‘లవ్ జిహాద్’ పేరిట మత మార్పిడులపై ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చేసిన చట్టాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ చట్టాల రాజ్యాంగబద్ధతను ఢిల్లీ అడ్వకేట్లు విశాల్ థాకరే, అభయ్ సింగ్ యాదవ్, ప్రణ్వేష్ సవాలు చేశారు. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికే భంగకరంగా ఉన్నందున ఆ చట్టాలు చెల్లుబాటు కావని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులలో మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాల హక్కులు కూడా భాగమని వారు ఉద్ఘాటించారు.
2020-12-03క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులను జీవిత కాలం పాటు నిషేధించాలన్న విన్నపాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈమేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. బిజెపికే చెందిన అడ్వకేట్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ 2017లో దాఖలు చేసిన పిటిషన్ కు స్పందనగా కేంద్ర ప్రభుత్వం తాజా అఫిడవిట్ సమర్పించింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలలో పని చేసే ఎవరికైనా క్రిమినల్ కేసుల్లో శిక్ష పడితే వారిని జీవిత కాలానికి నిషేధించాలని అశ్వినీకుమార్ తన విన్నపంలో కోరారు.
2020-12-03దేశంలోని ప్రతి పోలీసు స్టేషన్లోనూ సీసీ టీవీ కేమెరాలు ఏర్పాటు చేయాలని, వాటికి రాత్రి పూట కూడా ఆడియోతో సహా రికార్డు చేసే సామర్థ్యం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటిని ఏర్పాటు చేయవలసిందిగా బుధువారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. సీబీఐ, ఎన్ఐఎ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సహా అన్ని కేంద్ర ఏజెన్సీల కార్యాలయాల్లో కూడా సీసీ కేమెరాలు, రికార్డింగ్ సామాగ్రిని ఏర్పాటు చేయాలని జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.
2020-12-02ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారంటూ జడ్జిలను దూషించిన వైసీపీ అనుయాయులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 16 మంది పేర్లను నిర్ధిష్టంగా పేర్కొంటూ మరో ‘గుర్తు తెలియని వ్యక్తి’ని చేర్చింది. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. 2020 ఏప్రిల్ 1 నుంచి జూలై 15 వరకు సామాజిక మాధ్యమాల్లో చేసిన దూషణలను పరిగణనలోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, శత్రుత్వాన్ని పెంచడం, విద్వేషం, నేరపూరిత బెదిరింపు, అశ్లీల పోస్టులను నేరాలుగా పేర్కొన్నారు.
2020-11-16నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం పార్లమెంటు పరిధిలోనిదని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగి లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చార్జిషీట్ దాఖలై ఏడాది గడచిన, ఐదేళ్ళు జైలు శిక్ష పడిన కేసుల్లో నిందితుల ఎన్నిక రద్దయినట్టు ప్రకటించాలని లోక్ ప్రహారి సంస్థ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ ఎస్ఎన్ శుక్లా కోరారు. 2018లో కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత పార్లమెంటు ఏ చట్టమూ చేయలేదని శుక్లా గుర్తు చేశారు.
2020-11-16ఏపీ సిఎం జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం వాదనలు వినినుంది. సుప్రీం సిటింగ్ జడ్జి జస్టిస్ ఎన్.వి. రమణ సహా పలువురు న్యాయమూర్తులపై ‘‘తప్పుడు, నిరాధార, రాజకీయ ఆరోపణలు’’ చేశారంటూ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ లకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ యు.యు. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ముందుగా అడ్వొకేట్ జి.ఎస్. మణి పిటిషన్ పైన వాదనలు విననుంది. తర్వాత యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిటిషన్ విచారణకు రానుంది.
2020-11-16 Read Moreఅమెరికా టాప్ సీక్రెట్ నిఘా కార్యకలాపాలను బట్టబయలు చేసిన ఎన్ఎస్ఎ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ (37)కు రష్యా శాశ్వత ప్రాతిపదికన ఆశ్రయమిచ్చింది. ఈ విషయాన్ని స్నోడెన్ లాయర్ అనతోలి కుచెరెనా వెల్లడించారు. రష్యాలో నిరవధికంగా నివాసం ఉండటానికి బేషరతుగా అనుమతి ఇవ్వాలని కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించినట్టు స్నోడెన్ కు గురువారం నోటిఫికేషన్ అందింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2013లో స్నోడెన్ కు ఆశ్రయం మంజూరు చేశారు. ఆయన ప్రస్తుతం మాస్కోలో లేదా నగర సమీపంలో ఉంటున్నారు.
2020-10-22సీబీఐ ఇష్టారాజ్యంగా దర్యాప్తు చేపట్టడానికి వీల్లేకుండా మహారాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది. సీబీఐకి ఇదివరకు ఇచ్చిన ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించింది. దీంతో... ఇకపైన మహారాష్ట్రలో కొత్తగా ఎవరిపైనైనా కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవడం సీబీఐకి తప్పనిసరి. రిపబ్లిక్ టీవీ, రెండు మరాఠా టీవీ ఛానళ్ళు ‘టి.ఆర్.పి. కుంభకోణం’కు పాల్పడ్డాయంటూ మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో, రిపబ్లిక్ అధినేత ఆర్ణబ్ గోస్వామిని కాపాడటంకోసం యూపీ ప్రభుత్వం హడావిడిగా ఓ కేసును నమోదు చేయించి దాన్ని సీబీఐకి బదలాయించింది.
2020-10-21‘కరోనా’ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగంతో అరెస్టయిన 20 మంది విదేశీ ‘తబ్లిఘి జమాత్’ పత్రినిధులు నిర్ధోషులను ముంబై కోర్టు తీర్పు చెప్పింది. వారు ఉత్తర్వులను ఉల్లంఘించారనేందుకు ఆధారాలు లేవని అంధేరి లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. ఈ 20 మందిలో 10 మంది ఇండోనేషియా నుంచి, మిగిలిన 10 మంది కిర్గిజిస్తాన్ నుంచి వచ్చినవారు. ‘తబ్లిఘి జమాత్’కు హాజరైన విదేశీయులపై ముంబై పోలీసులు ఏప్రిల్ లో కేసులు నమోదు చేశారు. ఇతర అభియోగాలతోపాటు వారిపైన హత్యాయత్నం అభియోగాన్నీ మోపారు. ఈ అభియోగాలను కోర్టు కొట్టివేసింది.
2020-10-20సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ మోస్ట్ జడ్జిపై అపవాదులతో ఆరోపణలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డిని సిఎం పదవి నుంచి తొలగించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం బుధవారం అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ సంయుక్తంగా ఈ ‘పిల్’ను దాఖలు చేశారు. మనీ లాండరింగ్, అవినీతి సహా 20కి పైగా తీవ్రమైన స్వభావం గల క్రిమినల్ కేసులను జగన్ ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికా లేకుండా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణపై ఆరోపణలు చేసినందుకు సిఎంను తొలగించాలని పిటిషనర్లు కోరారు.
2020-10-14