మార్చి 27వ తేదీన ఇండియా ‘‘ఉపగ్రహ విధ్వంస ప్రయోగం’’ సఫలం కావడానికి నెలన్నర ముందు తొలి ప్రయోగంలో విఫలమైనట్టు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఎఎస్) నిపుణుడొకరు వెల్లడించారు. ఫిబ్రవరి 12న ప్రయోగించిన యాంటీ శాటిలైట్ క్షిపణి 30 సెకన్లు మాత్రమే ప్రయాణించి లక్ష్యాన్ని కనుగొనలేకపోయిందని పేర్కొన్నారు. అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ డిప్లమాట్ పత్రికలో కాలమిస్టు అంకిత్ పాండా ఈ విషయాన్ని రాశారు.
2019-04-02 Read Moreఇండియా ఇటీవల నిర్వహించిన ‘ఉపగ్రహ ధ్వంసం ప్రయోగం’తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు పొంచి ఉందన్న ‘నాసా’ చీఫ్ వ్యాఖ్యలను డి.ఆర్.డి.ఒ. మాజీ చీఫ్ వికె సారస్వత్ కొట్టిపారేశారు. ఇండియా సాధించిన పురోగతి విషయంలో అమెరికా వైఖరి ఇలాగే ఉంటుందని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. 300 కిలోమీటర్ల ఎత్తునున్న ఉపగ్రహాన్ని క్షిపణి ధ్వంసం చేసిన తర్వాత శకలాలు భూవాతావరణంలోకి పడిపోయి మండిపోతాయని సారస్వత్ చెప్పారు. అంతరిక్షంలో లక్షలకొద్దీ శకలాలు తిరుగుతుండగా ఇండియా ప్రయోగంపై మాట్లాడటం అర్ధరహితమన్నారు.
2019-04-02 Read Moreఉపగ్రహాలను కూల్చే సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తూ ఇటీవల ఇండియా చేసిన ప్రయోగాన్ని ‘భయానక పరిణామం’గా వర్ణించింది అమెరికా ‘నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (నాసా). ఈ ప్రయోగం 400 అంతరిక్ష శకలాలను సృష్టించిందని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. భూమికి 300 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఒక పాత ఉపగ్రహాన్ని ఇండియా ప్రయోగాత్మకంగా కూల్చివేసింది. ఐఎస్ఎస్ తిరిగే కక్ష్యకంటే ఇది చాలా తక్కువ ఎత్తే! అయితే, 24 శకలాలు ఐఎస్ఎస్ కంటే ఎత్తుకు ఎగసిపడినట్టు ‘నాసా’ చెబుతోంది.
2019-04-02 Read Moreభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి-సి45 రాకెట్ మోసుకెళ్లిన 29 ఉపగ్రహాల్లో 24 అమెరికాకు చెందినవే... మిగిలినవాటిలో భారత మిలిటరీ శాటిలైట్ ‘ఎమిశాట్’, లిథుయేనియా ఉపగ్రహాలు రెండు, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన చెరొక ఉపగ్రహం ఉన్నాయి. భారత ఉపగ్రహం బరువు 436 కేజీలు కాగా, మిగిలిన అన్నిటి బరువు కలిపి 220 కేజీలు. ఈ ఏడాది పి.ఎస్.ఎల్.వి. సిరీస్ ను ప్రయోగించడం ఇది రెండోసారి. కాగా, పి.ఎస్.ఎల్.వి-క్యుఎల్ వేరియంట్ ప్రయోగం ఇదే తొలిసారి. అత్యధిక సమయం (మూడు గంటలు) భూ కక్షలో ఉన్నది కూడా ఇప్పుడే.
2019-04-01మిలిటరీ నిఘా ఉపగ్రహం ‘ఎమిశాట్’ను పి.ఎస్.ఎల్.వి- సి45 రాకెట్ సోమవారం ఉదయం భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దాంతోపాటు 28 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. ఇది 47వ పి.ఎస్.ఎల్.వి. ప్రయోగం. డి.ఆర్.డి.ఒ. రూపొందించిన ‘ఎమిశాట్’ వంటి ఉపగ్రహాన్ని ఇండియా ప్రయోగించడం ఇదే మొదటిసారి. శ్రీహరికోట నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగికి ఎగసిన రాకెట్... 17 నిమిషాల తర్వాత ఎమిశాట్ ఉపగ్రహాన్ని భూమికి 753.68 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
2019-04-01యాంటీ శాటిలైట్ మిసైల్ టెక్నాలజీ (ASAT) అభివృద్ధికోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ) గత దశాబ్ద కాలంగా కృషి చేస్తోంది. మొదటిగా ఈ విషయాన్ని 2010 జనవరిలో తిరువనంతపురంలో జరిగిన 97వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో అప్పటి డి.ఆర్.డి.ఒ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేసే ఆయుధాన్ని తయారు చేస్తున్నామని ఆయన అప్పుడే చెప్పారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 10న అప్పటి డి.ఆర్.డి.ఒ డైరెక్టర్ జనరల్, భారత రక్షణ శాఖ సలహాదారు వి.కె. సారస్వత్ ‘‘యాంటీ శాటిలైట్ వెపన్’’కు అవసరమైన అన్ని హంగులూ ఇండియా వద్ద ఉన్నాయని ప్రకటించారు.
