భారత అతిపెద్ద ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీపై శుక్రవారం లండన్ కోర్టులో ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. విజయ్ మాల్యాను పెట్టే జైలు గదిలోనే నీరవ్ మోదీని కూడా ఉంచుతారా? అని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎమ్మా అర్బత్ నాట్ ప్రాసిక్యూషన్ లాయర్ ను అడిగారు. నీవర్ మోదీ అప్పగింతను ఇండియాలోని ఏ ప్రాంతం కోరుతోంది? అని జడ్జి అడిగిన ప్రశ్నకు, ‘‘ముంబయికి పంపవచ్చు. విజయ్ మాల్యాకోసం సిద్ధం చేసిన ఆర్ధర్ రోడ్డు జైలులోనే మోదీనీ ఉంచవచ్చు’’ అని ప్రాసిక్యూషన్ లాయర్ బదులిచ్చారు. దీంతో ఆమె సరదాగా ‘ఒకే సెల్’ ప్రశ్న వేశారు.

2019-03-30 Read More

ఇండియానుంచి పరారైన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి లండన్ కోర్టు రెండోసారి కూడా బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే నిందితుడు లండన్ నుంచి కూడా పరారయ్యే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేయవచ్చని, ఆధారాలను నాశనం చేయవచ్చని ప్రాసిక్యూషన్ వాదించింది. సాక్షులను చంపుతామని మోదీ బెదిరించారని ఇండియా తరపున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు (సిపిఎస్) లాయర్ టోబీ క్యాడ్ మన్ కోర్టుకు నివేదించారు. మార్చి 19న అరెస్టయిన వెంటనే బెయిల్ కోరిన మోదీకి నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 26న జరగనున్న మరో హియరింగ్ వరకు మోదీ జైల్లోనే గడపాల్సి ఉంటుంది.

2019-03-30

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా కప్పిపుచ్చడంకోసమే కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. వివేకా హత్యలో దాగివున్న రహస్యాలను వెలికి తీసేందుకు ఎస్పీ ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. సిట్ దర్యాప్తును వాయిదా వేయించాలని, థర్డ్ పార్టీ విచారణ చేయించాలని వై.ఎస్.ఆర్.సి. హైకోర్టులో వేయించిన కేసు కూడా... ఎన్నికల సమయంలో నిజాలను బయటకు రానివ్వకూడదన్న కుట్రలో భాగమని టీడీపీ నేతలు ఆరోపించారు.

2019-03-27

భారత ఆర్థిక నేరగాడు నీరవ్ దీపక్ మోదీకి వెంటనే బెయిల్ ఇవ్వడానికి లండన్ కోర్టు నిరాకరించింది. బెయిల్ గడువు పూర్తయ్యాక లొంగిపోతారన్న నమ్మకం లేనందున ఈ నెల 29వ తేదీవరకు రిమాండ్ విధిస్తున్నట్టు అక్కడి జిల్లా జడ్జి మేరీ మల్లాన్ చెప్పారు. బుధవారం మోదీని అరెస్టు చేసిన లండన్ పోలీసులు వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఇండియాకు అప్పగించాలన్న ఈడీ వినతిని మోదీ ఆ కోర్టులోనే సవాలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పి.ఎన్.బి)ను రూ. 13,500 మేరకు ముంచిన కేసులో మోదీ ప్రధాన నిందితుడు.

2019-03-20 Read More

బీసీ వర్గాల రిజర్వేషన్ కోటాను 14 నుంచి 27 శాతానికి పెంచుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్చి 8న జారీ చేసిన ఆర్డినెన్స్ అమలును ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. కొద్ది నెలల క్రితమే ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ‘2019 నీట్’ పరీక్ష రాసిన ఎంబిబిఎస్ విద్యార్ధులు కొందరు రిజర్వేషన్ పెంపు ఆర్డినెన్సును కోర్టులో సవాలు చేశారు. ఓబీసీ కోటా పెంపుతో రాష్ట్రంలో రిజర్వేషన్ల మొత్తం 63 శాతానికి చేరుతోందని, రాజ్యాంగంలోని 164(4) అధికరణాన్ని ఈ ఆర్డినెన్సు అతిక్రమించిందని వారి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

