పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల నేర చరిత్రను మీడియాలో ప్రచురించాలని సుప్రీంకోర్టు మరోసారి రాజకీయ పార్టీలను ఆదేశించింది. అభ్యర్ధులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్లు వేసిన రెండు వారాల్లోగా (ఏది ముందు అయితే ఆ తేదీన) స్థానిక వార్తా పత్రికలు, పార్టీల వెబ్ సైట్లు, సామాజిక మాథ్యమ పేజీల్లో వివరాలను ప్రచురించాలని స్పష్టం చేసింది. నేరం, విచారణ లేదా దర్యాప్తు దశ అనే సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

2020-02-13

2008 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, జెయుడి చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ లోని లాహోర్ యాంటీ టెర్రరిస్టు కోర్టు (ఎటిసి) ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో నమోదైన రెండు కేసుల్లో ఐదున్నరేళ్ల చొప్పున సయాద్ కు శిక్ష పడింది. అయితే, రెండు శిక్షలనూ ఏక కాలంలో అమలు చేయాలని తీర్పు చెప్పడంతో సయీద్ కు ఊరట లభించింది.

2020-02-12

నూతన ఎమ్మెల్యే నరేష్ యాదవ్ గుడి నుంచి తిరిగి ఓపెన్ టాప్ కారులో వస్తున్నప్పుడు... గుర్తు తెలియని దుండగులు మరో కారులోనుంచి కాల్పులు జరిపినట్టు ‘ఆప్’ సోషల్ మీడియా ఇన్చార్జ్ అంకిత్ లాల్ తెలిపారు. ఆ సమయంలో పోలీసులు స్పాట్ లోనే ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, దుండగులు ఏడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. తాను ఉన్న కారుపైనే దాడి చేశారని ఎమ్మెల్యే యాదవ్ చెప్పారు.

2020-02-12

గెలిచిన ఉత్సాహంలో ఓపెన్ టాప్ కారులో ఇంటికి వెళ్తున్న ఢిల్లీ ‘ఆప్’ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్ పైన నిన్న అర్దరాత్రి కాల్పులు జరిగాయి. అయితే, ఎమ్మెల్యే లక్ష్యంగా కాల్పులు జరగలేదని ఢిల్లీ సౌత్ వెస్ట్ అదనపు డిసిపి ప్రతాప్ సింగ్ చెబుతున్నారు. కాల్పులలో చనిపోయిన ‘ఆప్’ కార్యకర్త అశోక్ మాన్ దుండగుడి అసలు లక్ష్యమని ఆయన తేల్చేశారు. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఆధారంగా దాడి చేసింది ఒక్క వ్యక్తేనని తేలినట్టు చెప్పారు. కాన్వాయ్ లో ఉన్న ‘ఆప్’ నేతల కథనం ఇందుకు భిన్నంగా ఉంది.

2020-02-12

ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆప్’ ఘన విజయం సాధించిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ పై హత్యాయత్నం జరిగింది. యాదవ్ మంగళవారం రాత్రి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు కాన్వాయ్ పైన కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక ‘ఆప్’ కార్యకర్త మరణించగా మరో కార్యకర్తకు బుల్లెట్ గాయం అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని మెహ్రౌలి నియోజకవర్గంలో యాదవ్ బిజెపి అభ్యర్ధి కుసుమ్ ఖాత్రిపై 18,161 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2020-02-12

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కోటా ఇవ్వాలని రాష్ట్రాలను బలవంతం చేయలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ ప్రజా పనుల విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ప్రమోషన్ల విషయంలో ‘ఎస్.సి, ఎస్.టి. కోటా’పై సుప్రీం ఇలా స్పందించింది. కోటా ఇవ్వాలంటూ 2012లో ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

2020-02-08

థాయ్ లాండ్ ఈశాన్య భాగంలో ‘కోరట్’గా వ్యవహరించే మిలిటరీ స్థావరం వద్ద 26 మందిని కాల్చి చంపిన సైనికుడిని పోలీసులు తుదముట్టించారు. నిందితుడిని థాయ్ 22వ అమ్యునిషన్ బెటాలియన్ జవాను జక్రపంత్ తోమాగా గుర్తించారు. కాల్చి చంపే ముందు లొంగిపేయాలా ఒప్పించేందుకు అతని తల్లిని కూడా పోలీసులు ఆ ప్రదేశానికి పిలిపించారు. థోమా నిన్న ఓ షాపింగ్ మాల్ లో చొరబడి మిలిటరీ ఆయుధాలతో కాల్పులు జరపగా 26 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు.

2020-02-09

థాయ్ లాండ్ లో ఓ దుండగుడు మిలిటరీ తరహా ఆయుధాలతో పౌరులపై జరిపిన దాడిలో 10 మంది మరణించారు. కాల్పుల దృశ్యాన్ని ఆ వ్యక్తి ‘ఫేస్ బుక్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాడు. థాయ్ రాజధాని బ్యాంకాక్ కు ఈశాన్యంగా ఉన్న కొరాట్ నగరంలో ఈ దాడి జరిగింది. సిటీ సెంటర్ లోని టెర్మినల్21లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఆ దుండగుడు ఆర్మీ కార్పోరల్ అని భావిస్తున్నారు. అతని పేజీని ‘ఫేస్ బుక్’ స్తంభింపజేసింది.

2020-02-08

ఒడిషాలోని కేంద్రపారాలో ఓ 21 సంవత్సరాల యువతి వరకట్నానికి బలైంది. రష్మితా సాహు అనే యువతి 60 శాతం కాలిన గాయాలతో కటక్ లోని ఎస్.సి.బి. మెడికల్ కళాశాల ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతోంది. గురువారం రాత్రి ఆమె మరణించినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. అత్తింటివారు ఆమెను మంచానికి కట్టేసి నిప్పు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ కేసులో బాధితురాలి అత్తమామలను, ఆడపడుచును పోలీసులు అరెస్టు చేశారు.

2020-02-07

తిరుపతి అడవుల్లో ఎర్ర చందనం ‘స్మగ్లింగ్’కు పాల్పడుతున్న ఇద్దరిని శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు ఎస్.యు.వి.లను అటకాయించి 70 ఎర్ర చందనం దుంగలను, ఆయా కార్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల కొండల పాదాల వద్ద అలిపిరి సమీపంలోని ఎన్.సి.సి. ఫైర్ రేంజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

2020-02-07
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page