అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం ఉదయం 10:30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపిన విషయం తెలిసిందే. 40 రోజుల పాటు నిత్యం చేపట్టిన హియరింగ్ ఈ నెల 16న ముగిసింది. ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసే (17వ తేదీ) లోపు ఈ వివాదంపై తీర్పు ఇవ్వాలనే కృత నిశ్చయంతో త్వరితగతిన విచారణను ముగించారు.
2019-11-08ఆర్టీసీపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో... తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు క్షమాపణ చెప్పారు. రికార్డులను పూర్తిగా పరిశీలించాక తాజా నివేదిక ఇచ్చామని రామకృష్ణారావు చెప్పడంతో... ఇంతకు ముందు నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా? అని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటుకు మన్నించాలని రామకృష్ణారావు కోరగా... క్షమాపణలు చెప్పడం తమ ప్రశ్నలకు సమాధానం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
2019-11-07ఆర్టీసీపై అధికారులు సమర్పించిన రెండు నివేదికల్లో పొంతన లేని లెక్కలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టారంటూ తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కె. జోషి మాట్లాడుతూ... హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం తాను ఇదివరకు పని చేసిన రాష్ట్రాల్లో చూడలేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం విచారణకు రామకృష్ణారావుతో పాటు ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మ హాజరయ్యారు.
2019-11-07తెలంగాణ సమాజం ఉలికిపడే స్థాయిలో సోమవారం ఓ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని తన కార్యాలయంలోనే సజీవ దహనం చేశాడు ఓ దుండగుడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం పెట్రోలు తెచ్చిన ఆ వ్యక్తి కొద్దిసేపు వాగ్వివాదం తర్వాత ఆమెపై పోసి నిప్పంటించినట్టు సమాచారం. దుండగుడు తనకూ నిప్పంటించుకున్నట్టు చెబుతున్నారు. మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి బాధతో పరుగెడుతూ బయటకు వచ్చి తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయారు. హంతకుడిని బుర్ర సురేష్ గా గుర్తించారు.
2019-11-04దొంగ నోట్లను ముద్రించడానికి వీల్లేకుండా కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రూ. 2000 నోట్లు విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం చెప్పింది. అయితే, ఇప్పుడు అదే రూ. 2000 నకిలీ నోట్లు మెరుగైన నాణ్యతతో భారీగా మార్కెట్ లోకి వస్తున్నాయి. తాజాగా ఖమ్మంలో రూ. 7 కోట్ల మేరకు దొంగ నోట్లు పట్టుబడ్డాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చెలామణి చేస్తున్న ముఠాలోని ఐదుగురిని పట్టుకున్నట్టు ఖమ్మం నగర పోలీసు కమిషనర్ ఇక్బాల్ శనివారం వెల్లడించారు.
2019-11-02ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఆయన ముఖ్యమంత్రి అయినా కోర్టుకు హాజరు కావలసిందేనని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించారని సీబీఐ కేసులు నమోదు చేసింది. ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ తో ఏకీభవించిన కోర్టు, జగన్ విన్నపాన్ని కొట్టేసింది.
2019-11-01ఇండియాలో ప్రభుత్వంపట్ల విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్న 1400 మంది జర్నలిస్టులు, యాక్టివిస్టుల వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయిన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రోజే మరో కీలకమైన అంశం వెలుగు చూసింది. 5 ఖండాల్లోని 20 దేశాల్లో ఉన్నత స్థాయి ప్రభుత్వ, మిలిటరీ అధికారుల ఫోన్ల సమాచారాన్ని తస్కరించడానికి... వారి వాట్సాప్ అకౌంట్లలోకి ‘హ్యాకింగ్ సాఫ్ట్ వేర్’ను చొప్పించినట్టు తేలింది. ఈ దేశాల్లో ఎక్కువ అమెరికా మిత్రులేనని చెబుతున్నారు.
2019-11-01 Read Moreపోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ విషయంలో ఆగస్టులో ఇచ్చిన స్టేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది. దీంతో కొత్త కాంట్రాక్టరు నిర్మాణ పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ హయాంలో తమతో చేసుకున్న ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టులో రద్దు చేయడంతో నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం రద్దు నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు, విద్యుత్ కేంద్రం పనులను థర్డ్ పార్టీకి అప్పగించే ప్రక్రియ చేపట్టవద్దని ఆగస్టు 22వ తేదీన ఆదేశించింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను ఇప్పుడు రద్దు చేసింది.
2019-10-31‘నిర్భయ’పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరణశిక్షకు గురై తీహార్ జైలులో ఉన్న దోషులను త్వరలో ఉరి తీయనున్నట్టు అధికారులు తెలిపారు. ఆ కేసులోని నలుగురు ముద్దాయిలలో ముగ్గురు తీహార్ జైలులోనే ఉండగా మరొకరు మండోలీ జైలులో ఉన్నారు. కింది కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఖరారు చేయడంతో దోషులు క్షమాబిక్షకు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో మరణ శిక్ష అమలు చేయనున్నట్టు దోషులకు ఈ నెల 28న తెలియజేశామని జైలు అధికారులు గురువారం వెల్లడించారు.
2019-10-31విశాఖపట్నంలో జరిగిన భూకుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిధిని విస్తరించాలని తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ...గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం చుట్టుప్రక్కలే కాకుండా యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేటల్లో కూడా కుంభకోణాలు జరిగాయని చెప్పారు. ఈ విషయమై ప్రజల విజ్ఞప్తిని సిఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
2019-10-31