సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నమోదు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం పక్కన పెట్టింది. మరే ఇతర కేసులోనూ కస్టడీలో ఉండాల్సిన అవసరం లేకపోతే చిదంబరాన్ని వెంటనే విడుదల చేయాల్సి వుంటుంది. అయితే, ఐఎన్‌ఎక్స్ మీడియాపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నమోదు చేసిన వేరొక కేసుకు సంబంధించి చిదంబరం ప్రస్తుతం ఆ ఏజన్సీ అదుపులో ఉన్నారు.

2019-10-22 Read More

అక్టోబరు 5 నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతం చెల్లించకుండా నిలిపివేసిన ప్రభుత్వం, సోమవారం కోర్టులో అందుకు ఊహించని కారణం చెప్పింది. ఆర్టీసీ వద్ద కేవలం రూ. 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని, అందరికీ జీతాలు చెల్లించాలంటే రూ. 224 కోట్లు అవసరమని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. పూర్తిగా పని చేసిన నెలకు వేతనం ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తున్నందున ప్రభుత్వం ఆర్థిక కారణాన్ని ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.

2019-10-21

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు అత్యంత ఆప్తులుగా చెలామణి అవుతున్న మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) అధిపతులు ఐ.టి.కి చిక్కారు. హవాలా మార్గాల ద్వారా ఈ కంపెనీ వందల కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్టు ఐటీ శాఖ గుర్తించింది. కంపెనీ పేరు వెల్లడించకుండా ఆదాయపన్ను శాఖ విడుదల చేసిన ప్రకటనలో ‘‘మేఘ’’ భాగోతాన్ని చూచాయగా వెల్లడించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, హైడ్రోకార్బన్స్, విద్యుత్ రంగాల్లో ఉన్న ‘ఓ ప్రముఖ గ్రూపు’ సంస్థల్లో రూ. 17.4 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఐ.టి. తెలిపింది.

2019-10-19 Read More

ఐ.ఎన్.ఎక్స్. మీడియా కేసులో సీబీఐ శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ సహా 14 మంది పేర్లను అందులో చేర్చింది. ఈ వ్యవహారం సోమవారంనాడు ప్రత్యేక జడ్జి కుహార్ ఎదుటకు రానుంది.

2019-10-18

అస్సాంలో ఎన్.ఆర్.సి. సవరణను పర్యవేక్షించిన ప్రతీక్ హజేలాను అత్యవసరంగా అంతర్రాష్ట్ర కేడర్ బదిలీ కింద మధ్యప్రదేశ్ పంపాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ బదిలీకి కారణం ఏమిటో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించలేదు. అయితే, ఎన్.ఆర్.సి. ప్రచురించాక హజేలా ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతోనే ఈ అదేశం ఇచ్చినట్టు చెబుతున్నారు. ‘‘బదిలీకి నిర్ధిష్టమైన కారణం ఉందా’’ అని అటార్నీ జనరల్ ప్రశ్నించినప్పుడు, ‘‘ఏ ప్రాతిపదికా లేకుండా ఏదైనా ఉత్తర్వు ఇస్తారా’’ అని సీజే ఎదురు ప్రశ్నించారు.

2019-10-18 Read More

సుప్రీంకోర్టు ప్రస్తుత సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ ఎస్ఎ బోబ్డే తదుపరి ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. బాబ్డేను తన వారసుడిగా సిఫారసు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కేంద్రానికి లేఖ పంపారు. పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి తన తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సిఫారసు చేయడం ఆనవాయితీ. 2018 అక్టోబర్ 3న 46వ సీజేగా ప్రమాణం చేసిన జస్టిస్ గొగోయ్, నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. బాబ్డే పదవీ కాలం 2021 ఏప్రిల్ 23వరకు ఉంది.

2019-10-18

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరో కేసులో చిక్కుకున్నారు. ఐల్యాబ్స్ ఉద్యోగి పేరిట నకిలీ మెయిల్ సృష్టించారని పోలీసులు నిర్ధారించారు. మెయిల్ సృష్టించడానికి వినియోగించిన ఐపి అడ్రస్ ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూకట్ పల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రవిప్రకాశ్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉన్న రవిప్రకాశ్ ను పీటీ వారంట్ పై పోలీసులు కోర్టుకు తెచ్చారు. తాజా కేసులో రిమాండ్ తర్వాత మళ్ళీ చంచల్ గూడ జైలుకు తరలించారు.

2019-10-17

సమాచార హక్కు చట్టానికి ఇటీవల చేసిన సవరణలు తిరోగమన చర్యగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు. ఆ సవరణలు చట్టం అమలును ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. సతార్క్ నాగరిక్ సంఘటన్ (ఎస్ఎన్ఎస్) అనే పౌర సంస్థ ఆర్టీఐ చట్టం వచ్చి 14 సంవత్సరాలు గడచిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లోకూర్ మాట్లాడారు. ఈ ఏడాది జూలైలో జరిగిన సవరణల ప్రకారం... కేంద్ర, రాష్ట్రాల సమాచార కమిషనర్ల పదవీ కాలం, జీతాలు, ఇతర నిబంధనలను నిర్దేశించే అధికారం కేంద్రానికి దఖలు పడింది.

2019-10-17 Read More

మేఘాలయ, జార్ఖండ్, మద్రాస్, మధ్యప్రదేశ్, పాట్నా హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మహ్మద్ రఫీక్ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవిరంజన్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మిగిలిన ముగ్గురూ ప్రధాన న్యాయమూర్తుల హోదాలో ఉన్నవారినే బదిలీ చేశారు.

2019-10-17 Read More

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరమ్‌ను అక్టోబర్ 24 వరకు పోలీసు కస్టడీకి రిమాండ్ చేస్తూ ప్రత్యేక సిబిఐ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన కేసులో కూడా చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంకు 14 రోజుల రిమాండ్ విధించాలని ఇడి కోరింది.

2019-10-17 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page