యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో మైనర్ బాలిక శ్రావణి హత్య కేసు తీగ లాగితే ఓ ఉన్మాద హత్యాకాండ బయటపడింది. మర్రి శ్రీనివాసరెడ్డి (28) అనే రేపిస్టు శ్రావణితోపాటు మరో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హత్యగావించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2015లో కల్పన అనే బాలిక, ఈ ఏడాది శివరాత్రి సమయంలో మనీషా, తాజాగా శ్రావణి ఈ ఉన్మాదికి బలయ్యారు. మనీషా, శ్రావణి మృతదేహాలు శ్రీనివాసరెడ్డి బావిలోనే దొరికాయి. 2017లో కర్నూలు జిల్లాలో ఓ వేశ్యను కూడా శ్రీనివాసరెడ్డి చంపినట్టు మంగళవారం రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు.
2019-04-30 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఇదివరకు ఇచ్చిన తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఐదు రోజులు గడువు ఇచ్చింది. నెల రోజులు గడువు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపానికి...ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు. అంతేకాదు.. ఇంతకు ముందు సుప్రీంకోర్టుకు ఉద్ధేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై చర్యలకు ప్రత్యేక దరఖాస్తు దాఖలు చేయాలని ఆదేశించింది.
2019-04-30 Read More‘‘కాపలాదారు దొంగ’’ నినాదాన్ని సుప్రీంకోర్టుకు ఆపాదించిన వివాదంలో రాహుల్ గాంధీ క్షమాపణకు న్యాయమూర్తులు పట్టుపట్టారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం రాహుల్ గాంధీ ‘విచార’ వ్యక్తీకరణను తిరస్కరించింది. ‘స్పష్టంగా క్షమాపణ చెప్పాలి లేదంటే క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలి’ అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్ ను తిరస్కరిస్తూ...కొత్త అఫిడవిట్ దాఖలు చేయడానికి వచ్చే సోమవారం వరకు గడువు ఇచ్చింది.
2019-04-30 Read Moreక్రైస్తవుల పండుగ ఈస్టర్ రోజున (ఆదివారం) శ్రీలంక ఉగ్రవాద దాడులతో వణికిపోయింది. చర్చిలు, విదేశీయులు బస చేసే హోటళ్ళు ప్రధాన లక్ష్యాలుగా జరిగిన బాంబు పేలుళ్ళలో 207 మంది మరణించారు. అందులో 8 దేశాలకు చెందిన 30కి మందికి పైగా టూరిస్టులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమచారం ప్రకారం మొత్తం 8 చోట్ల బాంబు పేలుళ్ళు జరిగాయి. మరిన్నిచోట్ల బాంబు పేలుళ్ళు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐఎస్ఐఎస్ ప్రభావిత ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు ఆత్మహుతి బాంబర్లు ఈ దాడులకు పాల్పడినట్టు గుర్తించారు.
2019-04-21రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ‘ద హిందూ’ పత్రిక వెల్లడించిన ‘రహస్య పత్రాలు’ సాక్ష్యాలుగా పరిగణించకూడదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తానే గతంలో మోదీ ప్రభుత్వానికి ఇచ్చిన ‘క్లీన్ చిట్’ను సమీక్షించడానికి అంగీకరించింది. రాఫేల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా నాలుగు నెలల క్రితం పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, ఆ అఫిడవిట్ లో కేంద్రం కొన్ని అవాస్తవాలను చెప్పినట్టు తర్వాత వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే.. రక్షణ శాఖ పత్రాలను ఉటంకిస్తూ ‘హిందూ’ వరుస కథనాలను ఇచ్చింది.
2019-04-10 Read Moreఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో మంగళవారం మావోయిస్టులు జరిపిన దాడిలో బీజేపీ ఎంఎల్ఎ భీమా మందవి, నలుగురు సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఎంఎల్ఎ బాచేలి ప్రాంతంనుంచి కువకొండ వైపు వెళ్తుండగా శ్యామగిరి హిల్స్ వద్ద నక్సలైట్లు ఐఇడి పేల్చి కాల్పులు జరిపారు. దంతెవాడ ప్రాంతం బస్తర్ లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ తొలి దశలో భాగంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. మంగళవారమే తొలి దశ ప్రచారం ముగిసింది.
2019-04-09 Read Moreగుజ్జార్లు, మరో నాలుగు సామాజికవర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. గుజ్జార్లకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
2019-04-05 Read Moreపురుష-పురుష లైంగిక సంబంధాలు, అక్రమ సంబంధాలలు పెట్టుకున్నవారిని రాళ్ళతో కొట్టి చంపేలా బ్రూనై దేశం కొత్త చట్టాలను బుధవారం ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా బ్రూనై శిక్షలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఆ దేశం పట్టించుకోలేదు. ఐక్యరాజ్యసమితి బ్రూనై శిక్షలను ‘‘క్రూరం, అమానవీయం’’ అన్నా, హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ బ్రూనైకి చెందిన హోటళ్ళను బహిష్కరించాలని పిలుపునిచ్చినా ఆ దేశ సుల్తాన్ వెనక్కు తగ్గలేదు. మానభంగం, దోపిడీ, మహ్మద్ ప్రవక్త ధూషణ వంటి నేరాలకు కూడా అక్కడ మరణశిక్షే అమలవుతుంది. దొంగలకు చేతులు, కాళ్ళు నరికి
2019-04-03 Read Moreఒక చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ లోని ఎర్రంమంజిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2010లో సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి పెట్టిన కేసులో మంగళవారం తీర్పు వచ్చింది. మోహన్ బాబు రూ. 41.75 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
2019-04-02సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం 37 మంది లాయర్లను సీనియర్ అడ్వకేట్లుగా గుర్తించింది. వారిలో ఆరుగురు మహిళలున్నారు. మాధవీ దివాన్, మేనకా గురుస్వామి, అనితా షెనాయ్, అపరాజితా సింగ్, ఐశ్వర్య భాటి, ప్రియా హింగోరాని తాజాగా సీనియర్ అడ్వకేట్లుగా గుర్తింపు పొందారు. అంతకు ముందు 8 మంది మహిళా న్యాయవాదులు ఈ కేటగిరిలోకి చేరారు. సీనియర్ అడ్వకేట్ల జాబితాలో చేరిన మొదటి మహిళ ఇందు మల్హోత్రా. సుప్రీంకోర్టు ప్రారంభమైన 57 సంవత్సరాల తర్వాత 2007లో తొలిసారి మహిళకు ఈ గుర్తింపు దక్కింది. ఇందు మల్హోత్రా ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు.
2019-03-29 Read More