సామూహిక అత్యాచారానికి గురైన బాధకు పోలీసుల నిర్లక్ష్యం తోడై బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని దాటగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 24 ఏళ్ల యూపీ మహిళ తెలంగాణలోని సికింద్రాబాద్ లో అత్యాచారానికి గురైంది. నేరం జరిగిన చోటే ఫిర్యాదు చేయాలని యూపీ పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. గత నెలలో తన బంధువు మరో ఇద్దరితో కలసి యూపీనుంచి బలవంతంగా సికింద్రాబాద్ తీసుకెళ్ళాడని, అక్కడ ఒక ఇంట్లో బంధించి రేప్ చేశారని ఆ మహిళ తన ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది.
2019-06-18 Read Moreశ్రీలంక ఈస్టర్ ఉగ్రవాద దాడుల సూత్రధారి జహ్రాన్ హషీమ్ ఫేస్ బుక్ స్నేహితుడిని, మరో ఐదుగురిని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బుధవారం కోయంబత్తూరులో అదుపులోకి తీసుకుంది. మహ్మద్ అజరుద్ధీన్ (32), అతని స్నేహితులు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దాడులకోసం యువతను రిక్రూట్ చేసే లక్ష్యంతో ‘ఇస్లామిక్ స్టేట్’ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని ఎన్ఐఎ పేర్కొంది. అజరుద్ధీన్ ‘‘ఖిలాఫా జిఎఫ్ఎక్స్’’ అనే ఫేస్ బుక్ పేజీని నిర్వహిస్తున్నాడని తెలిపింది.
2019-06-12నిన్న అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన వ్యక్తులు సున్నితమైన వివరాలను ‘డార్క్ వెబ్’లో పెట్టినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసు స్పెషల్ ఐజి బ్రిజేష్ సింగ్ మంగళవారం చెప్పారు. మధ్యప్రాచ్యానికి చెందిన హ్యాకర్ పై ‘డార్క్ వెబ్’లో రాత్రంతా అభినందనల వర్షం కురిసినట్టు సమాచారం. కాగా, అదే హ్యాకర్ మంగళవారం పాకిస్తానీ సింగర్ ఆద్నాన్ సమి అకౌంట్ ను హ్యాక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. నిన్న రాత్రి అమితాబ్ ప్రొఫైల్ ఫొటో స్థానంలోనూ, ఈరోజు సమి ప్రొఫైల్ ఫొటో స్థానంలోనూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో పెట్టారు.
2019-06-11 Read Moreసామాజిక మాథ్యమాల్లో షేర్ చేసిన పోస్టులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కించపరిచేలా ఉన్నాయంటూ యూపీ పోలీసులు ముగ్గురు జర్నలిస్టులను, పలువురు ఇతరులను అరెస్టు చేశారు. అందులో ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్టు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఉదయం ఆమె పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ‘‘ఇది హత్య కేసు కాదు’’ అని యూపీ సర్కారును సుతిమెత్తగా మందలించింది. కేసు కొనసాగించవచ్చన్న సుప్రీం..జర్నలిస్టును మాత్రం బెయిల్ పై విడుదల చేయాలని స్పష్టం చేసింది.
2019-06-11 Read Moreకాశ్మీర్ లోని కథువాలో ఓ మైనారిటీ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఆలయ పూజారి సహా ముగ్గురికి జీవిత ఖైదు విధించింది పఠాన్ కోట్ న్యాయస్థానం. మరో ముగ్గురు నిందితులకు ఐదేళ్ళ కారాగారవాసం విధించింది. కాశ్మీర్ రణ్ బీర్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల ప్రకారం నిందితులకు శిక్ష విధించింది. పూజారి సహా ఏడుగురు నిందితులు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి దేవాలయంలోనే అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
2019-06-10జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికను అమానుషంగా చెరిచి చంపిన కేసులో ఆరుగురికి శిక్ష ఖరారైంది. ఈ కేసుపై పఠాన్ కోట్ ప్రత్యేక కోర్టు నిగూఢంగా చేపట్టిన విచారణ జూన్ 3న ముగిసింది. ఏడుగురు నిందితుల్లో ఒక మైనర్ ను వదిలేసి ఆరుగురికి సోమవారం శిక్ష ఖరారు చేశారు. ఓ మైనారిటీ సంచార తెగను తమ ప్రాంతంనుంచి తరిమేసే లక్ష్యంతో నిందితులు నీచమైన నేరానికి పాల్పడ్డారు. ఆ తెగకు చెందిన బాలికను గత ఏడాది జనవరిలో కిడ్నాప్ చేసి గుడిలో బంధించి మత్తులో ముంచి సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత చంపేశారు.
2019-06-10 Read Moreటెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రత్యేకమైన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకోసం సిట్టింగ్ జడ్జి ఒకరిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక సిజె జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పిలిచే టెండర్లను ముందుగానే ఈ జ్యుడిషియల్ కమిషన్ పరిశీలనకు పంపుతామని, కమిషన్ మార్పులు సూచిస్తే పాటిస్తామని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. గత నెల 30న తన ప్రమాణస్వీకారం సందర్భంగానే జగన్.. జ్యుడిషియల్ కమిషన్ ఆలోచనను వెల్లడించారు.
2019-06-04ఆర్థికాభివృద్ధి మందగించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ నేరాలు పెరిగినట్టు డేటా కంపెనీ ‘రెఫినిటివ్’ సర్వేలో తేలింది. ఈ నేరాలతో.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలకు ఏకంగా 1.45 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,01,50,000 కోట్లు) నష్టం వాటిల్లినట్టు సర్వే వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 75 శాతం గత ఏడాది తాము ఆర్థిక నేరాలతో నష్టపోయినట్టు పేర్కొన్నాయి. కిందటి సంవత్సరం కంటే నేరాలు 49 శాతం పెరిగాయి.
2019-05-29 Read Moreపాకిస్తాన్ నుంచి 200 కేజీల ‘హెరాయిన్’తో వస్తున్న ఓ చేపల బోటును భారత కోస్టు గార్డు దళం మంగళవారం గుజరాత్ తీరంలో స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న మాదకద్రవ్యం విలువ రూ. 600 కోట్లు. ‘అల్ మదీనా’ అనే పేరుగల చేపల బోటు గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను మరో ఇండియన్ బోటుకు సరఫరా చేయబోతోందని సోమవారం సాయంత్రం కోస్టు గార్డు దళానికి ఉప్పందింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ), ఇతర ఏజెన్సీలు అందించిన సమాచారంతో మంగళవారం వేకువజామున నిఘా వేసి పాకిస్తాన్ బోటును పట్టుకున్నారు.
2019-05-21 Read Moreటీవీ9 యాజమాన్య వివాదంలో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో రవిప్రకాష్, సినీనటుడు శివాజీలకు తెలంగాణ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. వారిని అరెస్టు చేయడానికి నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విదేశాలకు వెళ్తారనే ఉద్ధేశంతో దేశంలోని ఎయిర్ పోర్టులనూ అలర్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలని ఇంతవరకు మూడుసార్లు నోటీసులు పంపినా హాజరు కాకపోవడంతో..సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి లుకవుట్ నోటీసులు పంపారు.
2019-05-18 Read More