తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన హుజూర్ నగర్ నియోజకవర్గానికి రూ. 100 కోట్ల మేరకు ప్రత్యేక నిధులను కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న ఆర్టీసీకి రూ. 47 కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రజల అవసరాన్ని తీర్చే ఆర్టీసీకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ స్పందించాలని హైకోర్టు ఆదేశించింది.
2019-10-29భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయడానికి ఇంకా 19 రోజులే (నవంబర్ 17వరకు) సమయం ఉంది. అయితే, అందులో సుప్రీంకోర్టు పని దినాలు కేవలం 8. ఆ రోజుల్లోనే బాబ్రీ మసీదు-రామజన్మభూమి భూ వివాదం, శబరిమల, రాఫేల్ ఒప్పందం సహా 5 కీలక అంశాలపై తీర్పులు వెలువడాల్సి ఉంది. వీటిని జస్టిస్ రంజన్ గొగోయ్ ఇస్తారని సమాచారం. ప్రస్తుతం దీపావళి సెలవుల్లో ఉన్న సుప్రీంకోర్టు నవంబర్ 4న పున:ప్రారంభం అవుతుంది.
2019-10-29 Read Moreగంజాయి పంటకు, అమ్మకాలకు విశాఖపట్నం ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది. తాజాగా విశాఖ జిల్లా కశింకోట మండలం తాళ్ళపాలెం గ్రామంలో పోలీసులు 561 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 11.25 లక్షలు ఉంటుందని ప్రాథమిక సమాచారం.
2019-10-26బుధవారం ఉదయమే ఒక షాకింగ్ వార్తతో ఇంగ్లండ్ నిద్ర లేచింది. ఎసెక్స్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఒక ట్రక్కు కంటైనర్ లోపల 39 మృతదేహాలను కనుగొన్నారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. ఈ షాకింగ్ సంఘటనను "సంపూర్ణ విషాదం"గా పోలీసు అధికారి పిప్పా మిల్స్ వ్యాఖ్యానించారు. మరణించినవారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. "బాధితుల గుర్తింపే మా ప్రథమ ప్రాధాన్యతాంశం" అని ఆమె చెప్పారు. ఈ కంటైనర్ బల్గేరియా నుంచి గత శనివారం ఇంగ్లండ్ లోకి ప్రవేశించినట్టు గుర్తించారు.
2019-10-23ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతిపై సీబీఐ పెట్టిన కేసులో చిదంబరానికి మంగళవారం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. అయితే, ఆయన ఈడీ కేసులో అక్టోబర్ 17 నుంచి కస్టడీలో కొనసాగుతున్నారు. ఈ కేసులో కూడా బెయిలు వస్తేనే చిదంబరం విడుదలవుతారు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆగస్టు 21న సిబిఐ ఆయనను అరెస్టు చేసింది.
2019-10-23మానభంగాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఎన్.సి.ఆర్.బి. తాజాగా విడుదల చేసిన 2017 నేర గణాంకాల ప్రకారం ఆ రాష్ట్రంలో మానభంగాల బాధిత మహిళల సంఖ్య 5599. 2017లో మానభంగానికి గురై ఫిర్యాదు చేసిన మహిళల సంఖ్య ఉత్తరప్రదేశ్ లో 4669, రాజస్థాన్ లో 3319 మంది, ఒడిషాలో 2082 మంది, అస్సాంలో 2048 మంది, కేరళలో 2035 మంది, మహారాష్ట్రలో 1945 మంది, చత్తీస్ గఢ్ రాష్ట్రంలో 1926 మంది, ఢిల్లీలో 1231 మంది, హర్యానాలో 1104 మంది, పశ్చిమ బెంగాల్ లో 1084 మంది, ఆంధ్రప్రదేశ్ లో 1005.
2019-10-222017లో దేశవ్యాప్తంగా లైంగిక వేధింపుల బారిన పడినట్టు ఫిర్యాదు చేసిన మహిళల సంఖ్య 21,512. కేసుల సంఖ్య 20,948. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ బాధితుల సంఖ్యలో 4వ స్థానంలోనూ, కేసుల సంఖ్యలో 5వ స్థానంలోనూ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో (6,151 మందితో) అగ్ర స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్ (2985), మహారాష్ట్ర (2942), ఆంధ్రప్రదేశ్ (1146మంది), ఒడిషా (1134) ఉన్నాయి. షెల్టర్ హోమ్స్ లో లైంగిక వేధింపుల కేసులు ఉత్తర ప్రదేశ్ (239) తర్వాత ఏపీలోనే ఎక్కువ (70)గా నమోదయ్యాయి.
2019-10-22ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ నేరాల రేటు తెలంగాణ రాష్ట్రంలో బాగా ఎక్కువగా ఉంది. ఈ కేటగిరిలో రాజస్థాన్ 28.5 రేటుతో దేశంలోనే తొలి స్థానంలో ఉంటే తెలంగాణ 27.3 రేటుతో రెండో స్థానంలో నిలిచింది. జాతీయ సగటు నేరాల రేటు 9.7 శాతంగా ఉంటే సోదర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంత కంటే ఎక్కువ (10.5) రేటుతో ముందుంది. ఎన్.సి.ఆర్.బి. 2017 నేర గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 1,35,134 ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 12,532 కేసులు, రాజస్థాన్ లో 21,306 కేసులు నమోదయ్యాయి.
2019-10-22దేశంలో నేరాల సంఖ్య, నమోదవుతున్న కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. 2017లో నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 50 లక్షలు దాటింది (50,07,044). అందులో ఐపిసి కేసులు 30,62,579 కాగా ప్రత్యేక, స్థానిక చట్టాల పరిధిలో నమోదనవి మరో 19,44,465. నేరాల సంఖ్యలో గ్రోత్ 3.6 శాతంగా ఉన్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) తాజా నివేదికలో పేర్కొంది. క్రైమ్స్ ఇన్ ఇండియా 2017 నివేదిక ప్రకారం 2016లో నమోదైన కేసులు 48,31515. తర్వాత ఏడాదికి సుమారు 2 లక్షలు పెరిగాయి.
2019-10-22దేశంలో పిల్లలపై నేరాలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2017లో పిల్లలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 1,29,032 కేసులు నమోదయ్యాయి. 2015లో 94,172 కేసులు, 2016లో 1,06,958 కేసుల నుంచి ఇది అసాధారణ పెరుగుదల. పిల్లలపై నేరాల రేటు 2016లో లక్ష మందికి 24 నుంచి 2017లో 28.9కి పెరగడం ఆందోళన కలిగించే పరిణామం. 2017 గడచిపోయి రెండు సంవత్సరాలు అవుతుండగా ఎన్.సి.ఆర్.బి. అసాధారణ ఆలస్యం తర్వాత నివేదికను విడుదల చేసింది.
2019-10-22