వైఎస్ వివేకానందరెడ్డి హత్యేనని కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నిర్ధారించారు. ఆయనకు తలపై మూడు గాయాలు, ఇతర శరీర భాగాలపై మరో రెండు గాయాలు ఉన్నట్టు చెప్పారు. ఏదో ఒక పదునైన ఆయుధంతో దాడి చేశారని పేర్కొన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఎస్పీ హత్యను నిర్ధారించారు. రాత్రి 11.30, ఉదయం 5.30 గంటల మధ్య నేరం జరిగి ఉంటుందని ఎస్సీ పేర్కొన్నారు. ఈ నిర్ధారణ తర్వాత ‘అనుమానాస్పద మరణం’ కేసును హత్యకేసుగా మార్చారు.

2019-03-15

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. కడప జిల్లా పులివెందులలోని నివాసంలో వివేకా శుక్రవారం తెల్లవారుజామున రక్త గాయాలతో పడి ఉన్నట్టు ఆయన పిఎ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా ముఖం, తల, చేతులకు రక్త గాయాలు ఉన్నాయి. దీంతో పోలీసులు ‘అనుమానాస్పద మరణం’గా కేసు నమోదు చేశారు. వివేకానందరెడ్డిపై ఎవరో దాడి చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన సమీప బంధువు, మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వ్యక్తం చేశారు.

2019-03-15

మరణశిక్షపై మారటోరియం విధిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వనున్నట్టు అమెరికాలోని కేలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ చెప్పారు. దీంతో ఇప్పటికే మరణశిక్ష పడి జైళ్ళలో ఉన్న 737 మంది ఖైదీలకు ఊరట లభించనుంది. మారటోరియం ఎత్తివేసేవరకు వారికి ఉరి వేయరు. జనవరిలోనే గవర్నర్ అయిన గవిన్, తాను నైతికంగా మరణశిక్షకు వ్యతిరేకినని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో గవిన్ ఇలాంటి చర్యకు హామీ కూడా ఇచ్చారు. కేలిఫోర్నియా జనాభాలోనే కాదు.. మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్యలోనూ మొదటి స్థానంలో ఉంది.

2019-03-13 Read More

బ్రెజిల్ లోని ఓ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఇద్దరు యువకులు జరిపిన కాల్పులలో 9 మంది చనిపోయారు. మరో 17 మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు విద్యార్ధులు, ఓ పాఠశాల ఉద్యోగి, మరో పౌరుడు, కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు ఉన్నారు. పాఠశాల పిల్లలపై కాల్పులు జరిపిన తర్వాత దుండగులు తమను తాము కాల్చుకున్నట్టు సావోపోలో పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు ఇద్దరు యువకులు ముఖాలకు మాస్కులు ధరించి తుపాకులతో పాఠశాల ఆవరణలో ప్రవేశించారు. ఆ పాఠశాలలో 1000 మంది విద్యార్ధులు ఉన్నారు.

2019-03-13 Read More

రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని, హిందూ పత్రిక కథనాలకు అవే ఆధారమని బుధవారం సుప్రీంకోర్టుకు చెప్పిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్.. శుక్రవారం మాట మార్చారు. పత్రాలు పోలేదని, సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరిన పిటిషనర్లు సదరు పత్రాల ‘ఫొటో కాపీలు‘ ఉపయోగించారని శుక్రవారం చెప్పారు. ‘పరమ రహస్యం’గా చెబుతున్న పత్రాలు సాక్షాత్తు రక్షణ శాఖ నుంచి చోరీ అయ్యాయని సుప్రీంకోర్టుకు చెప్పడంపై దుమారం చెలరేగడంతో.. కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

2019-03-09 Read More

అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదానికి ‘శాశ్వతంగా పరిష్కారం’ కనుగొనే లక్ష్యంతో సుప్రీంకోర్టు ముగ్గురు మధ్యవర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్.ఎం.ఐ. కలీఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు ఉన్నారు. వివాదాస్పద స్థలం ఉన్న ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో జరిగే మధ్యవర్తుల కార్యకలాపాలను రహస్యంగా ఉంచాలని, మీడియాలో వార్తలు రాకుండా నిరోధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీకి 8 వారాల గడువు ఇచ్చింది.

2019-03-08 Read More

రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరుతున్నవారి పిటిషన్, హిందూ పత్రిక రాసిన కథనాలకు చోరీకి గురైన పత్రాలే ఆధారమని కేంద్రం ఆరోపించింది. రాఫేల్ ఒప్పందంపై ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

2019-03-06 Read More

ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ (29) ఆచూకీ చెప్పినవారికి మిలియన్ డాలర్లు బహుమానం ఇస్తామని అమెరికా ప్రకటించిన రోజే ఐరాస భద్రతా మండలి ఈ వారసుడిపై నిషేధం విధించింది. దీంతో హంజా ప్రయాణంపై నిషేధం, ఆస్తులు సీజ్ చేయడం వంటి చర్యలు ఉంటాయి. బిన్ లాడెన్ తర్వాత ఐమన్ అల్ జవహారి నాయకత్వంలో నడుస్తున్న అల్ ఖైదాకు హంజా ‘భవిష్యత్తు నాయకుడ’ని భావించి ఈ చర్యలు తీసుకున్నారు. అమెరికా రివార్డు ప్రకటన తర్వాత సౌదీ అరేబియా హంజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేసింది. హంజా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్టు భావిస్తున్నారు.

2019-03-02 Read More

‘ట్రంప్ ఒక నయ వంచకుడు, జాత్యహంకారి’... ఈ మాటలన్నది అమెరికా అధ్యక్షుడి మాజీ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్. ఒక శృంగార తారకు సొమ్ము ముట్టజెప్పాలని తనను ట్రంప్ నిర్దేశించారని, 2016లో వికీలీక్స్ ప్రచురించిన హిలరీ క్లింటన్ ఇమెయిల్స్ విషయం ఆయనకు ముందే తెలుసని కోహెన్ చెప్పారు. ఈ రెండు ఆరోపణలనూ ట్రంప్ ఇంతకు ముందే తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ ముందు కోహెన్ సాక్ష్యమిచ్చారు. అయితే, 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రష్యన్లతో లాలూచీ పడినట్టు తన వద్ద ప్రత్యక్ష సాక్ష్యమేమీ లేదని కోహెన్ తెలిపారు.

2019-02-28
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page