2018లో గురుగ్రామ్ జిల్లాలో ఓ జడ్జి భార్యను, కుమారుడిని కాల్చి చంపిన భద్రతాధికారి మహిపాల్ సింగ్ కు మరణశిక్ష పడింది. దోషికి మరణశిక్ష విధిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. హెడ్ కానిస్టేబుల్ మహిపాల్ సింగ్ గురుగ్రామ్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి క్రిష్ణకాంత్ శర్మకు భద్రతాధికారిగా పని చేశాడు. ఓ రోజు ఆయన జడ్జి భార్య రీతు శర్మ (38)తో గొడవపడ్డాడు. ఆమెను, కుమారుడు ధ్రువ్ శర్మ (18)ను కాల్చి చంపాడు. తనకు సెలవులు ఇవ్వకుండా వేధించారని, అవమానించారని ఆరోపించాడు.

2020-02-07

2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని వచ్చే మంగళవారం (ఫిబ్రవరి 11న) వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. నలుగురు దోషులు శిక్ష అమలులో జాప్యానికి చేస్తున్న ప్రయత్నాల (క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాబిక్ష విన్నపాలు)తో దేశం సహనం కోల్పోతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. విడివిడిగా ఉరి తీయాలన్న కేంద్ర విన్నపాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాయి.

2020-02-07

తల్లిని చంపి సోదరుడిని కత్తితో పొడిచి స్నేహితుడితో విహారానికి వెళ్లిన బెంగళూరు టెకీ అమృతా చంద్రశేఖర్ (33)ని బెంగళూరు పోలీసులు పోర్టు బ్లెయిర్ లో అరెస్టు చేశారు. సోమవారం వేకువజామున అమృత తన తల్లిని, తమ్ముడిని కత్తితో పొడిచింది. అప్పటికే 5 రోజుల అండమాన్ విహారానికి బ్యాగ్ సర్దుకొని ఉన్నఅమృత, ‘బాయ్ ఫ్రెండ్’ బైకుపై విమానాశ్రయానికి వెళ్లింది. ఉదయం 6.30 గంటల ఫ్లైట్లో పోర్టు బ్లెయిర్ వెళ్ళారు. కుటుంబ అప్పుల్లో ఉన్నందున అమృత ఒత్తిడికి గురైందని చెబుతున్నారు.

2020-02-06

రెండవ జాతీయ జ్యుడిషియల్ పే కమిషన్ తన నివేదికను గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. నాలుగు భాగాలుగా ఉన్న ఈ నివేదికలో న్యాయాధికారుల వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులపై పలు సిఫారసులు చేసింది. వాటి ప్రకారం... ప్రారంభ వేతనం రూ. 27,700గా ఉన్న జూనియర్ సివిల్ జడ్జి/ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వేతనం రూ. 77,840కి పెరగనుంది. సీనియర్ సివిల్ జడ్జి వేతనం రూ. 1,11,000, జిల్లా జడ్జి వేతనం రూ. 1,44,840 కానుంది. జిల్లా జడ్జి (సూపర్ టైమ్ స్కేల్) గరిష్ఠ వేతనం రూ. 2,24,100 ఉంటుంది.

2020-02-06

తెలంగాణలో బాలికల వరుస హత్యలకు పాల్పడిన హాజీపూర్ హంతకుడు శ్రీనివాసరెడ్డికి నల్లగొండ పోక్సో కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ముగ్గురు బాలికలను అపహరించి అత్యాచారం చేశాక హత్య చేసిన కేసుల్లో శ్రీనివాసరెడ్డి దోషి అని కోర్టు ఇప్పటికే తేల్చింది. వాటిలో రెండు కేసుల్లో ఉరిశిక్షను విధించింది. హంతకుడి దురాగతాలు గత ఏడాది ఏప్రిల్ 24న వెలుగులోకి వచ్చాయి. 101 మంది సాక్షులను విచారించి 90 రోజుల్లో తీర్పు చెప్పింది.

2020-02-06

నెల్లూరులో ఏడేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన తల్లీ కుమార్తెల హత్యల కేసులో దోషికి మరణశిక్ష పడింది. 2013 ఫిబ్రవరి 12న నెల్లూరులోని హరినాధపురంలో వైద్య విద్యార్ధిని భార్గవి, ఆమె తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. ఆర్కిటెక్ట్ అయిన ఇంతియాజ్, మరో ఇద్దరు కలసి ఈ హత్యలు చేసినట్టు అభియోగం. ఫార్మసీ కళాశాల నడుపుతున్న భార్గవి తండ్రి దినకర్ రెడ్డి వద్ద ఇంతియాజ్ ఇంటీరియర్ పనులు చేశారు. ఇంట్లో బంగారం, డబ్బు ఉన్న విషయం గుర్తించి దోపిడీ కోసం భార్గవి, ఆమె తల్లిపై దాడి చేశారు.

2020-02-06

రాజధానిపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం ఏమీ కాదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని బీజేపీ తీర్మానం చేసిందని గుర్తు చేసిన జీవీఎల్, రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మాత్రం కేంద్రం అందుకు అనుగుణంగా నోటిఫై చేస్తుందని స్పష్టం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని నిన్న కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో స్పష్టం చేసిన నేపథ్యంలో జీవీఎల్ బుధవారం ఈ అంశంపై మాట్లాడారు.

2020-02-05

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ‘సమత’ అత్యాచారం, హత్య కేసులో ముగ్గురికి ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్షను విధించింది. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దుమ్ లను ఉరి తీయాలని కోర్టు గురువారం తీర్పు చెప్పింది. హైదరాబాద్ ‘దిశ’ అత్యాచారం తర్వాత..2019 నవంబర్ 24న లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామంలో ఈ నేరం జరిగింది. డిసెంబర్ 11న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. 14న ఛార్జిషీటు దాఖలు చేయగా, 23 నుంచి 31 వరకు సాక్షలును విచారించారు.

2020-01-30

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బిజెపి మరో ఎంపీ పర్వేష్ వర్మలపై సిపిఎం నేత బృందా కారత్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా వారి ప్రకటనలు, ప్రసంగాలు విద్వేషపూరితంగా, చట్టవిరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై వెంటనే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని బృందా, సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ డిమాండ్ చేశారు.

2020-01-30 Read More

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసును సీబీఐకి అప్పగించడంలో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఏపీ హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. వివేకా కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు దాఖలు చేసినవారిలో ప్రస్తుత సిఎం వైఎస్ జగన్ కూడా ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఈ డిమాండ్ చేశారు. తాజాగా వివేకా కుమార్తె సునీత మరో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం కోర్టులో అడ్వకేట్ జనరల్ లేకపోవడంతో కేసును ఫిబ్రవరి 6కి వాయిదా వేశారు.

2020-01-28
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page