2020-01-14

మన గెలాక్సీ ‘పాలపుంత’లో 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని ఓ అంచనా. అంతకు 10 రెట్లు నక్షత్రాలు ఓ గెలాక్సీలో ఉంటే దాన్నేమనవచ్చు? అలాంటి ఓ మహా గెలాక్సీ (యుజిసి 2885)ని హబుల్ టెలిస్కోప్ సర్వే చేసింది. పాలపుంతకు రెండున్నర రెట్లు విస్తీర్ణంగల ఈ గెలాక్సీని ‘గాడ్జిల్లా గెలాక్సీ’గా పిలుచుకోవచ్చని నాసా చెబుతోంది. మన ‘ప్రాంతీయ విశ్వం’లో ఇదే అతి పెద్ద గెలాక్సీ. మనకు 23 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికి ‘‘రూబిన్స్ గెలాక్సీ’’ అని ముద్దు పేరు.

2020-01-06 Read More

మన పాలపుంత మధ్య భాగాన్ని మునుపెన్నడూ చూడనంత స్పష్టంగా నాసా ఓ పరారుణ చిత్రంలో బంధించింది. 600 కాంతి సంవత్సరాల విస్తీర్ణం ఈ చిత్రంలో కనిపిస్తోంది. గ్యాస్, ధూళితో కూడిన దట్టమైన వృత్తాలను ఈ అధిక రిజొల్యూషన్ పనోరమా స్పష్టంగా చూపిస్తోంది. భారీ నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి? గెలాక్సీ మధ్యలో ఉన్న మహా కృష్ణ బిలానికి ఆహారం ఏమిటి? అనే అంశాలపై భవిష్యత్ పరిశోధనలకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.

2020-01-06 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 Last Page