ప్రభుత్వ భవనాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులను పులమడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో ఆయా రంగులను తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు పార్టీల రంగులు వేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు మందలించింది. తీసుకున్న చర్యలపై ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఎన్నికల్ కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిలను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

2020-01-28

సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న విన్నపాన్ని హైదరాబాద్ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి తిరస్కరించడంతో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు తన బదులు తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ న్యాయస్థానం తన పిటిషన్ ను తిరస్కరించడాన్ని హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై హైకోర్టు రేపు విచారించనున్నట్టు సమాచారం.

2020-01-27

తమ ఫోన్లు ట్యాప్ అయినట్టు రాజకీయ నేతలందరికీ తెలుసని, అందుకే ఆ విషయాన్ని ఎవరూ అంత తీవ్రమైనదిగా తీసుకోవడం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని గత ప్రభుత్వం ఎన్.సి.పి, కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేసిందని ప్రస్తుత హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపించిన నేపథ్యంలో పవార్ స్పందించారు. ‘‘ఇది కొత్తేం కాదు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు మా అందరికీ తెలుసు’’ అని పవార్ చెప్పారు.

2020-01-26

అమరావతి ప్రాంతంలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’కు సంబంధించి మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, తాడికొండ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బెల్లంకొండ నరసింహారావులపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. ఐపిసి 320, 506, 120బి సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. తన 99 సెంట్ల అసైన్డ్ భూమిని నరసింహారావు బలవంతంగా రాయించుకున్నారని వెంకటపాలెం మహిళ పోతురాజు బుజ్జి ఫిర్యాదు చేశారు.

2020-01-23

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వ వాదన వినకుండా స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం స్పందించడానికి 4 వారాలు సమయం ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ ఈ అంశాన్ని ఐదు వారాల తర్వాత మళ్ళీ విననుంది. రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం అవసరమా లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది.

2020-01-22

‘‘రెండు రోజుల్లో అడిగిన సొమ్ము ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు’’.. గుంటూరులో బ్యాంకు మోసం కేసును ఎదుర్కొంటున్న ఓ ప్రముఖుడికి సీబీఐ అధికారుల పేరిట వచ్చిన బెదిరింపు ఇది. సాక్షాత్తు ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం ఫోన్ నెంబరు (011-24302700) నుంచే కాల్ వచ్చినట్టుగా కనిపించడానికి హానికరమైన సాఫ్ట్ వేర్ ఉపయోగించారు. ఆ ఘరానా మోసగాళ్లు వై. మణివర్దన్ రెడ్డి (హైదరాబాద్), సెల్వం రామరాజ్ (మదురై)లను సీబీఐ అరెస్టు చేసింది.

2020-01-18 Read More

ఢిల్లీ సామూహిక మానభంగం కేసులో దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6:00 గంటలకు ఉరిశిక్ష విధంచాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. క్షమాబిక్ష కోసం ఓ దోషి పెట్టుకున్న పిటిషన్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించిన కొద్ది గంటల్లోనే కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరణకు, ఉరిశిక్ష అమలుకు మధ్య రెండు వారాల గడువు ఉండాలనే నిబంధన కారణంగా గత డెత్ వారంట్ లోని తేదీ (22)ని మార్చవలసి వచ్చింది.

2020-01-17

ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి రెండు అంశాలపై చేసిన విన్నపాలను సీబీఐ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అక్రమ ఆస్తుల కేసులో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లు అన్నిటినీ కలిపి విచారించాలని జగన్ మరోసారి అభ్యర్ధించారు. ఇందుకు నిరాకరించిన కోర్టు... వేర్వేరుగానే ఆ పిటిషన్లను విచారించాలని నిర్ణయించింది. సీబీఐ కేసుల విచారణ పూర్తయిన తర్వాతే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) కేసులను విచారించాలన్న మరో విన్నపాన్ని కూడా కోర్టు తిరస్కరించింది.

2020-01-17

2012 ఢిల్లీ సామూహిక మానభంగం కేసులో నిందితుడు ముఖేష్ క్షమాబిక్ష కోసం పెట్టుకున్న విన్నపాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో, ఉరిశిక్షను తప్పించుకోవడానికి నిందితులు చేసిన అన్ని ప్రయత్నాలూ ముగిశాయి. ఇక ఉరి తప్పదు. కోర్టు ఇచ్చిన డెత్ వారంట్ ప్రకారం ఈ నెల 22న నలుగురు నిందితులను తీహార్ జైలులో ఉరి తీయవలసి ఉంది. అయితే, క్షమాబిక్ష పిటిషన్ వల్ల ఉరి ఆలస్యం కానుంది.

2020-01-17

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు ఢిల్లీ తీస్ హజారీ కోర్టు బుధవారం బెయిలు మంజూరు చేసింది. ఓ నెల రోజులపాటు ఢిల్లీకి రావద్దని, ఆయన సొంత ప్రాంతం (యూపీలోని సహరాన్ పూర్)లో ఉండాలని న్యాయమూర్తి డాక్టర్ కామిని లా ఆదేశించారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి సమస్యా ఉండకూడదనే ఈ మాట చెబుతున్నట్టు జడ్జి పేర్కొన్నారు. సిఎఎ వ్యతిరేక ప్రదర్శన నిర్వహించినందుకు అరెస్టయిన, ఆజాద్ డిసెంబరు 21 నుంచి కస్టడీలో ఉన్నారు.

2020-01-15 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page