సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణపై ఆరోపణలతో సీజేకు చేసిన ఫిర్యాదు వివరాలను వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన విలేకరుల సమావేశానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగం నిర్దేశించిన ‘‘హద్దులను జగన్మోహన్ రెడ్డి దాటార’’ని పిటిషనర్ పేర్కొన్నారు. అడ్వకేట్ సునీల్ కుమార్ తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్ ముక్తి సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. జడ్జిలకు వ్యతిరేకంగా విలేకరుల సమావేశాలు నిర్వహించడాన్ని నిరోధించాలని, సిఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.

2020-10-12

ఆహారం కోసం జంతువులను వధించడానికి ‘హలాల్’ పద్ధతిని అనుసరించడంపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘‘జంతువధలో ‘హలాల్’ అన్నది ఓ పద్ధతి మాత్రమే. కొంతమంది ‘ఝత్కా’ పద్ధతిలో చేస్తారు. అది ఎలా సమస్య?’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. కౌల్ ప్రశ్నించారు. ‘‘రేపు మీరు ఎవరూ మాంసం తినకూడదని చెబుతారు. ఎవరు శాఖాహారులుగా ఉండాలో, ఎవరు మాంసాహారులుగా ఉండాలో మేము నిర్ణయించలేము’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

2020-10-12

న్యాయమూర్తులపై అధికార వైసీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉదంతంలో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర సిఐడి చేసిన దర్యాప్తుపై ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ... కేసును డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను కోర్టు సీరియస్ గా తీసుకుంది.

2020-10-12

సామూహిక మానభంగానికి, వర్ణించనలవిగాని చిత్రహింసలకు బలైన ఉత్తరప్రదేశ్ దళిత యువతి కేసులో పోలీసుల నుంచి ఊహించిన ‘కథ’నమే వెలువడింది. ఆమె మర్మాంగాలపై గాయాలున్నాయి గాని, అత్యాచారం జరిగినట్టు వీర్యం నమూనాలు దొరకలేదని ఫోరెన్సిక్ నివేదికను ఉటంకిస్తూ ఓ పోలీసు అధికారి చెప్పారు. బాధితురాలి మృతదేహాన్ని తల్లితండ్రులకు అప్పగించకుండా పోలీసులే స్వయంగా అర్ధరాత్రి దహనం చేసినప్పుడే ఇలాంటి ‘కథ’నాన్ని అంతా ఊహించారు. ఆమె నాలుకను కూడా నేరస్తులు కోయలేదని, గొంతుకు చున్నీ బిగించినప్పుడు ఆమే కొరుక్కున్నదని పోలీసుల వాదన.

2020-10-01

అత్యాచార బాధితురాలి ఆనవాళ్లు తెలియకుండా అర్ధరాత్రి కాల్చేసి ఘనత వహించిన యూపీ పోలీసులు తమ ఆటవిక ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు. గురువారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అడ్డుకొని చేయి చేసుకొని కింద పడతోశారు. అత్యాచారం జరిగిన హథ్రాస్ జిల్లాకు వెళ్తుండగా యమునా ఎక్స్ ప్రెస్ వే పైన ఈ వికృతం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు.

2020-10-01

కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన సత్వర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, చివరికి ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఆ రూపాయిని చెల్లించడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ రూపాయిని చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష, మూడేళ్ల పాటు లా ప్రాక్టీసుపై నిషేధం అమలవుతాయని తీర్పు చెప్పింది. ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా ఉన్నాయంటూ స్యూమోటో కేసుతో దోషిగా నిర్ధారించింది సుప్రీంకోర్టు. క్షమాపణ చెప్పడానికి భూషణ్ ససేమిరా అనడంతో, సోమవారం ‘రూపాయి’ తీర్పు ఇచ్చింది.

2020-08-31

జడ్జిల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్ పైన హైకోర్టు స్పందించింది. ఈ అంశంపై ఆగస్టు 19 లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్టు... సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ ను కూడా కోర్టు ఆదేశించింది. జడ్జిలపై నిఘాకు ఓ పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమించారని కూడా పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే, ఇదంతా ఓ పత్రికలో వచ్చిన కథనమేనని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీనికి న్యాయమూర్తులు ‘దర్యాప్తు జరిపితే నిజం తేలుతుంది కదా’ అని ప్రశ్నించారు.

2020-08-18

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్.ఇ.సి)గా పునర్నియమించాలన్న ఏపీ హైకోర్టు తీర్పును అమలు చేయడానికి గవర్నర్ జోక్యం చేసుకోవలసి రావడం అవాంఛనీయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ధిక్కార చర్యలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చింది. ‘‘హైకోర్టు తీర్పు తర్వాత రమేష్ కుమార్ ను ఎస్.ఇ.సి.గా నియమించడానికి గవర్నర్ జోక్యం చేసుకోవలసి వచ్చింది.! అక్కడ (ప్రభుత్వానికి వ్యతిరేకంగా) కోర్టు ధిక్కార చర్యలు ఉన్నాయి. ఏమిటిది?’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వం తరపు న్యాయవాదులను ప్రశ్నించారు.

2020-07-24

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన ‘కోర్టు ధిక్కార’ నేరాన్ని మోపింది సుప్రీంకోర్టు. ఆయన ట్విట్టర్లో పోస్టు చేసిన విమర్శలు సుప్రీంకోర్టు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నది అభియోగం. ట్విట్టర్ పైనా కోర్టు ధిక్కార అభియోగాలను మోపారు. ఈ వ్యవహారంపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం వాదనలు విననుంది. గత ఆరేళ్లలో ఇండియాలో జరిగిన ప్రజాస్వామ్య హననాన్ని భవిష్యత్తులో చరిత్రకారులు పరిశీలించేప్పుడు.. ఆ విధ్వసంలో సుప్రీంకోర్టు పాత్రను, మరీ ముఖ్యంగా గత నలుగురు ప్రధాన న్యాయమూర్తుల పాత్రను గుర్తిస్తారని గత నెలలో ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.

2020-07-21

భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పిన అబ్దుల్ షమీ అనే హైదరాబాదీని పోలీసులు అరెస్టు చేశారు. 36 ఏళ్ళ ఈ ల్యాబ్ టెక్నీషియన్ 24 సంవత్సరాల భార్యను కట్నం కోసం వేధించినట్లు పోలీసులు తెలిపారు. 2017లో వివాహం అనంతరం వీరికి 2018లో ఓ బాబు పుట్టాడు. ప్రసవం తర్వాత తాను పుట్టింట్లో ఉన్న సమయంలో భర్త తన బంగారు నగలను అమ్మేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దేశమంతా ‘లాక్ డౌన్’ మొదలైన మార్చి 25నే షమీ తన భార్యకు ‘తలాఖ్’ ఇచ్చేసి ఇంటినుంచి పంపించాడు. జూన్ 26న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా గురువారం అరెస్టు చేశారు. ఈ ఉదంతం ఆదివారం వెలుగులోకి వచ్చింది.

2020-07-20
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page