స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 59.85 శాతానికి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ బిర్రు ప్రతాపరెడ్డి, బి.సి. రామాంజనేయులు పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీ హైకోర్టులో ఈ అంశంపై పెండింగులో ఉన్న పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
2020-01-15భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బెయిలు దరఖాస్తును వ్యతిరేకించిన ప్రభుత్వ న్యాయవాదిపై ఢిల్లీ తీస్ హజారీ కోర్టు మండిపడింది. నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగమని జస్టిస్ కామిని లా స్పష్టం చేశారు. ప్రార్ధనా స్థలం వెలుపల నిరసనకు అనుమతి లేదని న్యాయవాది చెప్పగా ‘‘మీరు రాజ్యాంగం చదివారా? జామియా మసీదు పాకిస్తాన్లో ఉందన్నట్టు ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్నో ఉన్నా కూడా, అక్కడికీ వెళ్లి నిరసన తెలపొచ్చు. అదీ ఒకప్పుడు ఉమ్మడి దేశంలో భాగం’’ అని జడ్జి పేర్కొన్నారు.
2020-01-14డెన్మార్క్ అంటే గుర్తుకొచ్చే అంశాల్లో రాజధాని కోపెన్‌హాగన్‌లోని ‘లిటిల్ మెర్మైడ్’ ఒకటి. ఆ విగ్రహం నిలిపి ఉన్న రాయిపై ఈ రాత్రి రాజకీయ నినాదాలు రాయడం పెద్ద వార్త అయింది. గుర్తు తెలియని వ్యక్తులు ‘‘ఫ్రీ హాంకాంగ్’’ నినాదాన్నిరాయిపై ఎర్ర రంగుతో రాశారు. ఈ మత్స్యకన్య విగ్రహాన్ని డెన్మార్క్ వాసులు అపురూపంగా చూసుకుంటారు. చైనా టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అందుకే హాంకాంగ్ ఉద్యమకారులు లక్ష్యంగా చేకుకొని ఉంటారని భావిస్తున్నారు.
2020-01-13 Read Moreవైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రతిపక్ష నేతలను బూతులు తిడితే అతని అనుచరులు ఏకంగా మహిళలపై కర్రలు, కట్టెలతో దాడికి ప్రయత్నించారు. రక్షించుకోవడానికి దేవాలయంలోకి వెళ్తే బయటకు రమ్మంటూ వీరంగం వేశారు. కాకినాడలో ఆదివారం కనిపించిన భీతావహ దృశ్యమిది. ద్వారంపూడి శనివారం ఓ బహిరంగ సభలో.. పవన్ కళ్యాణ్ లం.. పనులు చేస్తున్నాడంటూ బూతులు తిట్టారు. అందుకు నిరసనగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించినవారిపై అమానుషంగా దాడి చేశారు.
2020-01-12నిర్భయ సామూహిక మానభంగం కేసులో నిందితులను ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం నలుగురు నిందితుల నమూనాలతో ‘డమ్మీ ఉరి’ని పూర్తి చేశారు. ఇందుకోసం తుక్కు, రాళ్ళతో కూడిన గోతాలను ఉపయోగించారు. నిర్భయ కేసులో ముఖేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు ఉరి తీయవలసి ఉంది.
2020-01-12ప్రభుత్వ ఉద్యోగి ఓ ర్యాలీకి హాజరైనంత మాత్రాన... సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నట్లు కాదని త్రిపుర హైకోర్టు స్పష్టం చేసింది. త్రిపుర ఫిషరీస్ శాఖలో పని చేసిన లిపికా పాల్ అనే ఉద్యోగిని 2018 ఏప్రిల్ లో ఉద్యోగ విరమణ చేయడానికి ఐదు రోజుల ముందు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అందుకు చూపించిన కారణం ‘2017 డిసెంబర్ 31న ఆమె ఓ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం’. ప్రభుత్వ చర్యను లిపికా పాల్ న్యాయస్థానంలో సవాలు చేశారు.
2020-01-12 Read Moreచైనా అభివృద్ధి బ్యాంకు (సిడిబి) మాజీ ఛైర్మన్ ‘హు హుయిబాంగ్’ను ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ బహిష్కరించింది. పార్టీ, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిపై నిఘా పెట్టే సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ (సిసిడిఐ) శనివారం ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేసింది. హు తన స్థానాన్ని ఆర్థిక ప్రయోజనాలకోసం వాడుకున్నారని, నేరుగా... బంధువుల ద్వారా లంచాలు తీసుకున్నారని సిసిడిఐ నిర్ధారించింది. అతని అక్రమ ఆదాయాన్ని సీజ్ చేసి కేసును న్యాయస్థానాలకు అప్పగిస్తామని తెలిపింది.
2020-01-11ఒమన్ దేశపు సుల్తాన్ కబూస్ బిన్ సెయిద్ అల్ సెయిద్ (79) శనివారం మరణించారు. నాలుగు దశాబ్దాలపాటు పాలించిన కబూస్, చమురు సిరులతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. సుల్తాన్ తన వారసుడెవరో ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు ఒమన్ రాజధాని ‘మస్కట్’లో ఉత్కంఠ నెలకొంది. మిలిటరీ రంగంలోకి దిగింది. రాజ కుటుంబం సమావేశమై తదుపరి పాలకుడిని నిర్ణయించాలని ఒమన్ మిలిటరీ కోరినట్టు వార్తలు వచ్చాయి.
2020-01-11ఇంటర్నెట్ ద్వారా భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఇంటర్నెట్ మాథ్యమం ద్వారా భావ వ్యక్తీకరణ, వాణిజ్యం లేదా ఇతర వృత్తి బాధ్యతలు నిర్వర్తించే హక్కుకు 19(1)(ఎ), 19(1)(జి) అధికరణల కింద రాజ్యాంగ రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు ఎన్.వి. రమణ, సూర్యకాంత్, బి.ఆర్. గవాయ్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కాశ్మీర్లో ఇంటర్నెట్ నిలిపివేతపై విచారణ జరిపింది.
2020-01-10 Read Moreఏపీ సిఎం జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఒకటైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీటును కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, రిటైర్డ్ అధికారులు వీడీ రాజగోపాల్, శామ్యూల్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఉమ్మడి ఏపీలో పెన్నా సిమెంట్స్ కు గనుల కేటాయించినప్పుడు గనులు, రెవెన్యూ మంత్రులుగా సబిత, ధర్మాన పని చేశారు.
2020-01-10