తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని, నిర్మాణాలకు మాత్రమే అనుమతులు తీసుకోవాల్సి వుంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా అదే స్వరాన్ని వినిపించడంతో అభ్యంతరాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సచివాలయ భవనాల కూల్చివేతకు మార్గం సుగమమైంది.

2020-07-17

8 మంది పోలీసులను ఊచకోత కోసిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం ఉదయం కాన్పూర్ వద్ద కాల్చి చంపారు. మధ్యప్రదేశ్ నుంచి తరలిస్తున్న సమయంలో రోడ్డుకు అడ్డంగా పశువులు రావడంతో తమ వాహనం అదుపు తప్పి ప్రక్కకు పడిపోయిందని, తప్పించుకోవడానికి దూబే ఓ తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు ఓ ‘కథ’నాన్ని వినిపించారు. సరిగ్గా వారం రోజుల క్రితం కాన్పూర్ నగరంలో పోలీసులను చంపిన వికాస్ గ్యాంగ్, నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ దేవాలయం వద్ద అరెస్టయిన సంగతి తెలిసిందే.

2020-07-10

యూపీలోని కాన్పూర్లో గత వారం ఓ డిఎస్పీ సహా 8 మంది పోలీసులను ఊచకోత కోసిన కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే మధ్యప్రదేశ్ లో అరెస్టయ్యాడు. దూబేను, అతని సహచరులు ఇద్దరిని ఉజ్జయిని మహాకాల్ దేవాలయం వద్ద మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. దూబే సహచరుడు ఒకడిని యూపీలో ‘ఎన్కౌంటర్’ చేసిన నేపథ్యంలో ఈ అరెస్టులపై వివాదం చెలరేగింది. దూబేను ‘ఎన్కౌంటర్’ నుంచి కాపాడటానికే అరెస్టు చూపించారన్నది ప్రధాన ఆరోపణ. 60 క్రిమినల్ కేసులు ఉన్న క్రూరమైన నేరస్తుడు దూబేపై రూ. 5 లక్షల రివార్డు ఉండగా, ‘ఎన్కౌంటర్’ అయిన అతని సహచరుడిపై రూ. 25,000 ఉంది.

2020-07-09

జివికె గ్రూపు కంపెనీల ఛైర్మన్ గునుపాటి వెంకటకృష్ణా రెడ్డి, ఆయన కుమారుడు జివి సంజయ్ రెడ్డి లపై సిబిఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం జాయింట్ వెంచర్ నుంచి రూ. 705 కోట్లు మళ్ళించారన్నది ఆరోపణ. ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ముంబై విమానాశ్రయం ఆధునీకరణ, నిర్వహణ కోసం జివికె ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ తో కలసి జాయింట్ వెంచర్ (ఎంఐఎఎల్)ను ఏర్పాటు చేసింది. సంజయ్ రెడ్డి ఈ సంస్థకు ఎండి. 9 కంపెనీలకు బోగస్ కాంట్రాక్టులతో 2017-18లో 310 కోట్లు స్వాహా చేశారని, ఎంఐఎఎల్ రిజర్వు నిధులు రూ. 395 కోట్లను తమ గ్రూపు కంపెనీలకు మళ్ళించారని సిబిఐ గుర్తించింది.

2020-07-02

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకోసం ఇరాన్ ప్రభుత్వం వారంట్ జారీ చేసింది. ట్రంప్ ను బంధించడానికి ఇంటర్ పోల్ సాయం కోరింది. ఈ ఏడాది జనవరి 3న ఇరాన్ సైనిక జనరల్ ఖాసిం సులేమానీని డ్రోన్ దాడితో అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ట్రంప్, మరో 30 మందిపై ‘హత్య, ఉగ్రవాదం’ అభియోగాలు మోపింది ఇరాన్. ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసినా ప్రాసిక్యూషన్ ప్రయత్నాలు కొనసాగుతాయని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్ ఖసిమెహర్ సోమవారం చెప్పారు. ఈ చర్యను ‘ప్రచార విన్యాసం’గా కొట్టిపారేశారు ఇరాన్ లోని అమెరికా రాయబారి బ్రియాన్ హుక్.

2020-06-29

జమ్మూ- కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ఇద్దరూ లష్కర్ ఇ తాయిబా ఉగ్రవాదులని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. మసూద్ మరణంతో దోడా జిల్లా ఉగ్రవాద రహిత ప్రాంతంగా మారినట్టేనని పోలీసు అధికారులు ప్రకటించారు. ఎన్కౌంటర్ స్థలంలో ఒక ఎ.కె-47 రైఫిల్, రెండు పిస్టళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ అధికారులు చెప్పారు.

2020-06-29

పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పు పట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంగా ఉన్న భవనాలను కూల్చివేయాలని తెలంగాణ సిఎం కేసీఆర్ తొలినుంచీ పట్టుదలతో ఉన్నారు. గత ఆరేళ్ళుగా ఆయన సచివాలయానికి హాజరు కావడంలేదు. అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు.

2020-06-29

తమిళనాడులోని ట్యుటికోరిన్ పట్టణంలో పోలీసు కస్టడీలో మరణించిన తండ్రీ కొడుకుల కేసును సిబిఐకి అప్పగించనున్నట్లు సిఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. ‘లాక్ డౌన్’లో ఎక్కువ సమయం షాపును తెరిచి ఉంచారనే కారణంతో జె. జయరాజ్ (59), ఆయన కుమారుడు బెనిక్స్ (31)లను కస్టడీలోకి తీసుకొని హింసించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై తమిళనాట తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ను పోలీసులు చంపిన తీరుతో ఈ ఘటను పోలిక వచ్చింది. హైకోర్టు అనుమతి తీసుకొని ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని సిఎం చెప్పారు.

2020-06-28

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా తుపాకితో కాల్పులు జరుపుతూ కెమేరాలకు చిక్కిన షారుఖ్ పఠాన్ బెయిలు దరఖాస్తును హైకోర్టు తోసిపుచ్చింది. బెయిలు దరఖాస్తును ఉపసంహరించుకునేందుకు మాత్రం ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సురేష్ కుమార్ కేత్ అవకాశం ఇచ్చారు. ఆ దరఖాస్తులోని సామంజసత్వంపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. నిందితుడికి నేర చరిత్ర లేదని, తన కాల్పుల కారణంగా ఎవరూ గాయపడినట్టు ఆధారం లేదని పఠాన్ తరఫు న్యాయవాది అస్ఘర్ ఖాన్ విన్నవించారు. అల్లర్ల కేసులో నిందితురాలైన విద్యార్ధిని సఫూరా జర్గర్ (గర్భిణి) నిన్న బెయిలు పొందిన విషయాన్ని గుర్తు చేశారు.

2020-06-24

గర్భంతో ఉన్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్ధిని సఫూరా జర్గర్ కు ఎట్టకేలకు బెయిలు మంజూరైంది. ‘మానవతా ప్రాతిపదిక’న బెయిలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్న ఢిల్లీ హైకోర్టు, అనుమతి లేకుండా ఢిల్లీ దాటి వెళ్ళవద్దని ఆమెను ఆదేశించింది. 15 రోజులకు ఒక్కసారైనా కేసు దర్యాప్తు అధికారికి ఫోన్ చేయాలని నిర్దేశించింది. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో ఆందోళన చేపట్టినప్పుడు జరిగిన హింసకు సంబంధించి.. సఫూరాపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం యుఎపిఎ కింద కేసు నమోదు చేశారు. ఎంఫిల్ విద్యార్ధిని అయిన సఫూరా 23 వారాల గర్భవతి.

2020-06-23
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page