హిరోషిమా నగరాన్ని నాశనం చేసిన అణుబాంబుకు 11 రెట్లు శక్తివంతమైన పేలుడుతో డిసెంబర్ మాసంలో భూమిపైన ఓ ఉల్కాపాతం సంభవించింది. విచిత్రమేమిటంటే అప్పట్లో ఎవరూ గమనించలేదు. జపాన్ వాతావరణ ఉపగ్రహం ‘హిమవారి 8’ వీడియోలో బంధించిన ఈ అరుదైన దృశ్యాన్ని శాస్త్రవేత్తలు కొద్ది రోజుల క్రితమే గమనించారు. భారీ ఉల్క 173 కిలోటన్నుల టి.ఎన్.టి. శక్తితో భూ వాతావరణంలో మండిపోయినట్టు అంచనా వేశారు. ఆధునిక కాలంలో ఇది మూడో భారీ ఉల్కాపాతం. రష్యాకు సమీపంలో బేరింగ్ సముద్రంపైన పేలుడు సంభవించడంతో ఎవరికీ ప్రత్యక్ష్యంగా వీక్షించే అవకాశం లేకపోయింది.
2019-03-20చైనాలోని చోంగ్ కింగ్ నగరంలో ‘స్కై బ్రిడ్జి’ నిర్మాణం తుది దశకు చేరుకుంది. 11.2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం ఉండే ఈ మెగా నిర్మాణంలో 8 ఆకాశ హర్మ్యాలను ఓ స్కై బ్రిడ్జి కలుపుతుంది. ఈ స్కై బ్రిడ్జి పొడవు 300 మీటర్లు.. వెడల్పు 32.5 మీటర్లు.. ఎత్తు 26.5 మీటర్లు. దానికి దిగువన ఉండే ఆకాశ హర్మ్యాలలో రెండు 350 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మిగిలినవాటి ఎత్తు 250 మీటర్లు. 9.2 హెక్టార్ల స్థలంలో తలపెట్టిన వీటి నిర్మాణానికి ఆరు సంవత్సరాలు పట్టింది. అధునాతన టెక్నాలజీని వినియోగించారు.
2019-02-27