బోఫోర్స్ లంచాల కేసులో తదుపరి విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టులో గత ఏడాది దరఖాస్తు దాఖలు చేసిన సీబీఐ, తాజాగా దాన్ని వెనక్కు తీసుకుంది. 64 కోట్ల బోఫోర్స్ కుంభకోణంలో కొత్త ఆధారాలు లభించాయని 2018 ఫిబ్రవరి 1వ తేదీన దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది. సీబీఐకి తమ అనుమతి ఎందుకు అవసరమైందని ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గత డిసెంబర్ 4న ప్రశ్నించింది. గురువారం దరఖాస్తు ఉపసంహరించుకోవడానికి కారణాలు సీబీఐకే తెలియాలని మేజిస్ట్రేట్ నవీన్ కుమార్ కాశ్యప్ వ్యాఖ్యానించారు.
2019-05-16 Read Moreసిపిఎం కార్యకర్త పవిత్రన్ హత్య కేసులో ఏడుగురు బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు జీవిత ఖైదు విధిస్తూ కేరళలోని తలస్సెరి కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. హత్య, మారణాయుధాలతో అల్లర్లు సృష్టించడం సహా మొత్తం 6 సెక్షన్ల కింద నేరాన్ని నిర్ధారించింది. సికె ప్రశాంత్, లైజేష్ అలియాస్ లైజు, పరయక్కాండి వినీష్, ప్రశాంత్ అలియాస్ ముత్తు, కెసి అనిల్ కుమార్, కిజక్కయిల్ విజిలేష్, కె. మహేష్ లకు శిక్ష పడింది. 2007 నవంబర్ 6 వేకువజామున పాలకోసం ఇంటి బయటకు వచ్చిన పవిత్రన్ పై మారణాయుధాలతో దాడి చేయగా.. 10వ తేదీన కోజికోడ్ ఆసుపత్రిలో ఆయన మరణించారు.
2019-05-15 Read Moreభార్యపై అనుమానంతో మోటార్ సైకిల్ హ్యాండిల్ ప్లాస్టిక్ గ్రిప్ ఒకదాన్ని ఆమె మర్మాంగంలోకి చొప్పించిన ఓ మూర్ఖుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ప్రకాష్ భిల్ అలియాస్ రామా (35) అనే నిందితుడిని పోలీసులు మొన్న ఆదివారం అరెస్టు చేశారు. బాధితురాలికి ఇన్ఫెక్షన్ సోకి మర్మాంగం, మరికొన్ని భాగాలకు విస్తరించడంతో క్లిష్టతరమైన సర్జరీ ద్వారా ఆ ప్లాస్టిక్ గ్రిప్ ను తొలగించారు. ఇంతకాలం ఎవరికీ చెప్పని బాధితురాలు నొప్పి భరించలేని స్థితిలో ఆసుపత్రికి వెళ్లింది.
2019-05-14 Read Moreఅయోధ్య స్తల వివాదానికి సానుకూల పరిష్కారంకోసం నియమించిన మధ్యవర్తులకు ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు ఆగస్టు 15వరకు పెంచింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీ తమకు ఒక నివేదికను సమర్పించిందని, గడువు పెంచాలని అందులో కోరిందని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం వెల్లడించారు. ‘‘ఫలితం పట్ల మధ్యవర్తులకు విశ్వాసం ఉంటే గడువు ఇవ్వడంలో నష్టం ఏముంది’’ అని సుప్రీం ప్రశ్నించింది.
2019-05-10 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని సీబీఐకి వచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కెఎం జోసెఫ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో సుప్రీంకోర్టే ఇచ్చిన ‘రాఫేల్’ తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం రెండు గంటలపాటు హియరింగ్ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనంలో జస్టిస్ జోసెఫ్ సభ్యుడు. ‘‘ఇక్కడ ప్రశ్న ఏమిటంటే... ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా’’ అని జస్టిస్ జోసెఫ్ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ను ప్రశ్నించారు.
2019-05-10 Read More‘‘ఆయన ప్రధానమంత్రి కావాలనుకోవడంలేదు. ఒకవేళ 123 కోట్ల ప్రజలు ఆయన ప్రధాని కావాలంటే మీకేమైనా అభ్యంతరమా’’..రాహుల్ గాంధీకి ద్వంద పౌరసత్వం ఉన్న కారణంగా ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరిన పిటిషనర్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వేసిన ప్రశ్న ఇది. ద్వంద పౌరసత్వంతోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారేమో? అని భగవాన్ గోయల్ అనే పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేసినప్పుడు సిజె ఇలా స్పందించారు. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని ఓ కంపెనీ చెబితే అయిపోతారా? అని సిజె ప్రశ్నించారు.
2019-05-09 Read Moreభారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పైన ఒక మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ‘పస’ లేదని జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే కమిటీ తేల్చింది. జస్టిస్ బాబ్డేతోపాటు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ప్యానల్ ఈ అంశంపై రహస్య విచారణ జరిపి ప్రధాన న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. ప్యానల్ తన నివేదికను ‘తదుపరి సీనియర్ జడ్జి (అరుణ్ మిశ్రా)’కి సమర్పించింది. రంజన్ గొగోయ్ తనను వేధించారని ఆరోపిస్తూ ఓ మాజీ ఉద్యోగి గత నెల 29న 22 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
2019-05-06 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో పురోగతిని ప్రధానమంత్రి కార్యాలయం ‘‘పర్యవేక్షించడం’’, ‘‘సమాంతరం సంప్రదింపులు’’ చేపట్టడంగా చూడరాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. శనివారం సుప్రీంకోర్టుకు ఇచ్చిన 13 పేజీల సమాధానంలో మోదీ ప్రభుత్వం ఈ వాదనను వినిపించింది. ప్రభుత్వం, ప్రభుత్వం మధ్య జరిగే ప్రక్రియలో ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణను ‘‘జోక్యం’’ లేదా ‘‘సమాంతర సంప్రదింపులు’’గా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పిటిషనర్ల వాదన, దేశ భద్రత విషయంలో ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనని రక్షణ శాఖ ఆరోపించింది.
2019-05-04 Read Moreప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విద్వేష ప్రసంగాలు, సైనిక కార్యకలాపాలను ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం వంటి అంశాలపై ఈ నెల 6వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. మోదీ, షాలపై ఫిర్యాదులను ఈసీ పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ నేత సుష్మితాదేవ్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ప్రసంగ పాఠాలను పరిశీలించడానికి ఎక్కువ సమయం కావాలని ఎన్నికల సంఘం కోరగా ‘‘మీకు ఈరోజు, శుక్రవారం.. ఆదివారం కూడా సమయం ఉంది. సోమవారం రండి’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఉద్ఘాటించారు.
2019-05-02 Read Moreభారత న్యాయస్థానాల చరిత్రలో అరుదైన సన్నివేశమిది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే కమిటీ ఎదుట హాజరయ్యారు. గొగోయ్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... ఆంతరంగిక విచారణకోసం బాబ్డే కమిటీని నియమించారు. ప్రధాన న్యాయమూర్తి హాజరు కోరుతూ కమిటీ ‘‘లెటర్ ఆఫ్ రిక్వెస్ట్’’ను పంపగా ఆయన స్పందించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి సమన్లకు బదులు ‘లెటర్ ఆఫ్ రిక్వెస్ట్’ పంపడం ఆనవాయితీ.
2019-05-01 Read More