తెలంగాణ సామూహిక హత్యాచారం నిందితుల సామూహిక ‘‘ఎన్కౌంటర్’’పై జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది. శనివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బృందం సభ్యులు మహబూబ్ నగర్ వెళ్లి నిందితుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం చీకటిపడే సమయానికి చటాన్ పల్లి వద్ద ‘‘ఎన్కౌంటర్’’ జరిగిన ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణులతో చర్చించిన సభ్యులు, ‘‘ఎన్కౌంటర్’’ జరిగిన తీరుపై పోలీసులను ప్రశ్నించినట్టు సమాచారం.

2019-12-07

సామూహిక మానభంగానికి పాల్పడ్డ నిందితుల చేతుల్లోనే సజీవ దహనానికి గురైన బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ పట్టణంలో గత ఏడాది సామూహిక మానభంగానికి గురైన మహిళ... ఈ గురువారం ఆ కేసు విషయమై కోర్టుకు వెళ్తుండగా నిందితులే కిరోసిన్ పోసి నిప్పంటించారు. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు కాల్చి చంపిన రోజే ఉన్నావ్ బాధితురాలు మరణించడంతో సామాజిక మాథ్యమాల్లో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

2019-12-07

వెటర్నరీ వైద్యురాలిపై ఆత్యాచారం చేసి హత్యగావించిన నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపడంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు... నిందితుల మృతదేహాలను ఈ నెల 9వ తేదీవరకు భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. మృతదేహాలకు మహబూబ్ నగర్ లో పోస్టు మార్టం జరుగుతున్నట్టు అడ్వకేట్ జనరల్ చెప్పగా, ఆ సమయంలో చిత్రీకరించే వీడియోను ప్రిన్సిపల్ జిల్లా జడ్జికి అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.

2019-12-06

హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను కాల్చి చంపిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి) స్పందించింది. స్వతహాగా విచారణ చేపట్టింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు ‘‘ఎన్కౌంటర్’’లో మరణించడం తీవ్రంగా పరిగణించదగిన అంశంగా కమిషన్ అభిప్రాయపడింది. ఒక ఎస్.ఎస్.పి. నాయకత్వంలో బృందాన్ని తక్షణమే హైదరాబాద్ ఎన్కౌంటర్ ప్రదేశానికి విచారణ నిమిత్తం పంపాలని కమిషన్ డైరెక్టర్ జనరల్ కు సూచించింది.

2019-12-06

ఊహించినట్టుగానే హైదరాబాద్ గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు కాల్చి చంపారు. బాధితురాలి శవాన్ని కాల్చి మసి చేసిన ప్రదేశంలోనే శుక్రవారం వేకువజామున నిందితులనూ చంపేశారు. నేరం జరిగిన తీరును విచారించేందుకు నిందితులను అక్కడకు తీసుకెళ్లినప్పుడు పారిపోవడానికి ప్రయత్నించి తమపైనే దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే, ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి పోలీసులు ఎన్ కౌంటర్ చేశారనే అభిప్రాయమే సర్వత్రా ఉంది.

2019-12-06

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ పట్టణంలో మరో ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా నిందితులు ఆమెను అడ్డగించి కత్తులతో పొడిచి నిప్పంటించారు. ఒంటి నిండా మంటలతోనే కిలోమీటర్ దూరం పరుగెత్తిన బాధితురాలు, కాలిపోతూనే 112కి ఫోన్ చేసింది. పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం చేసిన నిందితుడు గత ఏడాది ఇదే నెలలో అరెస్టయి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. తనపై అత్యాచారం చేసిన శివం త్రివేది, శుభం త్రివేది సహా ఐదుగురి పేర్లను బాధితురాలు మేజిస్ట్రేట్ కు చెప్పినట్టు సమాచారం.

2019-12-05 Read More

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బుధవారం తీహార్ జైలునుంచి బెయిలుపై విడుదలయ్యారు. చిదంబరంపైన సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ‘‘నేను కేసుపై మాట్లాడలేను. కోర్టు ఆదేశాలను పాటిస్తాను. కానీ, నిజం ఏమిటంటే... 106 రోజుల నిర్భంధం తర్వాత కూడా నాపై ఒక్క నేరారోపణా లేదు’’ అని చిదంబరం తీహార్ జైలు వద్ద మీడియాతో వ్యాఖ్యానించారు. జైలునుంచి విడుదలైన చిదంబరానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా నివాసానికి వెళ్ళారు.

2019-12-04 Read More

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు ఉపసంహరించింది. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అన్న రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు ఆ విషయాన్ని నిర్ధారించినట్టుగా పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, తర్వాత రాహుల్ క్షమాపణ చెప్పారు. అయినా అప్పట్లో కోర్టు శాంతించలేదు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా ఆ క్షమాపణను గుర్తు చేస్తూ ఇక చర్యలు అవసరం లేదని అభిప్రాయపడింది. జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది.

2019-11-14

36 రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అక్రమాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. గతంలో తమ వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ 2018 డిసెంబరు14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విన్నవించారు. అయితే, ఆ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొట్టిపారేసింది. రాఫేల్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

2019-11-14

అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని నిర్మోహీ అఖాడా, సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా విరాజ్ మాన్ లకు సమంగా పంచాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్మోహీ అఖాడా వ్యాజ్యానికి కాలం చెల్లిందన్న సుప్రీంకోర్టు, రాముడికి ప్రతీకగా కక్షిదారుల జాబితాలో ఉన్న ‘రామ్ లల్లా విరాజ్ మాన్’కు ఆ భూమి చెందుతుందని శనివారం తీర్పు చెప్పింది. మసీదు స్థలంపై తమ హక్కులకు సంబంధించి ముస్లింలు ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొంది.

2019-11-09
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page