ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. హైకోర్టు న్యాయవాదులు, అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2019-10-07తన తీర్పులలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ థాయ్‌లాండ్ న్యాయమూర్తి ఒకరు కోర్టులోనే ఆత్మహత్యాయత్నం చేశారు. యాలా ప్రావిన్షియల్ కోర్టు సీనియర్ న్యాయమూర్తి ఖానకార్న్ పియాంచన శుక్రవారం మధ్యాహ్నం ఓ హియరింగ్ తర్వాత కోర్టు హాలులోనే తన తుపాకిని బయటకు తీసి పొట్టలో కాల్చుకున్నారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, సర్జరీ చేసిన డాక్టర్లు ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. ఆత్మహత్యా ప్రయత్నానికి ముందు ఆ జడ్జి 25 పేజీల ప్రకటనను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు.
2019-10-05 Read Moreకోర్టుకు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడానికి జగన్ చూపిన కారణాలు సమంజసంగా లేవని, విజయవాడ నుంచి వారానికి ఓసారి హైదరాబాద్ వచ్చిపోవడం కష్టమేమీ కాదని సీబీఐ పేర్కొంది. జైలులో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసిన జగన్, ఇప్పుడు సిఎంగా ఆ పని మరింతగా చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై వాదనలను కోర్టు ఈ నెల 4న విననుంది.
2019-10-01మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కష్టాల్లో పడ్డారు. గతంలో ఎన్నికల అఫిడవిట్లో అతను ఇచ్చిన తప్పుడు సమాచారం పైన కింది కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు క్లీన్చిట్ ని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రాసిక్యూషన్ కు మార్గం సుగమమైంది. దేవేంద్ర ఫడ్నవీస్ 2014 ఎన్నికల అఫిడవిట్లో 2 క్రిమినల్ కేసుల గురించి సమాచారం ఇవ్వలేదని సతీష్ అనే పిటిషనర్ కోర్టులో సవాలు చేశాడు. 1996, 1998 లో నమోదైన చీటింగ్ ఫోర్జరీ కేసు సంబంధించి సమాచారం ఇవ్వలేదు.
2019-10-01అత్యాచారం కేసులో అరెస్టయ్యాక లక్నోలోని ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. 73 ఏళ్ల ఈ నిందితుడి బెయిల్ పిటిషన్ ఈ రోజే తిరస్కరణకు గురైంది. అయితే, ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రాత్రి ఎక్కడ గడుపుతారనేదానిపై స్పష్టత లేదు. సెప్టెంబర్ 20 న అరెస్టు అయిన మూడు రోజులకే అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి వంటి ఫిర్యాదులతో ఆయన ఆసుపత్రిలో చేరారు. లక్నోలోని ఎస్జిపిజిఐ ఆసుపత్రిలోని కార్డియాలజీ వార్డులో 8 రోజులు గడిపిన తరువాత ఈరోజు విడుదలయ్యారు.
2019-09-30 Read Moreన్యాయమూర్తుల నియామకాలు, బదిలీల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. జస్టిస్ ఎఎ ఖురేషి నియామకానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పందించారు. జస్టిస్ ఖురేషిని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం 2019 మే 10న తీసుకున్న నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల తర్వాత మారింది. ఈ జోక్యం తగదని గొగోయ్ సోమవారం పరోక్షంగా ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
2019-09-23 Read Moreడెయిరీ రైతు పేహ్లుఖాన్ (55)ను మూకగా హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ‘గో సంరక్షకులు’ ఆరుగురినీ హర్యానా కోర్టు వదిలేసింది. 2017 ఏప్రిల్ 1న పట్టపగలు జాతీయ రహదారి 8పైన జరిగిన దాడి వీడియోను దేశమంతా నివ్వెరపోయి చూసింది. ఈ కేసులో ఖాన్ కుమారులు ఇద్దరితోపాటు 40 మంది సాక్షులను అల్వార్ లోని అదనపు జిల్లా&సెషన్స్ కోర్టు విచారించింది. ఇరువైపులా వాదనలు ఈ నెల 7వ తేదీతో పూర్తి కాగా జడ్జి సరితా స్వామి బుధవారం తీర్పు వెలువరించారు.
2019-08-14 Read Moreజమ్మూ-కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 అధికరణంపై కేంద్ర ప్రభుత్వ చర్యలను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి.) ఎంపీలు మహ్మద్ అక్బర్ లోన్, జస్టిస్ (మాజీ) హస్నయిన్ మసూదీ శనివారం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కాశ్మీర్ ప్రజల ఆమోదం లేకుండా వారి హక్కులను హరించే చర్యలకు పార్లమెంటు ఆమోదం, తదనుగుణంగా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వులు ‘రాజ్యాంగవిరుద్ధం’ అని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజననూ ‘రాజ్యాంగ విరుద్ధం’గా ప్రకటించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
2019-08-10 Read Moreఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్స్ అందాయి. ఆయనను చంపుతామని బెదిరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికే బెదిరింపు రావడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. సిఎంను చంపుతామన్న బెదిరింపులతో జూలై 25, 30 తేదీల్లో రెండు ఇ మెయిల్స్ అందినట్టు పోలీసులు చెప్పారు. సిఎంఒ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ స్పెషల్ యూనిట్ ఐపిసి సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసింది.
2019-08-02 Read Moreఉన్నావో (యూపీ) గ్యాంగ్ రేప్ బాధితురాలు, ఆమె కుటుంబంపై జరిగిన నేరాలకు సంబంధించిన ఐదు కేసులను సుప్రీంకోర్టు లక్నో సీబీఐ కోర్టు నుంచి ఢిల్లీ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. బాధితురాలికి మధ్యంతర భృతిగా రూ. 25 లక్షలు ఇవ్వాలని, సి.ఆర్.పి.ఎఫ్. భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులను రోజువారీగా విచారించి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
2019-08-01 Read More