పదేళ్ళ బాలికను రేప్ చేసి.. ఆమెను, ఏడేళ్ళ సోదరుడిని దారణంగా చంపిన ఓ కిరాతకుడికి మరణ శిక్షే సరైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోయంబత్తూరులో తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన దారుణంలో రేపిస్టు హంతకుడు మనోహరన్ కు మద్రాసు హైకోర్టు విధించిన మరణశిక్షనే సుప్రీం ఖరారు చేసింది. జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ హేమంత్ గుప్తా ఈ కేసును ‘‘అత్యంత అరుదైన కేటగిరి’’గా గుర్తించి మరణశిక్షను విధించగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా అతను సహజంగా మరణించేవరకు జైల్లో ఉంచాలని సూచించారు.

2019-08-01

తమ పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ (యూపీ) ఒక టీనేజ్ బాలికను రేప్ చేసినా.. ఆమె తండ్రిని చిత్రహింసలు పెట్టినా.. చివరికి రేప్ కేసులో ఆ ఎమ్మెల్యే జైలుకు వెళ్లినా బీజేపీ స్పందించలేదు. ఇప్పుడు బాధితురాలి కుటుంబం మొత్తాన్ని తుదముట్టించడానికి ఆ ఎమ్మెల్యే జైల్లోనుంచే చేసిన కుట్ర దేశంలో కలకలం రేపడంతోపాటు అంతర్జాతీయ వార్తగా మారింది. చిట్టచివరకు తప్పనిసరై ఆ ఎమ్మెల్యేను బీజేపీ బహిష్కరించింది.

2019-08-01 Read More

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సహనిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్టయినట్టుగా వార్తలు వచ్చాయి. వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్ పిక్) షేర్ హోల్డింగ్ వివాదంలో రస్ అల్ ఖైమా ప్రభుత్వ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్ గ్రేడ్ పోలీసులు నిమ్మగడ్డను రెండు రోజుల క్రితం అరెస్టు చేసినట్టు సమాచారం. గతంలో జగన్ కేసులో ఆయనతోపాటు నిమ్మగడ్డను కూడా సీబీఐ అరెస్టు చేసి జైలుకి పంపింది.

2019-07-30 Read More

ఉన్నావ్ రేప్ కేసులో జైలుకు వెళ్లిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, తాజాగా బాధితురాలి కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన కేసును ఎదుర్కొంటున్నాడు. ఆదివారం బాధితురాలు తన లాయర్, ఇద్దరు బంధువులతో కలసి రాయబరేలి వెళ్తుండగా ఓ ట్రక్కు వారి కారును ఢీకొట్టింది. బాధితురాలి ఇద్దరు ఆంటీలు చనిపోగా ఆమె, లాయర్ గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సెంగార్, అతని సోదరుడు మనోజ్ సింగ్ లపై హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదయ్యాయి.

2019-07-29 Read More

ఐదేళ్ళ క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘మార్ఫింగ్ ఫొటో’’ను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడనే కారణంతో ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిని దేశద్రోహం నేరారోపణపై ఇప్పుడు అరెస్టు చేశారు. మీరట్ జిల్లాలో ఫహమ్ అజీమ్ సిద్ధిఖీ అనే వ్యక్తిపై పోలీసులు ఐటి చట్టం 2000, ఐపిసిలోని 124ఎ (దేశద్రోహం) కింద కేసు నమోదు చేశారు. ఈ గురువారం అరెస్టు చేసి జైలుకు పంపారు. అతనికి నేర చరిత్ర ఉందని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని మీరట్ ఎస్పీ అవినాష్ పాండే తెలిపారు.

2019-07-27 Read More

శుక్రవారం కర్నాటక సిఎంగా బిఎస్ యెడియూరప్ప ప్రమాణం చేస్తే ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేత డికె శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఇదే రోజు.. సుప్రీంకోర్టులో ఓ కేసు విషయంలో మాత్రం ఇద్దరిదీ ఒకే వైఖరి. 2008 భూ ఆక్రమణ కేసును తిరగదోడే ప్రయత్నాన్ని ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో బెంగళూరు డెవల్ మెంట్ అధారిటీ (బిడిఎ) సేకరించిన 4.2 ఎకరాల భూమిని యెడియూరప్ప ప్రభుత్వం డీనోటిఫై చేయగా, డికె శివకుమార్ మంత్రిగా ఉండగా కొనుగోలు చేశారు. అదీ కథ.

2019-07-26 Read More

10 ట్రాక్టర్లలో మందితో వెళ్లి స్థానికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 9 మందిని బలితీసుకున్న దారుణమైన నేరం యూపీలో బుధవారం జరిగింది. సోంభద్ర జిల్లాలోని ఘోరవల్ గ్రామంలో భూవివాదం ఈ ఘటనకు మూలం. మరణించినవారిలో ముగ్గురు మహిళలు. మరో 19 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ రాక్షసత్వానికి పాల్పడింది ఓ గ్రామ పెద్ద (యగ్య దత్). గ్రామంలో 90 బిఘాల (సుమారు 30 ఎకరాల) భూమిలో అనుభవదారులను ఖాళీ చేయించడానికి యగ్యదత్ మారణకాండకు దిగారు.

2019-07-17 Read More

ఒంగోలు మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో దిగిన సెల్ఫీని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ట్విట్టర్లో షేర్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ‘‘దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది’’ అని లోకేష్ పేర్కొన్నారు.

2019-06-25 Read More

సంబంధం లేని ‘కస్టోడియల్ డెత్’ కేసులో తన భర్తను ‘రాజకీయ ప్రతీకారేచ్ఛ’తో ఇరికించారని మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ భార్య శ్వేత చెప్పారు. 1990 మత కలహాల సమయంలో జాంజోధ్ పూర్ పోలీసులు అరెస్టు చేసిన 133 మందిలో ఏ ఒక్కరినీ భట్ ఇంటరాగేట్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. 2002 గుజరాత్ మారణకాండపై నరేంద్ర మోదీని తప్పుపట్టిన భట్, మరో కేసులో ఇదివరకే డిస్మిస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. 29 ఏళ్లనాటి కేసులో గుజరాత్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

2019-06-22 Read More

డిస్మిస్ అయిన ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ కు ఓ గుజరాత్ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది. 1990లో ఆయన జాంనగర్ జిల్లా అదనపు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో నమోదైన ‘కస్టోడియల్ డెత్’ కేసులో కోర్టు ఈమేరకు తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఆయన మరొక కేసులో జైల్లో ఉన్నారు. వివాదాస్పద అధికారి భట్.. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఉందంటూ 2011లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

2019-06-20 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page