తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్యకు సంబంధించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)పైన కేసు నమోదైంది. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు ఎమ్మెల్యే సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు పెద్దాపురం డి.ఎస్.పి. శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రజ్యోతి తొండంగి మండల విలేకరి సత్యనారాయణ మంగళవారం రాత్రి తుని మండలం ఎస్. అన్నవరం వద్ద హత్యకు గురైన విషయం తెలిసిందే.

2019-10-17

పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. పాట్నా హైకోర్టులో రెండవ సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ రాకేశ్ కుమార్ న్యాయవ్యవస్థలో అవినీతి, అక్రమాలపై గత ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. హైకోర్టులో అవినీతి ‘ఓపెన్ సీక్రెట్’ అని, జడ్జిలకు న్యాయాన్ని అందించడంకంటే అధికారాలను అనుభవించడంపైనే శ్రద్ధ ఎక్కువని రాకేశ్ కుమార్ ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో బదిలీ కావడం గమనార్హం.

2019-10-17 Read More

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. బుధవారంతో వాదనలు ముగిశాయి. లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించడానికి మరో మూడు రోజులు గడువు ఇచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసే (నవంబర్ 17వ తేదీ) లోగా అయోధ్య వివాదంపై తీర్పు ఇవ్వాలన్న నిశ్చయం సుప్రీంకోర్టులో కనిపిస్తోంది. అందుకే రోజువారీ విచారణ చేపట్టి 40 రోజుల్లో వాదనలు విన్నది.

2019-10-16 Read More

‘‘మేఘ’’ కంపెనీకి సంబంధించిన సోదాల్లో భాగంగా... ఆదాయ పన్ను శాఖ అధికారులు హైదరాబాద్ బాలానగర్ ఆంధ్రా బ్యాంకులోని లాకర్ల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత శుక్రవారం ‘మేఘ’లో మొదలైన సోదాలు మంగళవారం వరకు కొనసాగాయి. బాలానగర్ లోని కంపెనీ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న ఆంధ్రా బ్యాంకు బ్రాంచిలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. రూ. 2,45,31,160 విలువైన బంగారు ఆభరణాలకు బ్యాంకు అధికారులు లెక్క చెప్పకపోవడంతో...‘మేఘ’ పేరుతో సీజ్ చేశారు.

2019-10-15 Read More

తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రజ్యోతి తొండంగి అర్భన్ విలేకరిగా పని చేస్తున్న కాతా సత్యనారాయణ మంగళవారం హత్యకు గురయ్యారు. తుని మండలం ఎస్ అన్నవరం వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో గుర్తు తెలియని దుండగులు కత్తితో నరికి పరారయ్యారు. సత్యనారాయణ ఇంటికి సమీపంలోనే ఈ హత్య జరిగింది.

2019-10-15

ఒంగోలు ‘ట్రిపుల్ ఐటి’లో బొల్లికొండ లహరి అనే విద్యార్థిని మంగళవారం కళాశాల భవనంపైనుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. లహరి తుంటి ఎముక, వెన్ను, తలకు తీవ్ర గాయాలయ్యాయని ప్రాథమిక సమాచారం. సెలవులకు ఇంటికి వెళ్లి సోమవారమే తిరిగి వచ్చిన లహరి, ఇంతలోనే ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమేమిటో తెలియరాలేదు. కృష్ణ జిల్లా విస్సన్నపేటకు చెందిన లహరి ఒంగోలు ట్రిపుల్ ఐటిలో మొదటి సంవత్సరం చదువుతోంది.

2019-10-15

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ ఉద్ఘాటించారు. కేసులో విచారణ సమర్థవంతంగా, సక్రమంగా జరుగుతోందన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో పాల్గొన్న డీజీపీ, రాజకీయ నాయకులు ఆరోపణలను తాము పట్టించుకోబోమని, పోలీసు శాఖ తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం బాగా తగ్గిందని అభిప్రాయపడ్డారు.

2019-10-15

ఆర్టీసీ సమస్య యాజమాన్యం, కార్మికుల మధ్య మాత్రమే కాదని... అది ప్రజల సమస్యగా మారిందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. సుమారు 4 వేల బస్సులు నడకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసింది. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది. సమ్మెపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు చేపట్టింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వాన్ని...‘మరి విద్యా సంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారు’ అని ప్రశ్నించింది.

2019-10-15

అయోధ్య రామమందిరం-బాబరీ మసీదు భూ యాజమాన్య హక్కుల వివాదంపై సుప్రీంకోర్టులో రోజువారీ హియరింగ్ బుధవారంతో ముగియనుంది. ఈ విషయాన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మంగళవారం స్వయంగా వెల్లడించారు. అక్టోబర్ 17 లోగా హియరింగ్ ముగించి... తన రిటైర్మెంట్ లోగా తీర్పు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి భావిస్తున్నట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి. జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు జడ్జిల బెంచ్ గత రెండు నెలలుగా రోజువారీగా ఈ కేసును విచారిస్తోంది.

2019-10-15

చిత్రనిర్మాతలు శ్యామ్ బెనెగల్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా 50 మంది ప్రముఖులపై నమోదైన దేశద్రోహం కేసును బీహార్ పోలీసులు ఉపసంహరించారు. గతవారం ముజఫరాపూర్ పోలీసులు సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఆ కేసును మూసివేయాలని సదరు పోలీస్ స్టేషన్ కు ఆదేశాలు జారీ చేశామని, ముగింపు నివేదికను కోర్టుకు సమర్పిస్తామని ముజఫరాపూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సిన్హా బుధవారం తెలిపారు.

2019-10-09 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page