2019-03-20 Read More

ఆపత్సమయంలో ఒక మనిషి తన ప్రాణాన్ని రక్షించుకునేందుకు ఉన్న హక్కుకు సుప్రీంకోర్టు తాజాగా విస్తృత నిర్వచనం ఇచ్చింది. ‘స్వీయరక్షణ హక్కు’ తన దేహాన్ని రక్షించుకోవడానికే కాకుండా ఇతరులను, వారి ఆస్తులను రక్షించడానికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఐపీసీలోని కొన్ని సెక్షన్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ విస్తృత నిర్వచనంతో ఓ తమిళనాడు ఫారెస్ట్ రేంజర్ జైలు శిక్ష నుంచి విముక్తుడయ్యాడు. 1988లో ఎర్రచందనం ‘స్మగ్లర్’ ఒకరిని కాల్చి చంపిన నేరానికి ఆ రేంజర్ జైలు పాలయ్యారు.

2019-03-20 Read More

వైఎస్ వివేకానందరెడ్డి హత్యని గుండెపోటు మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని, సాక్ష్యాలను నాశనంచేసేందుకు పడకగదిలో రక్తాన్ని కడిగేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఉదయం 5.30కి పిఎ వచ్చి చూస్తే 6.40కి అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి వివేకా కింద పడి చనిపోయినట్టు చెప్పాడని, నుదురుపైన మెదడు బయటకు వచ్చేంత తీవ్రమైన గాయం ఉంటే తలకు గుడ్డ చుట్టి హత్య కాదని నమ్మించే ప్రయత్నం చేశారని సిఎం వివరించారు. నిందితులే సాక్ష్యాలను నాశనం చేస్తారన్న సిఎం, దారుణం చేసినవారే రాజకీయ ఆరోపణలకూ దిగారని మండిపడ్డారు.

2019-03-15

న్యూజీలాండ్ మసీదులలో మారణకాండకు పాల్పడిన ముస్లిం వ్యతిరేక ఉన్మాదుల్లో ఒక వ్యక్తిని ఆస్ట్రేలియన్ జాతీయుడు బ్రెంటన్ టారంట్ గా గుర్తించారు. 28 సంవత్సరాల బ్రెంటన్ అల్ నూర్ మసీదులో సృష్టించిన నరమేథాన్ని ‘ఫేస్ బుక్’లో లైవ్ ద్వారా చూపించాడు. లైవ్ స్ట్రీమింగ్ కోసం ఒక గో ప్రో కెమేరాను బ్రెంటన్ ఉపయోగించాడు. 17 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో బ్రెటన్ కారు నడుపుతూ రావడంనుంచి, మారణాయుధాలు తీసుకొని మసీదులోని ఒక్కో గదిలోకి వెళ్లి కాల్పులు జరపడం వరకు రికార్డయింది.

2019-03-15

ఉగ్రవాద దాడితో న్యూజీలాండ్ ఉలికిపడింది. క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదులో ముస్లిం వ్యతిరేక ఛాందసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 49 మంది మరణించారు. ఈ దాడికి సంబంధించి ఒక మహిళతో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక వ్యక్తిని ఆస్ట్రేలియాకు చెందిన శ్వేతజాతి తీవ్రవాది అని నిర్ధారించారు. అల్ నూర్ మసీదులో కాల్పులు జరిపిన వ్యక్తి ఆ మారణ కాండనంతా సామాజిక మాథ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. చనిపోయినవారిలో పిల్లలు కూడా ఉన్నారు.

2019-03-15

వైఎస్ వివేకానందరెడ్డిది అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డీజీపీ ఠాకూర్, ఇంటలిజెన్స్ అధికారులు, కడప జిల్లా ఎస్పీ తదితరులతో చర్చించారు. అయితే, ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘‘వైఎస్ వివేకానందరెడ్డి మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉంది. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

2019-03-15
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page