ఫోనులో దిశ యాప్ ఉంటే ఓ అన్న తోడుగా ఉన్నట్టేనని ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దిశ యాప్ డౌన్ లోడ్స్ పెంచడానికి మంగళవారం విజయవాడ సమీపంలోని గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఇప్పటికి 17 లక్షల మంది యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని, ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఉండాలని పేర్కొన్నారు. మహిళల భద్రతపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్న జగన్, దిశ చట్టం తీసుకొచ్చి రాష్ట్రంలో 18 ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామని, త్వరలో ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
2021-06-29 Read Moreఔషదాలు ఉన్నప్పటికీ, వాటిని అవసరమైన ప్రాంతానికి కాకుండా వేరొక ప్రాంతానికి పంపితే, అలా చేసినవారి చేతులకు రక్తం అంటినట్టేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్ చికిత్సకు అవసరమైన వనరుల విషయంలో కేంద్రం వివక్ష పాటిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో హైకోర్టు వాదనలు విన్నది. ఆక్సిజన్, టీకాల పంపిణీ విధానంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకదానికి ఆక్సిజన్ ను మళ్లించినందువల్ల ఢిల్లీలో కొరత ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం నిన్న కోర్టులో ఆరోపించింది.
2021-04-20ఢిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై ఆ రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఆక్సిజన్ కోసం పరిశ్రమలు వేచి చూడగలవని, కానీ పేషెంట్లు వేచి ఉండలేరని జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లి వ్యాఖ్యానించారు. పరిశ్రమలలో ఆక్సిజన్ వాడకాన్ని ఈ నెల 22 నుంచి నిషేధించినట్టు కేంద్రం బదులివ్వగా, ‘‘అది ఈ రోజే ఎందుకు చేయకూడదు? ఏప్రిల్ 22 దాకా వేచి చూడటం ఎందుకు? ఇక్కడ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆక్సిజన్ కోసం ఏప్రిల్ 22 దాకా వేచి ఉండమని మీరు పేషెంట్లను అడుగుతారా?’’ అని హైకోర్టు ప్రశ్నించింది.
2021-04-20 Read Moreనిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషనరుగా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వబోమని భీష్మించిన జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఆశాభంగమైంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కరోనా తీవ్రంగా ఉన్న దశలోనే అనేక చోట్ల ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. రెండు వ్యవస్థల మధ్య అహం సమస్య రాష్ట్రంలో అరాజకానికి దారి తీస్తోందని వ్యాఖ్యానించిన సుప్రీం, దాన్ని తాము అనుమతించబోమని ఉద్ఘాటించింది.
2021-01-25రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్.ఇ.సి) ఇచ్చిన షెడ్యూలును కొట్టివేస్తూ సింగిల్ జడ్జి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఎస్.ఇ.సి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పీలుపై గురువారం తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి తీర్పు ప్రాథమిక న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉందని, కరోనా వ్యాక్సిన్ పేరిట ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం సహేతుకం కాదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
2021-01-21కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమించిన రైతులతో చర్చించడానికంటూ సుప్రీంకోర్టు నలుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన ఒక్క రోజులోనే అందులో సభ్యుడైన భూపీందర్ సింగ్ మాన్ వైదొలిగారు. తాను కమిటీలో భాగం కాబోనని, పంజాబ్ రాష్ట్ర, దేశ రైతుల ప్రయోజనాలపై రాజీ పడబోనని మాన్ గురువారం ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలిండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెసిసి)కి అధ్యక్షుడైన మాన్ (82) కేంద్ర చట్టాలకు అనుకూలుడే. సుప్రీంకోర్టు కమిటీలోని నలుగురు సభ్యులూ చట్టాల సమర్థకులేనని విమర్శలు వెల్లువెత్తాయి.
2021-01-14ఏపీలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో విచారణ చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1న తాను ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించడానికి హైకోర్టు నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ విన్నపాన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ తదుపరి విచారణను శీతాకాల సెలవుల తర్వాత చేపడతామని ప్రకటించింది.
2020-12-18కస్టడీ మరణాల్లో పేదలవే అధికం (71.58 శాతం) అని నేషనల్ క్యాంపెయిన్ అగనెస్ట్ టార్చర్ అనే ఢిల్లీ సంస్థ ప్రకటించింది. 1996-97 నుంచి 2017-18 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికలను విశ్లేషించి, గురువారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వెల్లడించింది. 2017-18 వరకు 11 సంవత్సరాలలో ఎన్.హెచ్.ఆర్.సి. ప్రస్తావించిన 95 కస్టడీ మరణాల్లో 68 మంది బాధితులు పేద కుటుంబాలవారని తేలింది. ముగ్గురు (3.019 శాతం) మధ్యతరగతి వారని, 24 మంది (25.26 శాతం) ఆర్థిక స్థితి తెలియదని పేర్కొంది. నిస్సందేహంగా వారిలో మెజారిటీ పేదలే ఉంటారు.
2020-12-10పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ‘స్టే’ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని కొట్టివేసింది. ఏప్రిల్ లో వాయిదా వేసిన ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందని ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికల తేదీలను నిర్ణయించాలంటూ చట్టానికి సవరణల కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రభుత్వానికి ఆ ముచ్చటా తీరాల్సి ఉంది.
2020-12-08రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను అక్కడి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక ‘ప్రజాప్రయోజన వ్యాజ్యం’ దాఖలైంది. తమకు నష్టదాయకమైన కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలంటూ రైతులు గత వారం ‘చలో ఢిల్లీ’ చేపట్టిన విషయం తెలిసిందే. రైతు సమూహంవల్ల ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని, ‘‘అత్యవసర వైద్యసేవలకు కూడా అవరోధాలు ఎదురవుతున్నందు’’న రైతు సమూహాన్ని తొలగించడం అవసరమని పిటిషనర్ పేర్కొన్నారు.
2020-12-04