2019-03-27అంతరిక్ష పరిజ్ఞానంపై అగ్రదేశాలతో పోటీ పడుతున్న ఇండియా తాజాగా మరో అసాధారణ పాఠవాన్ని సొంతం చేసుకుంది. భూమికి 300 కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా కూల్చివేశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్ పేరు ‘‘మిషన్ శక్తి’’. ఇప్పటివరకు ఉపగ్రహాలను కూల్చివేసే మిసైల్ సామర్ధ్యం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. భారత రక్షణ సంస్థ డి.ఆర్.డి.ఒ. గత కొద్ది సంవత్సరాలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు చేస్తోంది.
2019-03-27 Read Moreనాసా ఎక్స్పెడిషన్ 59 ఫ్లైట్ ఇంజనీర్లు నిక్ హేగ్, అన్నే మెక్ క్లెయిన్ శుక్రవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపల స్పేస్ వాక్ చేశారు. సౌర ఫలకాలపై ఉన్న పాత నికెల్ హైడ్రోజన్ బ్యాటరీల స్థానంలో సరికొత్త లిథియం అయాన్ బ్యాటరీలను విజయవంతంగా అమర్చారు. ఇందుకోసం అంతరిక్ష కేంద్రం వెలుపలి భాగంలో 6 గంటల 39 నిమిషాల పాటు ఉన్నారు. అంతరిక్ష కేంద్రం వెలుపల ఉన్న శిథిలాలను తొలగించడం వంటి పలు ఇతర పనులు కూడా చేసిన అనంతరం వారిద్దరూ తిరిగి అంతరిక్ష కేంద్రంలోకి చేరారు.
2019-03-23 Read Moreసూర్యుని ఒకసారి చుట్టడానికి భూమికి పట్టే కాలం 365 రోజులు. ఈ ఏడాది కాలంలో రెండే రోజులు పగలు, రాత్రి కచ్చితంగా సమాన సమయం (12 గంటల చొప్పున) ఉంటాయి. ఆ రెండు రోజుల్లో బుధవారం (మార్చి 20) ఒకటి. సూర్యుడు నేరుగా భూమధ్య రేఖపైన ప్రకాశించే రోజు ఇది. భూమి ఉత్తర, దక్షిణ భాగాలు రెంటిలోనూ పగటి వెలుతురు సమంగా పడేది కూడా ఈ రోజే. 2019లో చివరి సంపూర్ణ చంద్రుడు దర్శనమిచ్చేది కూడా ఈ రోజే కావడం విశేషం. సాధారణంగా ‘‘సమరాత్రి’’కి కొద్ది రోజులు ముందో.. తర్వాతో పూర్తి చంద్రుడు దర్శనమిస్తాడు. ఈసారి మాత్రం ‘‘సమరాత్రి’’కి నాలుగు గంటల వ్యవధిలో పూర్తి చంద్రుడు ఉదయిస్తున్నాడు.
2019-03-20 Read Moreదేశాన్ని నడిపే కీలక రాజకీయ నిర్ణయాలను మనుషులతో కూడిన ప్రభుత్వం తీసుకోవడం కంటే ‘కృత్రిమ మేథ’కు వదిలేయడం మంచిదని సుమారు నాలుగో వంతు యూరోపియన్లు అభిప్రాయపడుతున్నారట! ఆశ్చర్యకరమైన ఈ అభిప్రాయం ‘సెంటర్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ఛేంజ్’ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. నెదర్లాండ్స్, యుకె, జర్మనీలలో అయితే ఏకంగా ప్రతి ముగ్గురిలో ఒకరు ఇదే అభిప్రాయంతో ఉన్నారని సదరు సంస్థ తెలిపింది. వయసు, లింగ భేదాలు, రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలూ ఒకే తరహాలో ఆలోచిస్తున్నారని పేర్కొంది.
2019-03-20 Read More