వ్యక్తిగత హాజరు నుంచి మినహాయంపు ఇవ్వడానికి సీబీఐ కోర్టు గత వారం నిరాకరించడంతో ఈ శుక్రవారం కోర్టుకు వచ్చిన జగన్, మరోసారి మినహాయింపు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విన్నపాన్ని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యతిరేకించింది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వరాదని వాదించింది. ఈ అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 24న వెలువరించనుంది. అప్పటివరకు మరో రెండుసార్లు జగన్ కోర్టుకు హాజరు కాక తప్పదు.
2020-01-10అక్రమ ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. సిఎం అయ్యాక ఆయన కోర్టుకు రావడం ఇదే తొలిసారి. వ్యక్తిగత హాజరు నుంచి పదే పదే మినహాయింపు కోరిన జగన్ 30 వారాల పాటు కోర్టు హాజరు కాలేదు. ఇక మినహాయింపులు కుదరవని గత వారం కోర్టు స్పష్టం చేసింది. దీంతో, వివిధ కేసుల్లో ఎ1గా ఉన్న జగన్, ఎ2గా ఉన్న విజయసాయిరెడ్డి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు.
2020-01-10సిఎఎ నిరసనల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస ఆగిన తర్వాతే అన్ని పిటిషన్లనూ వింటామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. చట్టం రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకటించాలన్న విన్నపంపై అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు, చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 60 పిటిషన్లతో దీన్నీ కలిపి విచారిస్తామని పేర్కొంది. సిఎఎకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు ఈ నెల 22వ తేదీకి పోస్టయ్యాయి.
2020-01-10 Read Moreబలమైన సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తే జస్టిస్ బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయా మృతిపై మళ్ళీ దర్యాప్తు చేయించే అంశాన్ని పరిశీలిస్తామని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. మాలిక్ ఎన్.సి.పి. నేత. 2014 డిసెంబర్ 1న జస్టిస్ లోయా అనుమానాస్పదంగా మరణించారు. ఆ సమయంలో లోయా విచారిస్తున్న సోహ్రాబుద్ధీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిందితుడు. 2014 మే నెలలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక లోయా ఒత్తిడిని ఎదుర్కొన్నారు.
2020-01-09సవరించిన పౌరసత్వ చట్టాన్ని రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకటించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. ‘‘నేను మొదటిసారి ఇలాంటి విన్నపాన్ని వింటున్నాను. కోర్టు.. ఓ చట్టం చెల్లుబాటును నిర్ణయించాలి. రాజ్యాంగబద్ధమని ప్రకటించడం కాదు’’ అని సీజే జస్టిస్ బాబ్డే స్పష్టం చేశారు. దేశం కిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు శాంతికోసం అంతా ప్రయత్నించాలని, అందుకు ఇలాంటి పిటిషన్లు దోహదపడవని ఆయన వ్యాఖ్యానించారు.
2020-01-09 Read More‘భారతదేశం స్త్రీలను దేవతలుగా పూజించే పుణ్యభూమి’. ఇది చెప్పుకోవడం వరకు బాగానే ఉంది. కానీ, అత్యాచారాలకు కొదవలేదు. 2018లో రోజుకు 91 చొప్పున మానభంగాలు జరిగినట్టు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్.సి.ఆర్.బి) గురువారం వెల్లడించింది. ఈ లెక్క కేవలం అధికారికంగా నమోదైన కేసులకు సంబంధించినదే. పోలీసు స్టేషన్ల వరకూ రానివి ఎన్నో తెలియదు. 2018లో రోజుకు 291 అపహరణలు, 80 హత్యలు జరిగాయి.
2020-01-09భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు తక్షణం వైద్య సాయం అందించాలని ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజస్ట్రేట్ ఆరుల్ వర్మ బుధవారం తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. ఆజాద్ డిసెంబర్ 21 నుంచి జైలులో ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించినందుకు ఆయనను అరెస్టు చేశారు. రక్త సంబంధ వ్యాధితో బాధపడుతున్న తాను ఢిల్లీ ‘ఎయిమ్స్’లో వైద్యం చేయించుకోవలసి ఉందని ఆజాద్ వేసిన పిటిషన్ ను పరిశీలించిన జడ్జి తక్షణ వైద్యానికి ఆదేశించారు.
2020-01-08 Read Moreఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో చెప్పిన విధంగా..జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మార్చి 3వ తేదీలోపు ముగించాలని కోర్టు నిర్దేశించింది. స్థానిక సంస్థల్లో 59.85 రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
2020-01-082012లో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ ‘నిర్భయ’ సామూహిక మానభంగం కేసులో నలుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. ముఖేష్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలను జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని ఆదేశించింది. బాధితురాలి తల్లి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య విద్యార్ధిని మానభంగం చేసి క్రూరంగా హింసించినవారికి ఏడేళ్ళ తర్వాత శిక్ష అమలు కాబోతోంది.
2020-01-07 Read Moreహాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. శ్రావణి హత్య కేసులో ఫోక్సో కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిందితుడు శ్రీనివాసరెడ్డి ఉరిశిక్షకు అన్ని విధాలా అర్హుడని బాధితుల తరపు లాయర్ వాదించారు. చిన్నపిల్లలతో అమానుషంగా ప్రవర్తించినవారిపై జాలి, దయ చూపించాల్సిన అవసరం లేదని, సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష విధించాలనే చెప్పిందని న్యాయవాది అన్నారు. రేపు మనీషా, కల్పన కేసులో కోర్టు వాదనలు విననుంది.
2020-01-06